కడప

రాజకీయ వ్యవస్థ వత్తిళ్లతోనే బ్యాంకులు దివాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 18: రాజకీయ వత్తిళ్లవల్లే భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై బ్యాంకులు దివాలాతీసే పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు మాజీ జడ్జి బి.చంద్రకుమార్ స్పష్టంచేశారు. ఆదివారం ప్రజాస్వామ్యం హక్కులు-పరిరక్షణ సంస్థ 17వ రాష్టమ్రహాసభ కడపలోని జడ్పీ సమావేశ హాల్‌లో జరిగింది. ఈసందర్భంగా సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రంవచ్చి 70సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో పేదరికం నానాటికీ పెరిగిపోతుందే తప్ప తగ్గలేదన్నారు. రైతులు, కార్మికులు కష్టపడినా వారి నెలసరి ఆదాయం రూ.10వేలకే పరిమితమైందన్నారు. అన్నిరకాలుగా ధరలు పెరుగుతున్నాయని, కానీ రైతు పండించిన పంటలకు గిట్టుబాటుధర కానీ వారి శ్రమకు తగ్గ ఆదాయం కానీ దక్కడంలేదన్నారు. అలాగే ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల్లోపనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న వేతనం కూడా దారుణంగా ఉందన్నారు. దేశంలో రాజకీయనాయకుల ప్రాబల్యం అన్నివిభాగాల్లో పెరిగిపోతోందని దాన్ని ఫలితంగానే బ్యాంకులపై పడిందన్నారు. సామాన్యుడు బ్యాంకు రుణాలు తీసుకోవాలంటే ఎన్నో అవస్థలు పడాల్సివస్తోందని, అదే పలుకుబడి ఉన్నవారు గంటల్లోనే రుణాలు తీసుకుంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రుణాల ఎగవేతదారులు సుమారు రూ.10లక్షల కోట్లు దోచుకున్నారని వెల్లడించారు. ఈ నిధులే ఉంటే కరవుప్రాంతమైన రాయలసీమలో ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జిగా ఉంటూ ఇల్లుకట్టుకునేందుకు రుణంకోసం మూడునెలలుగా బ్యాంకులచుట్టూ తిరిగితే తప్ప తనకు రుణం రాలేదని, ఇంత హోదాలో ఉండి తనకు రుణంరాలేదని, అయితే దొంగ డాక్యుమెంట్లు చూపించి కోట్లరూపాయలు దండుకునేవారికి బ్యాంకులు సహకరించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్విట్జర్లాండ్‌లో లక్షల కోట్లరూపాయలు బ్లాక్ ధనం ఉందని, దాన్ని రప్పించి దేశ ప్రజలను ఆదుకుంటామని చెప్పడంతోనే సరిపెట్టారని ఈ బ్లాక్‌మనీ పథకం ఎంతవరకు వచ్చింది, ఎవరికి ఇచ్చారు అన్నది ప్రధాని నోరుమెదపడం లేదని వెల్లడించారు. పసిపిల్లల ఆహారాన్ని కూడా నోచుకోలేని దుస్థితి ఉందని, వేలకోట్లరూపాయలు ఖర్చుపెట్టివుంటే భారతదేశంలో 70శాతం మంది పిల్లలు కడుపునిండా తిండి తినేవారని వెల్లడించారు. నేతల్లో మార్పులేనిదే వ్యవస్థమారదని పేదరికం, ఆకలి, దారిద్య్రం తగ్గించే దిశగా ప్రభుత్వాలు చేయడంలేదని దీని ఫలితంగానేప్రజల్లో మార్పులేకుండా పోయిందన్నారు. కాగా ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ముందుకుసాగడం లేదని, దేశవిదేశాల్లో హక్కులకోసం ప్రజలు ఉద్యమిస్తుంటే భారతదేశంలో ప్రజల్లో స్పందనలేకపోవడం వెనుక వారి నిరక్ష్యరాస్యత, పేదరికమేప్రధానకారణమని ఆయన వెల్లడించారు. ఉద్యమం అన్నది ఒకరితోనో ఇద్దరితోనో సాగేదికాదన్నారు. జనసేన నేత పవన్, జేఏసీ నేతలు కేవలం కేంద్రప్రభుత్వం చెప్పిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారే తప్ప రాష్ట్రంలో 7జిల్లాలకోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక నిధులపై మాట్లాడటం లేదని, సీమ పరిరక్షణ వ్యవహారంలో ఏమాత్రం స్పందించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం తేవడం కోసమే తాము సీమ జిల్లాల్లో అనేక సదస్సులుపెట్టి సీమకు కావాల్సిన నీరుకోసం ప్రత్యేక చట్టం ఉందని, అందువల్లే అనేక ప్రాంతాల నుండి సీమనికర జలాలపై ప్రజల్లో వస్తున్న వత్తిడికి నేతలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారని తెలిపారు. సీమలో ఉన్న సమస్యల పరిష్కారానికి అనేక సంఘాల సహకారం తీసుకుని పోరాటం చేస్తున్నామన్నారు.