కడప

ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, డిసెంబర్ 11: ఎయిడ్స్‌వ్యాధిని నిర్మూలించాలని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఆదరించాలని పెద్దచెప్పల్లి పిహెచ్‌సి వైద్యాధికారి బిందు రాణి పేర్కొన్నారు. ఆమె సోమవారం పెద్దచెప్పల్లిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాధి ఒకరి నుంచి మరోకరికి కలుషిత సూదుల వలన, రక్తమార్పిడి వల్ల, గర్భం ద్వారా పుట్టబోయే శిశువుకు, శారీరక అక్రమ సంబంధం వల్ల వ్యాపిస్తుందన్నారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని కలిసి జీవించడం వల్ల వ్యాపించదని తెలిపారు.వ్యాధి నివారణ కోసం మందులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి వెంకటరత్నం, సూపర్‌వైజర్ శివరామిరెడ్డి పాల్గొన్నారు. అలాగే మండలపరిధిలోని యర్రగుడిపాడు పాఠశాలలో పాయసంపల్లె పిహెచ్‌సి విస్తరణాధికారి హైస్కూల్ విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించి, గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఇందులో పిహెచ్‌సి సూపర్‌వైజర్ నాగమల్లేశ్వరి, ఏయల్‌యం మంగమ్మ, కృష్ణమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వీరభద్రస్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందాలి
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, డిసెంబర్ 11: రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో ఆలయ ఈవో మంజుల, సిబ్బందితో సమావేశమై ఆలయాభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోయే ఉత్సవాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఆలయం వెలుపల సుమారు 50 మీటర్ల మేర సిమెంట్‌రోడ్డు పూర్తిగా దెబ్బతినడం వల్ల స్వామి వారి రథం తిరగడానికి, భక్తులు నడవడానికి సైతం ఇబ్బందికరంగా ఉందని సిమెంట్‌రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయించాలని ఈవో మంజుల కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేను ఆలయ వేదపండితులు ఆశీర్వదించి సత్కరించారు.