కడప

రిజర్వేషన్లపై టీడీపీ నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, డిసెంబర్ 11: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు, బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చే అంశాలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయకుండా కేంద్రానికి సిఫారసుతో నాటకాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ అయినా చేసే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి అంశాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో కాపు రిజర్వేషన్, వాల్మీకి, బోయ కులస్థులను ఎస్టీలో చేరుస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారన్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫారసు చేసినాము పండుగ చేసుకోండి అంటున్నాడన్నారు. కేంద్ర ప్రభుత్వమేమో సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం అది ఎట్టి పరిస్థితుల్లోను మా పరిధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను అమలు చేసుకోవాలని చెబుతోందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీల రిజర్వేషన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంపై కూడా వేయకుండా రిజర్వేషన్లను అమలు పరిచారన్నారు. ఈ రోజుటికీ మైనార్టీలకు రాజకీయ, ఉద్యోగ, విద్యాపరంగా ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. మరి ఆ మాదిరిగా కాపుల విషయంలో కానీ, బోయ, వాల్మీకి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబువి మోసపూరిత విధానాలేనన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందే కానీ కేంద్రానికి సిఫారసు చేస్తామని చెప్పినారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మంజునాధ కమిటీని ఈ ప్రభుత్వమే నియమించిందనీ, ఆ కమిషన్ ఏమి సిఫారసు చేసిందో బయటకు చెప్పలేదన్నారు. కానీ ప్రభుత్వం కమిషనర్ ఛైర్మన్ సంతకం లేకుండానే వీళ్లు నియమించుకున్న ముగ్గురి సభ్యుల ద్వారా నివేదికను తీసుకున్నామని చెబుతున్నారని తెలిపారు. కానీ ఛైర్మన్ సంతకం లేకుండా ఆ నివేదిక చెల్లద ని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు డ్రామాలాడుతుందో ఎవరినీ మోసం చేయాలనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాబోవు ఫిబ్రవరి 2018లో డీఎస్పీ పెడుతున్నారు కదా, మరీ ఆ డీఎస్సీలో తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు, బోయ, వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారా అని అడుగుతున్నామన్నారు. ఏ నాయకుడైనా పార్టీ అయినా ప్రజలకు చెప్పేది, చేసేది చిత్తశుద్ధితో ఉండాలన్నారు. చంద్రబాబు ప్రజలను మోసగించే విధానానికి స్వస్తి చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

వివాహిత ఆత్మహత్య
సిద్దవటం, డిసెంబర్ 11: మండలంలోని వెంకటాయపల్లెకు చెందిన సోగాలపల్లె బుజ్జమ్మ (45) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అరుణ్‌రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మృతురాలి కుమారుడు శివగంగాధర్ కడపలోని పెప్సీ కంపెనీలో ప్రైవేటు ఉద్యోగం నిర్వహించే నిమిత్తం కడపకు వెళ్లాడు. ఆమె భర్త వేంపల్లె మండలం తంగేడుపల్లెలో కార్పెంటర్‌గా పనిచేసుకొంటున్నాడు. మృతురాలి కోడలు ఇంటి బయట ఉండగా ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఇంటి తలుపులు మూసి ఉండడంతో కోడలు ఎంత అరిచినా తలుపు తీయక పోవడంతో కేకలకు చుట్టుప్రక్కల వారు తలుపుపగులగొట్టడంతో బుజ్జమ్మ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.