కడప

సంక్షేమపథకాలు ప్రజలకు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 11: ప్రభుత్వం పేద ప్రజలకోసం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు వారికి అందేందుకే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ప్రవేశపెట్టారని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక సహకారశాఖ మంత్రి సీ.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా ఏ ప్రభుత్వం ఆలోచించనివిధంగా జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి రూపకల్పనచేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే ఏర్పాటుచేశారని అన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సభాభవన్‌లో గురువారం జన్మభూమి-మా ఊరు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆస్తుల పంపిణీ మహోత్సవం ఆనందలహరి మా పంట-మా వంటలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. జిల్లాలో 12సంక్షేమశాఖల ద్వారా రూ.35కోట్లు విలువైన ఆస్తులను లబ్దిదారులకు ఆయన లాంఛనంగా పంపిణీ చేశారు. 816మందికి మంజూరుచేసిన ఇళ్లపట్టాలను లాంఛనంగా లబ్దిదారులకు అందించారు. రేషన్‌కార్డు ఉంటేపెన్షన్, ఇల్లు, ఇళ్లపట్టాలు మొదలైన అన్నిసంక్షేమ పథకాలకు అర్హులౌతారని చెబుతూ, రేషన్‌కార్డుకు దరఖాసుకున్న అర్హులందరికీ కార్డులను మంజూరుచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో గృహాలమంజూరు విషయంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకుండా అందరికీ లబ్దిచేకూరుస్తున్నామన్నారు. కడప జిల్లాలో ఈ విడత 75వేల కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంతకుముందు చంద్రన్న బీమా పథకం లేదని, ప్రస్తుతం కేవలం రూ.15 కట్టి పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినవారికి రూ.5లక్షలు, అనారోగ్యరీత్యా మరణిస్తే రూ.2లక్షలు, 50సంవత్సరాలు లోపు చనిపోతే రూ.5లక్షలు తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి కుటుంబం చంద్రన్నబీమాలో చేరడం ద్వారా కుటుంబ భద్రతను పొందాలన్నారు. గతంలో లాగా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదని రైతులకు పగటిపూటనే ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు. కేవలం రూ.149లకే నెట్ కనెక్షన్, 250 ఛానళ్లతో టీవీ కనెక్షన్, 3్ఫన్ కనెక్షన్లతో ఫైబర్ కేబుల్‌నెట్ వర్క్ ఏర్పాటుచేసే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఈసమావేశంలో రాష్టప్రౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పేదల సమస్యలను తీర్చే పండుగేనని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పేదలు ఉన్నతస్థాయికి ఎదిగేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి అందిస్తోందన్నారు. ఈకార్యక్రమంలో దత్తత, సీమంతాల బ్రోచర్‌ను, వాల్‌పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. గర్భిణీ స్ర్తిలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ టీ.బాబూరావునాయుడు, జేసీ శే్వతతెవతియ, జెసి-2 శివారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ నౌమాన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ఈడీలు శ్రీలక్ష్మీ, పూర్ణచంద్రరావు, జహీర్ అహమ్మద్, ఎల్‌డిఎం ఆంజనేయాచారి, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, విద్యాశాఖ ఏడి జిలానీబాషా, ఐసిడిఎస్ డిడి మమత, డిసిపివో శివప్రసాద్‌రెడ్డి, నాయకులు అమీర్‌బాబు, దుర్గాప్రసాద్, అన్వర్‌హుస్సేన్, జిలానీబాషా తదితర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

