కడప

చట్టాలపట్ల అవగాహన పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, నవంబర్ 17: సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలు, న్యాయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక జూనియర్ సివిల్ జడ్జీ శివప్రసాద్‌యాదవ్ పేర్కొన్నారు. ఆయన మండలపరిధిలోని పెద్దచెప్పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం న్యాయవారోత్సవాల్లో భాగంగా జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న చిన్న విషయాలపై తరుచూ గొడవలు చేసుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ఇందుకోసం కోర్టులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందన్నారు. ప్రజలు సంయమనం పాటించి శాంతిమార్గంలో నడవాలన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరిగా కలిగి ఉండి వాహనాలు నడపాలన్నారు. అలాగే మట్కా,జూదంలాంటి వాటికి దూరంగా ఉంటే కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూ చించారు. ఇందులో ఏపిపి వీరాంజనేయులు, ఎస్సై మహమ్మద్ రఫీ, లీగల్ ఎయిడ్ కో ఆర్డినేటర్ రవీంద్రప్రసాద్, న్యాయవాదులు గురువయ్య, శ్రీనివాసులు, రామచంద్రుడు, పుష్పరాజ్, సూపరిండెంట్ అహమ్మద్ పాల్గొన్నారు.