కడప

15నుంచి పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, డిసెంబర్ 11: నియోజకవర్గంలో ప్రాణప్రదమైన సర్వారాయప్రాజెక్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం తమకిచ్చిన హామిని నిలబెట్టుకోలేకపోయిందని ఇందుకోసం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 15నుంచి రైతులతోకలసి ప్రాజెక్టు వద్దనుంచి కడపకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం పార్టీకార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడంతో నీటికోసం 15 నుంచి 18వరకు పాదయాత్ర నిర్వహించి 18న కడప కలెక్టరేట్ వద్ద వైకాపా ప్రజాప్రతినిధులు, రైతులతో కలసి బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేనట్లయితే అక్కడికక్కడే కలెక్టరేట్ వద్ద రైతులతో సామూహిక నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం నీటి రాజకీయాలు చేస్తోందని, రైతులను బలిపశువులను చేసేందుకు సర్వారాయసాగర్‌కు నీళ్లు వదిలి ఆపారని అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్న ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వాలు వస్తూపోతూ ఉంటాయని ఐతే ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం జిల్లా ఉన్నతాధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. సర్వారాయసాగర్‌కు నీటిని వదిలి నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ తాను పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సర్వారాయసాగర్ ప్రాజెక్టుపనులు 80% ఎప్పుడో పూర్తయ్యాయన్నారు. కనీసం ప్రాజెక్టుపనులపై తెలుగుదేశం నేతలకు సరైన అవగాహన లేదన్నారు. పనులు నాసిరకంగా జరిగినందువల్లే కాలువకు నీళ్లు నిలుపుదల చేయాలని తెలుగుదేశం నేతలు అధికార యంత్రాంగంపై వత్తిడి తెచ్చి నీటిని నిలుపుచేశారని ఆరోపించారు. పనుల నాణ్యతపై ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం విచారణ జరపాల్సింది పోయి రైతులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 15 నాటికి నీరు విడుదల చేయకపోతే రైతులే వామికొండ రిజర్వాయర్ నీటి గేట్లను ఎత్తివేసి సర్వారాయసాగర్‌కు నీటిని విడుదల చేస్తారని హెచ్చరించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రతిష్టను వీడి సర్వారాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో వైకాపా జిల్లా రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, జడ్పీటీసీ సురేశ్, వైకాపా నేతలు భాస్కర్‌రెడ్డి, పులిసునీల్, పల్గొన్నారు.