19 లక్షల ఇళ్లు ఇవ్వడమే లక్ష్యం
పోరుమామిళ్ల, జనవరి 11: 2019 సంవత్సరానికి రాష్ట్రంలో 19 లక్షల ఇండ్లును నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభులు సియం రమేష్‌నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని పేగురుపేట ప్రభుత్వ ఆసుపత్రి జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు సియం రమేష్‌నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా వుండాలని దోచుకున్న డబ్బు సరిపోక రాష్ట్రంలో సంపదన దోచుకుని జైలు పాలు అయ్యి పరువు పోయివుండేదని పరోక్షంగా ప్రతి పక్ష నేతను ఉద్ధేసించి ప్రసంగించారు. చంద్రబాబునాయుడు పరిపాలనలో రైతులకు ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన కరెంటు అందించడంలో సఫలీకృతుడు అయ్యారన్నారు. రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 500 కోట్లు, సంవత్సరానికి 6,000 కోట్లు రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ప్రజలు సంతోషంగా వుండేందుకు మెరుగైన సేవలు అందించేందుకు వారి కష్ట సుఖాలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకే అధికారులను పంపి వారికి ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించాలన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నారు. ఇరిగేషన్ పథకంలో పట్టిసీమ నుండి శ్రీశైలం, అక్కడ నుండి కడపకు నీటిని తీసుకొచ్చేందుకు కష్టపడుతున్న నాయకుడు చంద్రబాబునాయుడే అన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, రైతులకు అన్ని వర్గాల వారికి లబ్ది చేకూరాలన్న సంకల్పంతో జన్మభూమి కార్యక్రమంలో ప్రజలకు చేరువైతున్నారన్నారు. ఈ సందర్భంగా బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పథకం కావాలన్న అడిగిన తక్షణమే అందించడంలో తెలుగుదేశం పార్టీ ముందుందన్నారు. ముస్లీంకు, హిందువులకు, క్రైస్తవులకు అతీతింగా ప్రజల భాగోగులను చూసిన నాయకుడు చంద్రబాబునాయుడే నని పేర్కొన్నారు. కడప జిల్లాను ఆర్టికల్చర్ హబ్బుగా చేస్తారని హామీ ఇచ్చారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానన్నారు. అలాగే యోగివేమన పాలక మండలి సభ్యురాలు ఎండి విజయజ్యోతి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా అదికారులను ప్రజల ముందు నిలబెట్టి వారి సమస్యలను అప్పటి కప్పుడే పరిష్కరించడంలో దోహదపడుతుందన్నారు. చంద్రన్న కానుకలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, మహిళలకు గ్యాస్ సబ్సిడీ, పెళ్ళి కానివారికి పెళ్ళికానుకలు, అర్హులైన వారికి ఫెంఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలనేదే ఆయన లక్ష్యం అన్నారు. అనంతరం మహిళలకు రాజ్యసభ సభ్యుడు సియం రమేష్‌నాయుడు చేతుల మీదుగా డ్వాక్రా చెక్కులను అందజేశారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు సీమంతం కార్యక్రమం చేపట్టారు. చేకూరుపేట బ్యాంకు మేనేజర్‌ని ఘనంగా సీఎం రమేష్‌నాయుడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భైరవ ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ క్రిష్ణమూర్తి, తహసీల్దార్ శేషారాంసింగ్ , ఏఈ నరసింహారెడ్డి, సీఐ పద్మనాభం, డాక్టర్ శివక్రిష్ణ, అధికారులు నాయకులు పాల్గొన్నారు.
జన్మభూమికి జనం కరువు.!
