కడప

రాష్ట్రంలో నయవంచక పాలన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,డిసెంబర్ 16: అధికారపార్టీకి రైతుల సమస్యలు పట్టవని నయవంచక పాలనతో పరిపాలన సాగిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాధరెడ్డి, రాచమల్లు వెంకటశివ ప్రసాద్‌రెడ్డిలు ధ్వజమెత్తారు. సర్వారాయసాగర్‌కునీటిని విడుదల చేయాలన్న సంకల్పంతో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా రెండవరోజు శనివారం మండల పరిధిలోని కొండూరు, గోపరాజుపల్లె, నాగాయపల్లె, పెండ్లిమర్రి, ఎల్లటూరు మీదుగా గంగనపల్లె వరకు పాదయాత్ర చేశారు. అనంతరం గోపరాజుపల్లె గ్రామం వద్ద రైతులు ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ రైతులపై సవతిప్రేమ చూపిస్తూ రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గండికోట జలాశయానికి శ్రీశైలం నుంచి నీరు పుష్కలంగా వదిలినా గండికోట నుంచి సర్వారాయసాగర్‌కు ఒక్కరోజు నీటిని వదిలి నిలిపివేయడం వారి పరిపాలనకు, పారదర్శకతకు నిదర్శనమని ఇలా చేయడం వల్ల రైతుల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తవౌతున్నా అధికారపార్టీ నేతలు ప్రభుత్వాధికారులకు వత్తిడి తెస్తు నిలిపివేశారని గుర్తు చేశారు. సర్వారాయసాగర్‌కు ఒక టీఎంసీ నీటిని వదిలినా వీరపునాయునిపల్లె, పెండ్లిమర్రి, కమలాపురం మండల రైతులు పంటలు పండించుకునేందుకు, తాగునీటికి కొరత ఉండదన్నారు. ప్రభుత్వాధికారులు జలాశయానికి నీటిని వదలకపోతే త్వరలో ప్రాజెక్టు వద్ద నిరాహారదీక్ష చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఒక పక్క ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారం వచ్చాక సవాలక్ష సమస్యలు, సూచనలతో కుటుంబానికి కేవలం ఒకటిన్నర లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఆ డబ్బును కూడా విడతలవారీగా రైతుల అకౌంట్లలో జమకావడంతో బ్యాంకు అధికారులు వడ్డీలకే పరిమితం చేసుకున్నారని గుర్తు చేశారు. రైతులు పంటలు పండించుకునేందుకు పెట్టుబడికి డబ్బులు లేక, బయట వడ్డీలు కట్టలేక అప్పులుపాలౌతున్నారని రైతులను పూర్తిగా అప్పుల ఊబిలోకి దించేందుకు టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎమ్మెల్యేలు విమర్శించారు. ఇప్పటికైనా రైతుల సమస్యలు తెలుసుకుని కమలాపురం ప్రజలు పంటలు పండించుకునేందుకు సర్వారాయసాగర్ ప్రాజెక్టుకోసం నీటిని విడుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ చంద్రారెడ్డి, వైసిపి నేత దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వెంకటశివారెడ్డి, సర్పంచ్‌లు రఘునాధరెడ్డి, నాగమల్లేష్, పెద్ద సిద్దారెడ్డితోపాటు వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
పాదయాత్రకు గైర్హాజరైన వైసీపీ మండల నాయకులు
కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి సర్వారాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని చేపట్టిన పాదయాత్రకు మండల వైకాపా అధ్యక్షురాలు సి.అనూరాధ, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి, జెడ్పిటిసి భాస్కర్‌తోపాటు మండల నాయకులు మమ్ముసిద్దిపల్లె శివారెడ్డితోపాటు పలువురు నాయకులు గైర్హాజరుకావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో వైకాపాలో రెండు గ్రూపులుగా విడిపోయినట్లు ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే వైకాపా కంచుకోట అయిన పెండ్లిమర్రి మండలంలో మెజార్టీ తగ్గిపోవడం ఖాయమని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా వైకాపా ఎమ్మెల్యేలు, జిల్లా అద్యక్షుడు సమస్యను పరిష్కరిస్తే తిరిగి వైకాపాకు పెండ్లిమర్రి కంచుకోటగా నిలుస్తుందని భావిస్తున్నారు.

కొనసాగుతున్న ఎమ్మెల్యే పాదయాత్ర
కమలాపురం, డిసెంబర్ 16: సర్వారాయసాగర్ ప్రాజెక్టు నీటికోసం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ప్రారంభించిన పాదయాత్ర శనివారం రెండోరోజు కొనసాగింది. ఆయన వీయన్‌పల్లె మండలం సంగమేశ్వర దేవళాల నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించి పాపాగ్ని నది లోని బాటవెంటడి పెండ్లిమర్రి మండలంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన ఆ మండలంలోని కొండూరు గ్రామం పొలిమేర వద్ద పెండ్లిమర్రి మండల వైకాపా కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో పార్టీనేతలు, కార్యకర్తలు, రైతులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన కారపురెడ్డిపల్లె, నాగాయపల్లె, పగడాలపల్లె, పెండ్లిమర్రి, యల్లటూరు మీదుగా గంగనపల్లె చేరుకుని రాత్రి ఆ గ్రామంలోని పాఠశాలలో బసచేశారు. కాగా ఎమ్మెల్యే పాదయాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పాల్గొని సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వారాయప్రాజెక్టు నీటికోసం ఎమ్మెల్యే చేస్తున్న పాదయాత్ర స్వాగతించ విషయమన్నారు. ప్రభుత్వం సోమవారం నాటికి స్పందించి నీటిని విడుదల చేయకపోతే కడప కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి పాల్గొనే సామూహిక నిరవధిక నిరాహాక దీక్షకు తన సంఘీభావం ప్రకటించి పాల్గొనడం జరుగుతుందన్నారు. అలాగే ఎమ్మెల్యే పాదయాత్రలో కమలాపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జిల్లా వైకాపా రైతు విభాగం కన్వీనర్ పుత్తాప్రసాదరెడ్డి, జిల్లా పార్టీకార్యదర్శి తురకపల్లె రాజశేఖరరెడ్డి, వీయన్‌పల్లె పార్టీ మండల కన్వీనర్ రఘునాధరెడ్డి, కమలాపురం పార్టీనేతలు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.