కడప

సంప్రదింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 16: తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం జిల్లాలోని పలువురు వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి కూడా పలువురు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపి అధిష్ఠానం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల కదలికలపై ఒక కనే్నసి బుజ్జగింపుధోరణిలో వ్యవహరిస్తున్నట్లు కూడా తెలియవచ్చింది. అలాగే తెలుగుదేశంపార్టీ సీనియర్ నేతలు కూడా వైసిపి ఎమ్మెల్యేలతో కలిసి 2019 ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తుందని అందుకు నిదర్శనం నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలు, కాకినాడ నగర పాలక ఎన్నికలేనని గుర్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసిపి ఎమ్మెల్యేలు కూడా సమాలోచనలు పడ్డారు. ఒకరిద్దరు వైసిపి ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల నాటికి తమకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇవ్వాలని, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చులు భరించాలని పార్టీ టికెట్లు తమకే ఇవ్వాలని నిబంధనలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గాల్లో ఉన్న అధికారపార్టీ నేతలంతా టిడిపి సీనియర్లు కాబట్టి వారిని కాదనకుండా తమకు పార్టీ టికెట్లు ఇవ్వగలరానని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసిపి చేపట్టిన వైసిపి కుటుంబ కార్యక్రమానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మొక్కుబడిగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టిడిపి అధిష్ఠానం 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎటు తిరిగి జిల్లాలో అధికస్థానాలు కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రోజురోజుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు కక్కడం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధిపథకాలపై విమర్శలు చేయడం పలువురు తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్‌రెడ్డి వచ్చే నెల 2 నుంచి చేపట్టే పాదయాత్రలకు స్పందన ఎలా ఉంటుందోకానీ అక్కడ పాదయాత్రలు జరుగుతుండగానే జిల్లాలో వైసిపి ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు టిడిపి నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. జగన్ పాదయాత్ర సమయానికి జిల్లా ఎమ్మెల్యేలందరికీ పాదయాత్ర బాధ్యతలు అప్పగించి జగన్‌ను అనుసరించేందుకు వైసిపి అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

నాణ్యత లేని పంచాయతీరాజ్ రోడ్లు.!