* చిన్నారులతోనే సభ నిర్వహణ
జమ్మలమడుగు, జనవరి 11: జన్మభూమి కార్యక్రమం నిర్వహణతో ప్రజలకు దగ్గరవ్వాలన్న ప్రభుత్వ ఆలోచన, ఆశయాలు నీరుగారిపోయాయి. కనీస అవగాహన, పెద్దగా ప్రయోజనాలు కనిపించకపోవడంతో జన్మభూమిలో జనం కరువయ్యారు. మండలంలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో గురువారం నిర్వహించే జన్మభూమి కార్యక్రమం పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతోంది. జన్మభూమి నిర్వహణలో భాగంగా ప్రభుత్వం ఈనెల 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఎన్నో వ్యయప్రయాసలతో కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో ప్రజల వద్ద వెళ్లి, వారి సమస్యల పరిష్కరించడమే ధ్యేయంగా కార్యక్రమం రూపొందించారు. అధికారుల ఏమరుపాటు, ప్రజాప్రతినిథుల నిరాసక్తత కారణంగా ప్రభుత్వ ఆశయం గ్రామ సభల ద్వారా ఒనకూడిన దాఖలాలు కరువయ్యాయి. సున్నపురాళ్ల పల్లె గ్రామంలో చివరి రోజు అధికారులు గ్రామ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు మధ్యాహ్నం 12గంటల సమయం వరకు రాకపోవడంతో చిన్నారులే గ్రామ సభలో కూర్చొని ఉండి నిండుగా కనిపించారు. దీంతో అధికారులు ప్రజల తీరుతో తలలుపట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా కనీస అవగాహనను అధికారులు కల్పించారా లేక ప్రజలకే ఆసక్తి కొరవడిందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రజాప్రతినిథులు చిత్తశుద్దితో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉక్కు పరిశ్రమ తీసుకొస్తాం
పులివెందుల, జనవరి 11: కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ తీసుకొస్తామని గిడ్డంగుల శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు తెలిపారు. గురువారం పులివెందులలోని ఎర్రగుడిపాళెంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పులివెందుల ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి కాని ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంస్థ పనులను పూర్తి చేసి పూర్తిగా పరిశోధనలు జరిగే విధంగా చూస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉద్యానవనం పంటలు అధికంగా పండుతాయి కాబట్టి ప్రతి మండలానికి సీతల గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 50 లక్షల పింఛన్లును మంజూరు చేసి అందరికీ అందిస్తున్నామన్నారు. గత 35 సంవత్సరాల నుంచి పులివెందులలో సర్పంచు నుంచి పార్లమెంటు సభ్యుల వరకు వైయస్ కుటుంబికులే పాలిస్తున్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడలేదన్నారు. పాలు ఇచ్చే కామధేనువైతే తనే్నవాడు జగన్ అన్నాడు. ఇప్పటికైనా తెలుగు దేశం చేసే అభివృద్థి చూసి ప్రజలలో మార్పు వచ్చి 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ బిటెక్ రవి, మాజీ శాశన మండల డిప్యూటీ ఛైర్మెన్ సతీష్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మెన్ రాఘవరెడ్డి, కమిషనర్ మధుసూధన్‌రెడ్డి, టీడీపీ నాయకులు రాంగోపాల్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గోన్నారు.
జన్మభూమి లక్ష్యాలకు చేరువయ్యాం
రాజంపేట, జనవరి 11: జన్మభూమి లక్ష్యాలకు చేరువయ్యేలా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మన్నూరులో జన్మభూమి గ్రామసభలో మేడా పాల్గొని మాట్లాడుతూ గ్రామసభల ద్వారా అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చామన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా వివిధ వర్గాల ప్రజల నుండి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించబడుతాయన్న భావన ప్రజల్లో తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎక్కడైనా అధికారులు స్పందించకుంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా కోరారు. జిల్లా తెలుగుమహిళా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆశయం నెరవేరిందన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జన్మభూమి గ్రామసభల దృష్టికి వచ్చాయని, వీటన్నింటిపై తాము ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు రాయితీతో కూడిన రుణాలను అందించడంతో పాటు, గర్భవతులకు సీమంతాలు జరిపారు. వివిధ వర్గాల ప్రజల నుండి సమస్యపై వినతులు స్వీకరించారు.
