కడప

వేరుశెనగ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, అక్టోబర్ 16: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న వేరుశెనగ పంటను సోమవారం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పరిశీలించారు. ఆయన నియోజకవర్గంలో వర్షాలకారణంగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులతో కలసి పరిశీలించి రైతులతో వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని సంబటూరు గ్రామపొలాల్లో చేతికొచ్చిన వేరుశెనగ పంట 30 ఎకరాల్లో నీటమునిగి కుళ్లిపోవడాన్ని చూసి బాధను వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.25వేలు చొప్పున ఖర్చుచేసి పంటసాగుచేయగా చేతికొచ్చే సమయంలో నీటమునిగి పూర్తిగా కుళ్లిపోయినట్లు రైతులు కోవూరి నారాయణరెడ్డి, నిట్టూరు వౌలాలి, శ్రీకాంతరెడ్డి, పలువురు మహిళా రైతులు వాపోయారు. తమకు జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యేకు తెలియచేసి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ద్వారా తమకు సాయం అందించాలని వారు విన్నవించారు. ఈ విషయంపై అక్కడే ఉన్న వ్యవసాయాధికారిణి మంజుల రాణితో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టాన్ని రెవిన్యూ అదికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అంచనా వేసి జిల్లా అధికారు లకు నివేదించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వైసిపి రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, వైసిపి నేతలు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలను కొంటున్న టిడిపి..

కమలాపురం, అక్టోబర్ 16: రాష్ట్రంలో రైతుల కష్టాలను విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యేలను బరితెగించి కొంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం తమ పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాదయాత్రను దెబ్బతీసెందుకు చంద్రబాబు కుట్రపన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మంత్రులను రాష్ట్రంపై వదిలారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంపై ఉన్న శ్రద్ధ అన్నదాతలను ఆదుకోవడంలో చంద్రబాబు చూపడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురిసి రైతులకు అపారమైన నష్టం కలిగి ఇబ్బందులు పడుతోంటే ముఖ్యమంత్రి కాని, మంత్రులు, పార్టీ నేతలు కాని, పంటనష్టాన్ని పరిశీలించడం రైతులకు భరోసా కల్పించడం కాని చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎన్నడూ ఏర్పడలేదన్నారు. జిల్లాలో వర్షాల వల్ల 9వేల హెక్టార్లలో వేరుశెనగ, 18వేల హెక్టార్లలో పత్తి, 6వేల హెక్టార్లలో మినుము నీటమునిగి కోట్లాదిరూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఖరీఫ్‌సీజన్‌లో అనావృష్టితో కరువువాతన పడిన రైతుకు పంటనష్టం కాని, ఇన్‌పుట్ సబ్సిడీకాని, ప్రభుత్వం మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. బుడ్డశనగ సబ్సిడీలో మంత్రులు నారాలోకేష్, సోమిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని కోట్లాదిరూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. రైతులకందించిన విత్తనాలు గ్రేడింగ్ లేక నాసిరకంగా ఉన్నాయన్నారు. ఇందులో జిల్లా వైసిపి రైతునేత ప్రసాదరెడ్డి, జిల్లా వైసిపి నేతలు సుబ్బారెడ్డి, కొండారెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.