కడప,అక్టోబర్ 16: జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ నేతృత్వంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.13.25కోట్లతో 2587 పనులు పూర్తి చేయగా ఆ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించి, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు రోడ్ల నిర్మాణాలు చెల్లాచెదురయ్యాయి. జిల్లాలో 142గ్రామపంచాయతీ భవనాలు నిర్మించగా వాటికి రూ.1221 లక్షలు ఖర్చు చేశారు. అలాగే 432 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించగా వాటికి రూ.853 లక్షలు ఖర్చుచేశారు. ఆ భవనాలకు కూడా అప్పుడే పగుళ్లుకొట్టాయి. ఆర్డీఎఫ్ నిధులతో 40పై బడి రోడ్లనిర్మాణానికి రూ.116లక్షలు ఖర్చు చేశారు. టిఎంజిఎస్‌వై 2వ ఫేస్ కింద రోడ్లు నిర్మాణాలు జరగలేదు. వాటికి రూ.3040లక్షలు కేటాయించినా ఆ నిధులు మూలుగుతున్నాయి. ఎంఆర్‌ఆర్ రోడ్ల నిర్మాణాల కింద ఒకరోడ్డు నిర్మించారు. ఆరోడ్డుకు రూ.42.68లక్షలు ఖర్చుచేశారు. పంచాయతీరాజ్ మెయిన్‌రోడ్లను ఇంతవరకు నిర్మాణాలు నోచుకోలేదు. అలాగే ఎస్‌సిపి రోడ్లు నిర్మించి వాటికి రూ.998.42లక్షలు ఖర్చుచేశారు. అలాగే టిఎస్‌పి 6రోడ్లను నిర్మించి రూ.120.75లక్షలు ఖర్చు చేశారు. రోడ్లను అబ్‌గ్రేడ్ చేసేందుకు హెచ్‌జిబి పథకం కింద 10రోడ్లను నిర్మించగా రూ.124.97లక్షలు ఖర్చుచేశారు. టిఎస్‌పి పథకం కింద రోడ్లను అప్‌గ్రేడ్ చేయాల్సివుండగా కొన్ని రోడ్లు నిర్మించి రూ.46.71 లక్షలు ఖర్చు చేశారు. అలాగే ఎంజిఎన్‌ఆర్ ఇజీఎస్ రోడ్లను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.140లక్షలు ఖర్చు చేయాల్సివుండగా ఒక రోడ్డు పని మాత్రమే ప్రారంభించారు. ఇంతవరకు ఆ పనులు పూర్తిచేయలేదు. 13,14 ఫైనాన్స్ నిధులతో సిసి రోడ్లు, యుజిసి రోడ్లు, ఎస్‌జిపి రోడ్లు 990రోడ్లు నిర్మించి 6529 లక్షల రూపాయలు ఖర్చుచేశారు. ఈపనుల్లో గతంలో కొన్ని పనులను వివిధ పథకాల కిందచేసుకుని పరపతి కలిగిన కాంట్రాక్టర్లే ఈ పనులు చేస్తుండగా అధికారులు తమకు పర్సెంటేజిలు అందితే చాలనే విధంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలా పనుల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఇలు, డిఇలు పని మొదలుకాగానే తమ పర్సెంటీజిలు తీసుకుని పని పూర్తయిన అనంతరం ఆ పనులకు పర్సెంటేజి చెల్లిస్తే తప్ప చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. ఏటా చిన్నపాటి వర్షాలకే రోడ్ల రూపురేఖలు మారుతున్నాయి. సంబంధిత అధికారులు దృష్టికి రోడ్ల వ్యవహారాన్ని తీసుకెళితే తాము నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్నామని అరకొర పనులకు నాణ్యత లోపించినా బిల్లులు చెల్లించడంలేదని బుకాయిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చెల్లా చెదురైన రోడ్లపై సమగ్రవిచారణ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

1100, డయల్ టు నారేషన్‌తో

డీలర్ల ఆందోళన.!

కడప,అక్టోబర్ 16: జిల్లాలో వారంలో రెండురోజులపాటు ఆ మూడు పేరిట డయల్ యువర్ నారేషన్ పేరుతో అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడంతో ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులను ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతోపాటు అవినీతి అక్రమాలకు కళ్లెంవేసేందుకు ఫిర్యాదులు నిమిత్తం 1100 నెంబర్‌ను ప్రవేశపెట్టింది. రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వ చౌకదుకాణాల్లో సరుకుల పంపిణీ, మధ్యాహ్న భోజనంలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుకు అధికారులు ఈచర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1738 చౌకదుకాణాలు ఉన్నాయి. చౌకదుకాణాల డీలర్లు పలువురు అక్రమాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే ఈపాస్ ద్వారా సరుకులు పంపిణీ నెట్ వర్క్ ఏర్పాటుచేయడం, డిస్‌ప్లే బోర్డులు నెలకొల్పాలని వివిధ రకాల నిబంధనలు పెట్టారు. ఇటీవల 400 మంది ఇన్‌ఛార్జ్, తాత్కాలిక డీలర్లను తొలగించారు. 1100 ప్రభుత్వం ప్రవేశపెట్టడం, డయల్ యువర్ నారేషన్ జిల్లా స్థాయిలో ప్రవేశపెట్టడంతో చౌకదకాణాల డీలర్లు తాము సరుకులు సరఫరా చేయలేమని ఈపొరపాటు జరిగినా ఇంటికి వెళ్లాల్సివస్తుందని భయాందోళనకు గురౌతున్నారు. అలాగే జిల్లాలో సమగ్రశిశు అభివృద్ధి పథకం ద్వారా 15 ఐసిడిఎస్ ప్రాజెక్టులలో 3620 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గుడ్లు, అరటిపండ్లు, పాలు, పౌష్టికాహారం పంపిణీలో సగానికిపైగా కేంద్రాల్లో సక్రమంగా పంపిణీ జరగడంలేదు. అనుబంధ పౌష్టికాహారం పథకం, అన్న అమృతహస్తం, పర్యవేక్షణ పౌష్టికాహారం తదితర రకాల కింద పథకాలు జిల్లాలో అమలు చేయడంలో చాలా మంది అధికారులు , అంగన్వాడీ కార్యకర్తలు రాజకీయంగా పలుకుబడి వుండటంతో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలతో నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకం విషయానికొస్తే జిల్లాలో మద్యాహ్న భోజన పథకం 3350 పాఠశాలల్లో అమలు జరుగుతోంది. దాదాపు 2లక్షల 20వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు. చాలా పాఠశాలల్లో వంట ఏజెన్సీలు, పలువురు హెడ్మాస్టర్లు కుమ్మక్కై ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారు. కూరల్లో నాణ్యతలోపించి గుడ్లు, అరటిపండ్లు విషయంలో కూడా చాలా మతలబులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో పాఠశాలల్లో కూడా బయోమెట్రిక్ అమలులోకి రావడం, దీనికితోడు 1100, డయల్ టు యువర్ నారేషన్‌తో పాఠశాలల్లో కూడా మద్యాహ్న భోజనపథకం సక్రమంగా అమలుజరుగుతుండటంతో కొంతమంది అక్రమార్కుల ఆర్జనకు బ్రేక్‌లు పడుతున్నాయి. ఏదేమైనా అవినీతి అక్రమార్కులకు ప్రభుత్వం మంచి ఆయుధం ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు.