రూ.6.60 కోట్లతో కాజ్‌వే పూర్తి
సుండుపల్లె, జనవరి 11: అభివృద్ధే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని, రూ.6.60 కోట్లతో కాజ్‌వే పనులు పూర్తిచేయడం జరిగిందని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మల్లేల శ్రీవాణిలు తెలిపారు. సోమవారం మండలంలోని రాయవరం గ్రామంలో బహుదానదిపై నూతనంగా నిర్మించిన కాజ్‌వేను ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ప్రజల సంక్షేమంకోసం ప్రభుత్వం రూ.6.60 కోట్లతో వంతెన నిర్మాణం చేయడంచూస్తే అభివృద్ధి ఏ మేరకు జరుగుతున్నదో అర్థమవుతోందన్నారు. భారీ వర్షాలువస్తే సుమారు 60 గ్రామాలు ప్రజలు సుండుపల్లెకు రాలేని స్థితిలో ఇబ్బందులు పడేవారని, కానీ ప్రస్తుతం ప్రజలు అభివృద్ధి పనులకు నీరాజనం పడుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో 4 నెలల్లో రూ.9 కోట్లతో నిర్మాణంలో ఉన్న తిమ్మసముద్రం కాజ్‌వేను పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామన్నారు. నియోజకవర్గ చరిత్రలో ఎవరు, ఏ ప్రభుత్వం చేయని రీతిలో అభివృద్ధికి నాంది పలికిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఒకటేనని మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. అనంతరం సుండుపల్లెలో నూతనంగా నిర్మించిన స్ర్తిశక్తి భవనాన్ని ప్రారంభించారు. మహిళల అభివృద్ధికోసం స్ర్తిశక్తి భవనాన్ని రూ.40 లక్షలు వెచ్చించి సర్పంచ్ జయమ్మ చొరవ తీసుకొని పూర్తి చేయడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తే ఆ కుటుంబాలు బాగుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శివారెడ్డి, డ్వామా పీడీ హరిహరనాధ్, ఏపీఎం రెడ్డయ్య, ఏసీ వేణుమాధవ్, ఏపీవో సురేంద్రారెడ్డి, టీడీపీ నాయకులు రాజకుమార్‌రాజు, మాజీ సర్పంచ్ రమణ, చాన్‌బాష తదితరులు పాల్గొన్నారు.
మాండవ్యనది పరిశుభ్రానికి కృషి
రాయచోటి, జనవరి 11: మాండవ్యానదిలో పేరుకుపోయిన చెత్తాచెదారంతోపాటు కాలువల పరిశుభ్రతకు కృషి చేస్తామని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. గురువారం 29, 30వ వార్డులకు సంబంధించి జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని పాతరాయచోటిలోని శివాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని చేపట్టారని, దీనివలన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. స్థలం ఉండి ఇండ్లు కట్టుకోనివారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకుంటే వెంటనే మంజూరు చేయిస్తామన్నారు. పింఛన్ కొరకు మునిసిపాలిటీలో దరఖాస్తులు చేసుకున్న వారికి ఐడీ నెంబర్ వస్తుందని, మునిసిపాలిటీలో 2 వేల మంది రేషన్‌కార్డుల కొరకు దరఖాస్తులు చేసుకోగా 1,400 రేషన్‌కార్డులు మంజూరవడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ సంక్రాంతి పండుగ అయిన తరువాత నుండి చేపడతామని, ఇందుకొరకు రెండు జేసీబీలను కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పింఛన్ల కొరకు 4,600 మంది దరఖాస్తులు చేసుకోగా వారిలో 2 వేలు మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చంద్రమోహన్‌రెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డిల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, మిగతా పింఛన్లు కూడా అందేటట్లు ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను జన్మభూమిసభలో అర్జీల రూపంలోఇస్తే అధికారులు వాటిని తీసుకొని రశీదులు ఇస్తారని, దీనివలన తొందరలోనే సమస్యలు తీరతాయన్నారు. మాండవ్యానదిలో ఎటువంటి నీళ్లు రాకుండా కాలువల ద్వారానే వెళ్లేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం లబ్దిదారులకు మంజూరైన రేషన్‌కార్డులను, చంద్రన్న సంక్రాంతి కానుకలను ఆయన పంపిణీ చేశారు. మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఖాదర్‌బాష, మునిసిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు, జానం రవీంద్ర, మనోహర్, కౌన్సిలర్లు పుణ్యవతి, అమరనాధ్, రషీద్, నాగేంద్రరావు, ఆనంద్‌రెడ్డి, సహదేవ, మస్తాన్, టీడీపీ నాయకులు మనే్నరు