కడప

అర్హులకు విరివిగా రుణాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 16: ప్రయార్టీ సెక్టార్, ఇతర ప్రయార్టీ సెక్టార్లతోపాటు అన్ని కార్పొరేషన్లకు లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని కలెక్టర్ బాబూరావునాయుడు బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌లో బ్యాంకర్ల జిల్లా కనె్సలేటివ్, జిల్లాస్థాయి రివ్యూ మీటింగ్ జరిగింది. అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది సెప్టెంబర్ ముగింపునాటికి పంట రుణాలు కింద రూ.3,150కోట్లు అందించి 71శాతం, అలాగే టర్మ్‌రుణాల కింద రూ.530కోట్లు అందించి 60శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, మార్చి ముగింపునాటికి 100శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. సిండ్ గ్రామీణ స్వయం ఉపాధిశిక్షణ సంస్థ 36మంది హిజ్రాలకు టైలరింగ్‌లో శిక్షణ కల్పించిందన్నారు. ముద్ర రుణాల కింద 1000 మందికి రుణాలు అందించడం లక్ష్యం కాగా ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున 363మంది వీవర్లకు రుణాలు అందించామన్నారు. మిగిలిన అర్హులైన 637మందిని గుర్తించి రుణాలు త్వరలో అందించాలన్నారు. 2016-17కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన యూనిట్లు గ్రౌండింగ్ చేయడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించి 70శాతం వరకు యూనిట్లు మంజూరు కాబడ్డాయని మిగిలిన 30యూనిట్లకు డిసెంబర్ 31నాటికి పూర్తి చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జి బ్యాంకు లింకేజి కింద రూ.607కోట్లకుగాను రూ.229 కోట్లు రుణాలు అందించి దాదాపు 40శాతం మాత్రం లక్ష్యం సాధించినందుకు మిగిలిన రుణాలు అందించి 100శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కౌలు రైతులకు రూ.4.98కోట్లు రుణాలు అందించడం జరిగిందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయాచారి కలెక్టర్‌కు వివరించగా రబీసీజన్ ప్రారంభమైనందున కౌలు రైతులకు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో రూ.35కోట్లమేర మొండి బకాయిలు, మార్చి 31నాటికి రికవరీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో రూ.3కోట్లతో 100 సిరికల్చర్ యూనిట్లకు స్టేట్ బ్యాంక్ ముందుకురావడం సంతోషకరమన్నారు.అనంతరం స్థానిక జయనగర్ కాలనీ ఏపీజీబీ శాఖ ఆధ్వర్యంలో చెప్పులు కుట్టుకుంటున్న 5మంది ఫక్కీర్‌పల్లె వాసులకు ఒక్కొక్కరికి లక్షరూపాయల చెక్కులను కలెక్టర్, ఎమ్మెల్యే అందించారు. సమావేశంలో నాబార్డు ఏజిఎం శ్రీనివాసులు, ఆర్‌బిఐ అసిస్టెంట్ జనరల్‌మేనేజర్ గణేషన్, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, ఏపీజీబీ రీజనల్ మేనేజర్ ప్రసాద్, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు రామచంద్రారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మితోపాటు తదితర అధికారులు పాల్గొన్నారు.