కడప

కమలాపురంలో ఆర్‌ఓబి, ఆర్‌యుబిలను నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, ఫిబ్రవరి 18: కమలాపురంలో దశాబ్దాలుగా అపరిష్కృతమైన రైల్వే ఉపరితలవంతెన, భూగర్భవంతెనలను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, గుంతకల్ రైల్వేడీఆర్‌యం విజయప్రతాపసింగ్‌ను కోరారు. వారు ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌లో తనిఖీనిమిత్తం వచ్చిన డీఆర్‌యంను కలుసుకుని రైల్వేసమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గత యేడాది రైల్వే జీయం స్థానిక స్టేషన్‌ను సందర్శించినపుడు రైల్వే వంతెనల ఏర్పాట్లను, స్టేషన్‌లో మరుగుదొడ్లు, వేచి ఉండు గది, వాహనాల పార్కింగ్‌స్థలం, స్టేషన్‌నుంచిమెయిన్ రోడ్డు వరకు సిమెంటు రోడ్డు నిర్మాణం, విద్యుత్ దీపాల ఏర్పాటు, ముళ్లపొదల తొలగింపు, రెండవ ప్లాట్‌ఫాం వద్దనుంచి బస్టాండ్ వరకు రోడ్డునిర్మాణం చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఎగ్మూర్, జయంతి, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లకు స్టాపింగ్ ఇవ్వాలని కోరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఐతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని డీఆర్‌యం దృష్టికి తెచ్చారు. కాగా డీ ఆర్ యం ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి రైల్వేగేటు వద్దకు వచ్చి ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు. రైళ్లు వెళ్లిన వెంటనే గేటు తెరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే స్టేషన్‌కు సంబందించిన వౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం ఇత్యాది సమస్యలను మూడు నెలల్లోపల పరిష్కరిస్తామని డీఆర్‌యం ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. అలాగే రైళ్ల స్టాపింగ్ విషయం జీయం పరిధిలో ఉంటుందని రైల్వే బోర్డు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఉపరితల వంతెనకు రాష్ట్రప్రభుత్వం సగం నిధులు భరాయిస్తే త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. అండర్ గ్రౌండ్ వంతెన మూడునెలల్లో నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఈ మేరకు డీ ఆర్ యంకు ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ నేతలు పట్టణ ప్రముఖుడు సాయిచంద్రశేఖర్ వినతిపత్రాలు అందచేశారు. ఇందులో జిల్లా వైసీపీనేతలు పుత్తాప్రసాద రెడ్డి, తురకపల్లె రాజశేఖర్,మండలనేతలు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, కొండారెడ్డి, యన్ సీ పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి,గఫార్,చెన్నకేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.