రామాంజనేయులు, వేణు, నాగేంద్ర, కటారు శివ, లక్ష్మయ్య, నాగరాజ, సుగవాసి ఈశ్వర్, యుగంధర్, జిలాన్, సాయిరాంరాజు, బడిశెట్టి రవి, వాకా పవన్, శీనా, నరసింహులు, వాటర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చెన్నూరు, జనవరి 11: ప్రభుత్వం పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధేలక్ష్యంగా పనిచేస్తోందని కడప మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి పేర్కొన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణంలో జన్మభూమి -మా ఊరు గ్రామసభ స్థానిక 3వ వార్డు ఎంపీటీసీ తులసమ్మ అధ్యక్షతన జరిగింది. ఈసభలో శివారెడ్డి మాట్లాడుతూ సాగునీరు-తాగునీరు కొరతలేకుండా ప్రభుత్వం చేసిందని ఎక్కడ చూసినా నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జిల్లాకు పట్టిసీమ నీరు తెప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన హిజ్రాలు సభ ఆవరణంలో ఆశీనులు కావడంతో సభ ఆసక్తికరంగా గ్రామసభకు ప్రజలు వారిని తిలకించారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన పౌష్టికాహారం స్టాల్స్, ఆయుర్వేద వైద్యశిబిరం, స్థానిక ప్రాథమిక ఆరోగ్యశిబిరం ద్వారా సభకు వచ్చిన ప్రజలకు వైద్యసేవలు అందించారు. ప్రజల అర్జీలను ఆయాశాఖలకు సంబంధించిన అధికారులు స్వీకరించి అర్జీదారుడికి తిరిగి రశీదు ఇవ్వడం జరిగింది. మండలంలో డిగ్రీ, ఇంటర్, బిటెక్ చదివిన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందజేశారు. కలెక్టర్ బాబూరావునాయుడు, జెసి శే్వతతెవతియ జిల్లాలో హిజ్రాలకు 57 మందికి ఇళ్లస్థలాలు చెన్నూరు మండలం రుద్రభారతిపేట ప్రాంతంలో కేటాయించగా వాటికి సంబంధించిన ఇంటిపట్టాలు గ్రామసభలో మండల తహసీల్దార్ సత్యానందం, స్పెషలాఫీసర్ పెంచలయ్య, ఎంపీడీవో మహబూబ్‌బీ, ప్రజాప్రతినిధులు విజయభాస్కర్‌రెడ్డి, శివారెడ్డి, బుజ్జన్నలు హిజ్రాలకు పట్టాలు పంపిణీచేశారు. వీరితోపాటు 7మంది వికలాంగులకు ఇళ్లస్థలాలకు సంబంధించి పట్టాలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రికి
రుణపడివుంటాం - హిజ్రాలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిజ్రాలకు చేస్తున్న సేవలకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని గ్రామసభకు వచ్చిన హిజ్రాలు లక్ష్మీ, జానకీ, సునీత, వెనె్నల తదితరులు తమ సంతోషాన్ని వెళిబుచ్చారు. హిజ్రాలకు ఇంటిస్థలాలు, పక్కాగృహాలు, రేషన్‌కార్డులు, ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో ఏ ముఖ్యమంత్రి హిజ్రాలకు చేసివుండరని మన రాష్ట్రంలో హిజ్రాలకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతీసుకోవడం అభినందనీయమన్నారు. వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి, హౌసింగ్ ఏఇ గోపాలకృష్ణ, పిఆర్ ఏఇ సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ రీసోర్స్‌పర్సన్ సుబ్బారెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు గ్రామసభకు వచ్చారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట:ప్రజాసమస్యల పరిష్కారంకోసం తలపెట్టిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పండుగ వాతావరణంలా కన్పిస్తోందని మండలాధ్యక్షురాలు గుజ్జల సుమలత అన్నారు. మండలంలో జన్మభూమి చివరిరోజు కావడంతో గురువారం బీ.కొత్తపల్లె, తిప్పాయపల్లె గ్రామాల్లో జన్మభూమి సభలు నిర్వహించారు. ఈసందర్భంగా మండల ప్రత్యేక అధికారి సూర్యప్రకాశ్‌రావు, ఎంపీడీవో వెంకటరమణ, తహసీల్దార్ పార్వతీలు పాల్గొన్నారు. కొత్తరేషన కార్డులు, పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈకార్యక్రమాల ముందు పలు ఆటల పోటీలు, ముగ్గులపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులచే, ప్రజలచే ఏర్పాటుచేశారు. అనంతరం సభలో విజేతలకు బహుమతులు అందించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మండల అధికారులు కిరణ్‌కుమార్‌రెడ్డి, రాధాకృష్ణవేణి, వైద్యాధికారి సెల్వియాసాల్మాన్, ఎంఇవో ప్రసాద్, పిఇటిలు ఆనందరావు, సుభద్రమ్మ, ఐసిడిఎస్ అధికారులు , పోలీసుశాఖ తదితర సిబ్బందిపాల్గొన్నారు.
