కడప

దిశానిర్దేశం లేని యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్), నవంబర్ 17:నేటి యువత ఎటువంటి దిశనిర్దేశం లేక ఎటువెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉందని స్వామి వివేకానందస్ఫూర్తితో భారతదేశానికి యువత ఎంతో అవసరమైందని స్వామి గణేషానందజీ మహరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరామకృష్ణమిషన్‌లో వివిధ కళాశాలల నుంచి హాజరైన 700మంది బాలికలనుద్దేశించి ఆయన ఉపన్యసించారు. శ్రీరామకృష్ణమిషన్ విశాఖపట్టణానికి చెందిన స్వామిగణేషానందజీ మహరాజ్ ఉపన్యసిస్తూ ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించుకోవాలన్నారు. అనంతరం ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్ రిటైర్డ్‌జోనల్ అధికారి డా.గీతావాణిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రామకృష్ణమిషన్ అధ్యక్షుడు స్వామిసుకృతానంద మహరాజ్ మాట్లాడుతూ ఏకాగ్రతకోసం ధ్యానం అనే అంశంమీద ప్రతి ఒక్కరి దృష్టి సారించాలన్నారు. సమస్తజ్ఞానం మనలోనే ఉందని, అనంతశక్తి మనలో ఉందని ఏకాగ్రత ద్వారా జ్ఞానాన్ని వెలికితీయాలన్నారు. ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చునని దీని ద్వారా అన్ని మానసిక శక్తులు ఒకేచోట కేంద్రీకృతమై అద్భుతమైన పనులు చేయగలుగుతామన్నారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి దాదాపు 700మంది బాలికలు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
అడవిపందుల దాడితో పంటలు ధ్వంసం

సుండుపల్లె, నవంబర్ 17: అప్పులు చేసి పంటలు సాగు చేస్తే అడవిపందుల దాడికి వేరుశెనగ, వరి పంటలు సాగు చేసిన రైతులు నష్టాల బాట పడుతున్నారు. అప్పులు చేసి పంటలను సాగు చేస్తే ప్రతి యేటా నష్టపోవడం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన అటవీ శాఖాధికారులు సైతం పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. వివరాలలోకి వెళ్లితే.. మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీ కటారుముడుకుకు చెందిన గోవిందు వెంకటేశు రెండు రోజుల క్రితం 70 సేర్ల వేరుశెనగ గింజలను రెండున్నర ఎకరాలలో సాగు చేస్తే గురువారం రాత్రి అడవిపందులు నాశనం చేశాయని వేల రూపాయల నష్టం వాటిల్లిందని లబోదిబోమంటున్నారు. అదే గ్రామానికి చెందిన శీను అనే రైతు వేరుశెనగ పంటను సైతం నాశనం చేయాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నిత్యం ప్రతి యేటా నష్టపోతున్న రైతన్నలకు సాయం సైతం అందించడం లేదని రైతులు చెబుతున్నారు.
శ్రీబాలతిపురసుందరీ దేవికి ముత్యాల అలంకారం
పోరుమామిళ్ల, నవంబర్ 17: పట్టణంలోని శ్రీబాలతిపుర సుందరీదేవి సమేత రామలింగేశ్వర ఆలయంలో (శివాలయం) కార్తీక చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ముత్యాలతో ప్రత్యేక అలంకారం నిర్వహించారు. అలాగే స్వామివారికి పంచముఖ రుద్రాక్షలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక చివరి శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత గౌరవాధ్యక్షులు తులసిసుధాకర్‌ను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఆలయ ధర్మకర్త సత్యనారాయణరెడ్డి, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి, కృష్ణ, కాశయ్యలు తులసి సుధాకర్‌ను సన్మానించారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
* ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి
కమలాపురం, నవంబర్ 17: కమలాపురంలో శనివారం నిర్వహించే జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కోరారు. ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6మండలాల్లో చదువుకుని ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు వైసిపి చేపట్టిన జాబ్‌మేళా వారికి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ, డిప్లోమా, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దేశంలోని ఉతర రాష్ట్రాల్లోని ప్రసిద్దిచెందిన 15 కంపెనీలు జిల్లాలోని 5కంపెనీలు వారి ప్రతినిధులతో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారందరికి ఉద్యోగాలివ్వడం జరుగుతుందన్నారు. ఎంపికైన వారందరికి సాయంత్రం నియామక పత్రాలను అందజేస్తామన్నారు. కాగా స్థానిక సరస్వతి కాలేజిలో నిర్వహించే జాబ్‌మేళా కోసం వేదిక, ఏర్పాట్లను శుక్రవారం జిల్లా వైసిపి రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే సూచన మేరకు పరిశీలించారు. ఇందుకు అవసరమైన సూచనలను తెలియచేశారు. ఇందులో వైసిపి నేతలు పుల్లారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పండ్లతోటల పెంపకంపై ఆసక్తి చూపాలి