అభివృద్ధి నిరోధకుడు జగన్

సిద్దవటం,అక్టోబర్ 16: పేద ప్రజలకోసం ప్రవేశపెడుతున్న పథకాలను అడ్డుకుంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభివృద్ధి నిరోధకునిగా మారారని విప్ మేడా మల్లికార్జునరెడ్డి విమర్శించారు. మండలంలోని పొన్నోలు, వెంకటాయపల్లె గ్రామాల్లో సోమవారం ఇంటింటికీ టిడిపి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, నియోజకవర్గం పరిశీకులు నరసానాయుడు, కేంద్రమాజీ మంత్రి సాయిప్రతాప్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ మేడా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని సమీక్షించేందుకు ఇంటింటికీ టిడిపి ద్వారా ప్రజల్లోకి వచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. తాము ఓట్లకోసం రాలేదని గతంలో కొందరు నాయకులు ఓట్లకు మాత్రమే ప్రజల వద్దకు వస్తుంటారని విమర్శించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా సమస్యలున్నట్లయితే పరిష్కరిస్తామన్నారు. జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజల కష్టసుఖాలు పాలుపంచుకునేందుకు రావడం జరిగిందని, ట్యాబ్‌లో సమస్యలు నమోదు చేసినట్లయితే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు పెన్షన్లు ఇవ్వాలని ఇతర సమస్యలు వారి దృష్టికి తెచ్చారు. ప్రతిపక్షనేత జగన్ ఉపాధిహామీ కూలీలకు డబ్బులు రాకుండా చేసేందుకు తన ఎమ్మెల్యేలు, ప్రధాని దృష్టికి తీసుకెళ్లి నిధులు రాకుండా అడ్డుకున్నారన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకోసం ఉపాధిహామీ డబ్బులు మంజూరు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి, మోహన్‌రెడ్డి, ఎంపిపి నరసింహారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, సయ్యద్ జవహర్‌బాషా, మహిళా ఉపాధ్యక్షురాలు రాజేశ్వరీరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధికమిటీ చైర్మన్ దశరధరామానాయుడు, పుత్తాసుధీర్, నగేష్‌నాయుడు, కృష్ణయ్య, సింగిల్ విండో డైరెక్టర్ బాలిరెడ్డి, సర్పంచ్ వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.