చింతకొమ్మదినె్నలో...
చింతకొమ్మదినె్న: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న 5వ విడత జన్మభూమి కార్యక్రమంలో గురువారం జరిగిన చివరిరోజు జన్మభూమి చింతకొమ్మదినె్న మండల ప్రధాన కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించారు. స్పెషలాఫీసర్ యామినీ పూర్ణిమా ఆధ్వర్యంలో జన్మభూమి నిర్వహించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షుడు ప్రజలనుద్ధేశించి మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జన్మభూమి కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని ఈనెల 2నుంచి 11వ తేది వరకు జరిగిన జన్మభూమిలో వచ్చిన వినతులు అధికారులు త్వరితగతిన విచారించి సకాలంలో న్యాయంచేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన చంద్రన్నబీమా పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీప్రజలకు పెళ్లికానుకగా రూ.30వేలు, రూ.50వేలు అందించడం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సంక్రాంతి చంద్రన్నకానుకపేరుతో ప్రతి ఒక్కరికీ రూ.200లు విలువచేసే సంక్రాంతి సరుకులు ఇవ్వడం ప్రతి పేదవాడికి సంతోషం కలిగిందన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారితోపాటు హౌసింగ్ ఇంజనీర్, జిల్లాపరిషత్ ఇంజనీర్ నరసింహారెడ్డి, ఎంఇవో నాగమునిరెడ్డి, డ్వాక్రా ఏపీఎం యామినీపూర్ణిమ, సీసీలు , పాఠశాల ప్రధానోపాధ్యాయులతోపాటు మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
సిద్దవటంలో....
సిద్దవటం: మండలంలోని మాధవరం , శాఖరాజుపల్లె గ్రామపంచాయతీల్లో ఆయా గ్రామసర్పంచ్‌ల అధ్యక్షతన జన్మభూమి గ్రామసభలు గురువారం ముగిశాయి. ఈసందర్భంగా ఎంపీపీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఉగాది నుంచి రాష్ట్రప్రభుత్వం పేదలకు పెళ్లికానుక కార్యక్రమం అమలుచేయనుందన్నారు. ఎస్టీలకు రూ.50వేలు, ఎస్సీలకు రూ.40వేలు, బీసీలకు రూ.35వేలు చొప్పున పెళ్లిరోజు కానుక అందజేస్తారన్నారు. సంబంధిత పత్రాలు ఇవ్వాల్సివుందన్నారు. మండలంలో పార్టీలకు అతీతంగా జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయి. ఇందుకు సహకరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు గౌడరామచంద్రయ్య, వ్యవసాయాధికారిణి పద్మావతమ్మ, ప్రజలు పాల్గొన్నారు.
పెండ్లిమర్రిలో...
