కడప

చైనా టపాసుల విక్రయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 17: చైనా టపాసులు చాలా చౌకధర అని పెద్దగా శబ్దం వస్తుందని, పలువురు టపాసుల అమ్మకాలు చేసే వ్యక్తులు చైనా టపాసులను తెప్పించినట్లు తెలుస్తోంది. మామూలు టపాసుల కంటే ధరలు తక్కువని పలువురు భావిస్తున్నారు. లక్షలాది రూపాయలు విలువచేసే చైనా టపాసులు కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు చేరినట్లు తెలుస్తోంది. కాగా సంబంధిత అధికారులు చూసీ చూడనటలు వ్యవహస్తున్నారని ఆరోపణలున్నాయ. సర్వసాధారణంగా టపాసుల్లో మందు గుండు సామాగ్రి కాలుష్యాన్ని కలిగిస్తూ ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. ఇక చైనా టపాసుల విషయానికొస్తే టపాసులు వాడే రసాయనికాలు ఆరోగ్యానికి ,పర్యావరణానికి పూర్తిగా హానికరమని తెలుస్తోంది. జిల్లాకు మామూలుగా శివకాశి, కొయ్యంబత్తూర్, తమిళనాడునుంచే టపాసులు దిగుమతి అవుతుంటాయి. ఆ టపాసుల్లో పొటాషియం, సల్ఫర్, సోడియం వాడుతారు. అవి పేల్చినా కొంతమేరకే ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించి కాలుష్యాన్ని కొంతమేరకు కలిగిస్తుంది. అయితే చైనా టపాసుల్లో పల్‌క్లోరైడ్‌లు, పొటాషియం ఫ్లోరైడ్ అధికశాతం ఉండటం వల్ల అవి పెద్దశబ్ధంతో కాలడం, ఫ్లోరైడ్, ఫల్‌ఫ్వోరైడ్ ఉష్ణోగ్రత ఎక్కువై హానికరంగా మారుతుందని తెలుస్తోంది. వాస్తవంగా చట్టం 1977 ప్రకారం శబ్దకాలుష్యాలు ఉండకూడదని , సెక్షన్ 3ప్రకారం టపాసులు ఎక్కడపడితే అక్కడ కాల్చకూడదని, సెక్షన్ 1బి ప్రకారం బాణసంచా ఎవరు తయారుచేశారో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారో స్పష్టంగా తెలిపాలి. సెక్షన్ 16ఏ బాణసంచా వస్తువులకు బార్‌కోడింగ్ ఉండాలి. సెక్షన్ 25ఏ నిబంధనలు అతిక్రమిస్తే రూ.10లక్షల వరకు జరిమానా ఉంటుంది. స్వదేశీ టపాసులకంటే విదేశీ టపాసులే హానికరమని ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని చట్టాలు చెబుతున్నాయి. పోలీసు, రెవిన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు చాలామంది టపాసుల వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకోవడం, ఆ మామూళ్లతోపాటు వారికే కాకుండా వారి కుటుంబాల బంధువులకు, స్నేహితులకు కూడా ఉచితంగా టపాసులు వస్తున్నాయని స్వదేశీ, విదేశీ టపాసులు పరిశీలించకుండానే తాత్కాలిక లైసెన్సులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చైనా టపాసులు మార్కెట్‌లోకి రాకతో పర్యావరణశాస్తవ్రేత్తలు, మేధావులు విచారం వ్యక్తం చేస్తున్నారు.