ఒంటిమిట్ట, నవంబర్ 17:గ్రామీణ ప్రాంతాల్లో పుడమితల్లిని నమ్ముకుని జీవితాలు సాగిస్తున్న అన్నదాతలు వ్యవసాయంలో ముఖ్య ఘట్టమైన పండ్లతోటల పెంపకంపై కూడా ఆసక్తిని పెంచుకుని, తద్వారా మంచి ఫలితాలు సాధించాలని పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని రాచగుడిపల్లెలో జరుగుతున్న ఉపాధి, మరుగుదొడ్ల నిర్మాణాలను జిల్లాకలెక్టర్ బాబూరావునాయుడుతో కలసి ఆకస్మికంగా జవహర్‌రెడ్డి పరిశీలించారు. ముందుగా గ్రామంలో చీనీతోటలు సాగుచేసే రైతుల తోటలను పరిశీలించారు. ప్రస్తుతం ముఖ్య పంటలైన వరి, అరటి, పసుపు వంటి వాటి సాగుపైనే కాకుండా వాణిజ్య పంటలైన పండ్లతోటల సాగుపై కూడ మొగ్గు చూపాలన్నారు. ప్రస్తుతం మండలంలో నీరు సంవృద్ధి ఉండడంతో బోరుబావులలో నీరు పుష్కలంగా ఉందన్నారు. అధికారుల సలహా మేరకు పండ్లతోటల సాగుతో మంచి ఫలితాలు సాధించ వచ్చునన్నారు. చీనీతోటల రైతులతో లాభ నష్టాలను వారు తెలుసుకున్నారు. పెట్టుబడి వ్యయం కోసం ప్రభుత్వ సాయంతో ఉపాధిహమీ ద్వారా చేపట్టాలన్నారు. ఏయే కాలంలో ఏయే పండ్లతోటల సాగు చేయాలో రైతులు ఆలోచించుకుని సాగు చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ఇంటిల్లిపాది కష్టపడి పండ్లతోటలు సాగు చేస్తున్నామన్నారు. అనంతరం వర్మీకంపోస్టు తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఉపాధి పనుల ద్వారా రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు. గ్రామాలలో ఉంటున్న వారు కలసి మెలసి ముందుకు సాగితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వానపాముల తయారీపై రైతులతో ఆయన మాట్లాడారు. జిల్లాకలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రతి ఒకరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. గ్రామ సమస్యలు, ఇతర సమస్యలపై వారు ప్రజలను విచారించారు. సమస్యలను ప్రభుత్వపరంగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటప్రసాద్, తహశీల్దార్ శిరీషా, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సొంత డబ్బుతో వేంపల్లె అభివృద్ధి

వేంపల్లె, నవంబర్ 17: ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన వంతు సహాయంగా రూ.25 లక్షలను తన సొంత డబ్బులను వేంపల్లె అభివృద్ధి కోసం వెచ్చించనున్నట్లు శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక మెయిన్ బజార్‌లో శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుందన్నారు. విద్య, వైద్యానికి సంబంధించి అవగాహన ఉన్న వారు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని అమలు చేస్తామన్నారు. ఏ పనులు చేస్తే ప్రజలు మేలు జరుగుతుందో ఆ పనుల గురించి తన దృష్టికి తేవాలన్నారు. మన గ్రామంలో వీధిదీపాలు క్రమబద్ధీకరించామన్నారు. అలాగే 24 గంటలు కుళాయిలకు మంచినీరు వచ్చే సౌకర్యాన్ని చేసిన ఘనత తనదేనన్నారు. ఎండాకాలం వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు పాపాఘ్నినదిలో చెక్‌డ్యాంను నిర్మిస్తున్నామన్నారు. తద్వారా తాగునీటి సమస్య ఎప్పటికీ ఏర్పడదన్నారు. ఎద్దుల కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వేంపల్లెలో 132కేవీ సబ్‌స్టేషన్ పక్కన మినీ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా వేంపల్లెను అభివృద్ధిపథంలో పయనింప చేస్తున్నామన్నారు. అనంతరం మెయిన్‌బజార్‌లోని పాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సతీష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.