పెండ్లిమర్రి: ప్రజల యొక్క సమస్యలు గ్రామాల్లోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని మండల స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని మాచునూరు గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ హేమసుందర్‌రావు, సీకె దినె్న, వల్లూరు ఎస్‌ఐలతోపాటు 12మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటుచేశారు. గతంలో ఈగ్రామంలో ఫ్యాక్షన్ నెలకొని ఉండటంతో బందోబస్తు ఏర్పాటుచేశామని సీఐ తెలిపారు. ఈసందర్భంగా స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ రైతులు, ప్రజలయొక్క సమస్యలను పరిష్కరించడంలో గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం సస్పష్టంగా కనబడుతోందని, ఈనిర్లక్ష్యధోరణి నిర్మూలించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి కార్యక్రమం, మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమం లాంటివి ప్రవేశపెట్టి గ్రామంలోనే వారియొక్క సమస్యలు పరిష్కరించాలని సూచించారన్నారు. తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌యు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు సోమశేఖర్‌రెడ్డి, ముజీబ్, నాగార్చన, ఎంఇవో సుజాత, ఇవోపీఆర్‌డీ రఘునాధరెడ్డి అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
చింతకొమ్మదినె్న, జనవరి 11: మండల ప్రధాన కేంద్రంలోని జెడ్పి హైస్కూల్‌లో ఆఖరురోజు గురువారం నిర్వహించిన జన్మభూమిలో సాంస్కృతిక కార్యక్రమాలు మండల ప్రజలను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. జన్మభూమి అనంతరం జెడ్పిహైస్కూల్‌లో నిర్వహించిన పోటీలకు మండల పరిధిలోని మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీ, వంట పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంఇవో నాగమునిరెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది ఏపివో రామాంజనేయరెడ్డి, డ్వాక్రా మహిళల ఏపిఎం యామినీ పూర్ణిమ ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు.
శివరాత్రి మహోత్సవాలకు కొటేషన్ల ఆహ్వానం
సిద్దవటం, జనవరి 11: ఫిబ్రవరి 12,13,14వ తేదీల్లో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధి వరకు బ్యారిగేట్లు, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, పూలడెకరేషన్లకోసం కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దేవాదాయ ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ శంకర్‌బాలజీ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని శ్రీనిత్యపూజయ్యస్వామి కొండకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్నారు. ఈ ఉత్సవాల్లో పంచలింగాలస్వామి ఆలయంనుంచి స్వామి సన్నిధి వరకు డెకరేషన్ చేయాల్సివుందన్నారు. స్వామిసన్నిధిలో పూల అలంకరణ చేయాల్సివుందన్నారు. ఈనెల 15లోగా కడపలోని దేవాదాయ ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో కొటేషన్లు అందజేయాల్సివుంటుందన్నారు.
కోడిపందెంరాయుళ్ల బైండోవర్
చిన్నమండెం, జనవరి 11: మండలంలోని చాకిబండ గ్రామంలో కోడిపందేలు ఆడుతూ గతంలో పట్టుబడినటువంటి వారిపై గురువారం ఎస్‌ఐ పది మందిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పది మందిని తహసీల్దార్ ఎదుట ఉంచి సొంత పూచీకత్తుమేరకు వారిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుధాకర్, ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, పోలీసులు, తహసీల్దార్ పాల్గొన్నారు.
జూదరుల అరెస్టు
సంబేపల్లె, జనవరి 11: మండల పరిధిలోని రౌతుకుంట గ్రామ శివార్లలో ఏడు మంది జూదరులను అరెస్టు చేసినట్లు గురువారం ఎస్ ఐ సయ్యద్ హషం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు రౌతుకుంట గ్రామశివార్లలో జూదమాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తమ సిబ్బందితో వెళ్లి జూదం కేంద్రంపై దాడి చేసి ఏడు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.15 వేలు నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు నిందితులను హాజరపరచనున్నట్లు తెలిపారు.
