కడప

పార్టీలకు అతీతంగా నీళ్లు వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, డిసెంబర్ 11: జిల్లాలోని సర్వారాయసాగర్ ప్రాజెక్టుకు రాజకీయాలకు అతీతంగా నీళ్లు వదిలి పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని సర్వారాయసాగర్ ప్రాజెక్టు రైతాంగం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. ఉదయం 10.30 గంటల నుండే వీరపునాయునిపల్లె, కమలాపురం ప్రాంతాల్లోని పాయసంపల్లె, అయ్యవారిపల్లె, ఇందుకూరు, ఉరుటూరు రైతాంగం భారీ సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ ధర్నాలో రైతులు మాట్లాడుతూ సర్వారాయసాగర్ ప్రాజెక్టుకు ఒక టీ ఎంసీ నీళ్లు వదిలి ప్రస్తుతం ఆరుతడి పంటలను అనంతరం వేసే ప్రత్యామ్నాయ పంటలకు నీరు అందించి ఆదుకోవాలన్నారు. తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని వాటి ద్వారా తమను ఇబ్బందులు పెట్టవద్దని తమ రైతాంగాన్ని ప్రభుత్వం జిల్లా అధికారులు ఆదుకొనే దిశగా చర్యలు చేపట్టి వెంటనే నీటిని పంటలకు వదిలే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా చేయనిపక్షంలో ఆరుతడి పంటలతో పాటు దాని ప్రత్యామ్నాయంగా వేయాలనుకున్న పంటల సాగు కూడా దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సర్వారాయసాగర్ ప్రాజెక్టును సందర్శించి అక్కడి స్థితిగతులను తెలుసుకొని పేద, మధ్యతరగతి, చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన పొలాలే అధికంగా ఉన్నాయని, వాటిన్నిటికీ ప్రస్తుతం నీరు ఎంతో అవసరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సర్వారాయసాగర్ ప్రాజెక్టుకు నీటిని దిగువకు వదలకపోతే జిల్లా స్థాయి ఆందోళనలు చేపట్టి నిరాహారదీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ప్రతి ఆస్థికి భూధార్ ..!

జమ్మలమడుగు, డిసెంబర్ 11: ఆధార్‌ను మాత్రమే ఇప్పటివరకు చూసిన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం కొత్తగా భూ-ధార్‌ను పరిచయం చేయబోతోంది. 3ఈ-ప్రగతి2 కార్యక్రమంలో అంతర్భాగంగా దేశంలో ఎక్కడ లేనివిధంగా సాంకేతిక పరిజ్ఞానంతో పలుప్రత్యేకలతో రాష్ట్రంలో ప్రాథమికంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు పౌరసరఫరాల సంస్థ, మహిళాభివృద్ది సంస్థకే పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానం ఆస్థులకు అనుసంధానం కానుంది. ఆధార్ తరహాలోనే .. భూమి, ఆస్థులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉంటుంది. సెల్‌ఫోన్‌నుకు 10 అంకెలు, ఆధార్‌కు 12 అంకెలు ఉండడంతో భూదార్‌కు 11 అంకెలుగా నిర్ణయించారు. ఇప్పటికే పట్టాదారు పాసుపుస్తకాలకు అమలు చేస్తున్నా అది వ్యవసాయ భూములకే వర్తిస్తోంది. దీంతో అదికేవలం రెవెన్యూ పరిధిలోనే ఉండిపోతోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు తేడాలేకుండా చిన్న వ్యక్తిగత ఆస్థులు మొదలు ప్రభుత్వ భూములన్నింటికీ దీన్ని అమలుచేస్తారు. ఆస్తులు, భూములను చూస్తున్న ఆరు శాఖలకు వీటిని సమీకృతంచేస్తూ భూ-సేవా ఆన్‌లైన్ వేదిక కల్పిస్తూ అందులోనే ఈ భూదార్‌ను అనుసంధానించనున్నారు.
అమలు ఇలా...
ప్రతి చిన్న ఆస్థిని, భూములను ఉపగ్రహం ద్వారా చిత్రీకరిస్తారు. జియోట్యాగింగ్ చేసి ఆ భూమికి డిజిటల్ సరిహద్దులు, మూలలుకూడా గుర్తిస్తారు. దీన్ని జియో రెఫరెన్స్‌గా పరిగణించి, వీటన్నింటినీ భూధార్‌తో అనుసంధానించి ఒకచోట కేంద్రీకృతం చేస్తారు. తరువాత భూసేవ పోర్టల్‌లో ఈ భూధార్ సంఖ్యను నమోదుచేసి ఆభూమి పూర్తి వివరాలు తెలిసేలా ఏర్పాటు చేస్తారు.
అక్రమాలకు అడ్డుకట్ట....
ఈ విధానంవల్ల ప్రజల ఆస్థులకు డిజిటల్ భద్రత లభిస్తుంది. పురపాలికలకు, పంచాయితీలకు ఆస్థిపన్ను విధానం పారదర్శకంగా ఉంటుంది. ఆస్థుల క్రయ, విక్రయాలను డిజటలీకరించడంవల్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు, ఇతరత్రా భూమోసాలకు తావుండదు. ఇప్పటికే ఈ విధానంను కొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆ ప్రాంతాల్లో వచ్చిన ఫలితాలను ఆధారం చేసుకుని అంతటా అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం అమలులోకివస్తే ఇకపై భూతగాదాలకు చెల్లుచీటి పడినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.