సాంఘిక సంక్షేమానికి రూ.8.87కోట్లు
సిద్దవటం, జనవరి 11: మండలంలోని సాంఘిక గిరిజన వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు ప్రభుత్వం నుంచి రూ.8కోట్ల 87లక్షల 73వేలు ప్రభుత్వం బ్యాంకులకు అనుసంధానం చేసినట్లు ప్రత్యేక అధికారి సుబ్బారావు తెలిపారు. స్థానికంగా హాస్టల్‌వెల్ఫేర్ అధికారులు, హాస్టల్ విద్యార్థులతో ఆయా నిధులకు సంబంధించిన బ్యాంకు అనుసంధానం చెక్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని 7211మంది సాంఘిక గిరిజన వెనుకబడిన హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫ్రీ, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతోపాటు ఇతర కార్యక్రమాలకు కలెక్టర్ మంజూరుచేసిన చెక్కును ఆయన అందజేశారు. రాబోయే ఆర్థికసంవత్సరంలో జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామన్నారు. తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి లబ్దిదారులకు ఇంటినివేశన స్థలాల పట్టాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నరసింహారెడ్డి, ఎంపీడీవో జయసింహ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ విద్యార్థినుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకే స్పోర్ట్స్‌మీట్
వల్లూరు, జనవరి 11: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినీల్లో దాగివున్న క్రీడా సృజనాత్మకతను వెలికితీసేందుకే జిల్లాలోని 29 కస్తూరీబాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థినీలకు స్పోర్ట్స్‌మీట్ నిర్వహించడం జరిగిందని బాలికా అభివృద్ధి అధికారిణి మేరీ అన్నారు. గురువారం గంగాయపల్లె హైస్కూల్‌లో ముగిసిన జిల్లాస్థాయి కెజీబీవీల స్పోర్ట్స్‌మీట్‌కు ఆమె ముఖ్యఅతిధిగా హాజరై విద్యార్థినీలనుద్దేశించి మాట్లాడారు. బుధవారం, గురువారాల్లో నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన బాలికలకు జిసిడివో మేరీ, గంగాయపల్లె హెచ్‌ఎం గంగాధర్‌నాయక్‌లు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆదర్శపాఠశాల ప్రిన్సిపల్ దిలీప్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయాలి
కమలాపురం, జనవరి 11: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసెందుకే యల్‌యల్‌యల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇందుకు భారతి సిమెంట్సులోని విద్యాభారతి చేయూతనిస్తోందని అసిస్టెంట్ జనరల్ మేనేజన్ రవీందర్ పేర్కొన్నారు. ఆయన గురువారం స్థానిక షిర్డీసాయి ఆలయంలో గత 9రోజులుగా వందేమాతరం ఫౌండేషన్ నిర్వహిస్తున్న యల్‌యల్‌యల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ భారతిసిమెంట్స్ విద్యాభారతి బృందం ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.ఈ కార్యక్రమాన్ని విద్యాభారతి సభ్యురాలు సుబ్బలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇందులో భారతి సిమెంట్సు అధికారులు శ్రీనివాస్, అనిల్‌కుమార్, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధులు రాంకుమార్, మధు, శ్రీశైలం పాల్గొన్నారు.
పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
ఖాజీపేట, జనవరి 11: హిందువుల సంప్రదాయబద్దంగా హరిదాసు, గొబ్బెమ్మలు, కోడిపందేలు లాంటి కళకళతో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు గురువారం ఖాజీపేటలో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక సాయితేజ హైస్కూల్‌లో విద్యార్థులు వివిధ వేషధారణలలో అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నారులు సంప్రదాయమైన దుస్తులు ధరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా పూర్వీకులను మైమరపించేలా కన్పించారు. అలాగే ముగ్గులపోటీలు నిర్వహించి కరస్పాండెంట్ మహబూబ్‌బాషా విద్యార్థులకు, తల్లిదండ్రులకు బహుమతులు అందించారు. కరస్పాండెంట్ రామశేఖర్‌రెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు లాంటి ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు మెమొంటో అందజేసి అభినందించారు.
కమలాపురంలో...
కమలాపురం: పట్టణంలోని ప్రవేటు పాఠశాలల్లో గురువారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య చేపట్టారు. అందమైన రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. చిన్నారులకు హరిదాసు,డూడూ బసవన్న, సంక్రాంతిలక్ష్మి వేషాలను వేసి సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించారు. భోగిమంటలను రగిల్చారు. పొంగళ్లను పొంగించి పంపిణీ చేశారు. పలువురు చిన్నారులకు భోగిపండ్లు తలపై పోసి పేరంటాళ్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చిన్నారుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభం కావడంతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.