కడప

పట్టుదల జిల్లాను ఓడీఎఫ్‌గా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఫిబ్రవరి 18: పట్టుదల, రోషంతో నిర్ధిష్టమైన ప్రణాళికలు వేసుకుని ఈనెల 26వ తేదికి జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి ఓడీఎఫ్ జిల్లాగా చేయాలని కలెక్టర్ బాబూరావునాయుడు ఆదేశించారు. ఆదివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సభాభవన్‌లో స్వచ్ఛమిషన్ కార్యక్రమంలో భాగంగా రాజంపేట, ఒంటిమిట్ట, పెనగలూరు మండలాల పరిధిలోని పంచాయతీల స్పెషలాఫీసర్‌లు, కార్యదర్శులు, వీఆర్వోలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిచేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలలో అందరి సమష్టికృషితో ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను పూర్తిచేయాలని, లోటుపాట్లకు తావివ్వరాదన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయం దాటిపోయిందని, కడప జిల్లావాసులు పూర్తిచేయలేదనే మాటను తీసుకుని రాకుండా ఈనెల 26వ తేది నాటికి పూర్తిచేసి 28వ తేదిలోగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలను ఓడీఎఫ్‌గా ప్రకటించి, గ్రామంలో సన్మాన కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించాలన్నారు. ఓడీఎఫ్‌గా ప్రకటించే ముందు రోజు గ్రామంలో ఒకమారు పర్యటించి లోటుపాట్లు గమనించి, గ్రామంలో ప్రచారం చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఓడీఎఫ్‌గా ప్రకటించాలన్నారు. సమయం ఎంతో విలువైందని, ప్రస్తుతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉందని నిర్లక్ష్యం, జాప్యం చేయరాదన్నారు. జిల్లాను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా మండలాల తహసీల్దార్‌లు ఎంపీడీఓలదే కీలకపాత్ర అని మండలంలోని అన్ని సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటనలుచేసి తరచూ పర్యవేక్షించి పరిష్కార దిశగా వెళ్లాలన్నారు. చేపట్టిన చేస్తున్న పని తప్పదని, సృజనాత్మక ఆలోచనలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలన్నారు. కష్టపడి పని చేస్తే సంతోషంగా ఉంటుందని, చేస్తున్న పని సక్రమంగా, నాణ్యతగా చేస్తే ప్రజలలో మంచి గుర్తింపు పొందవచ్చునన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పేదల సంక్షేమం కోసమే ఉన్నామని పని చేయాల్సి ఉందన్నారు. డిఆర్‌డిఏ పీడీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ సంజీవరావు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రికార్డులు సక్రమంగా నిర్వహించి, పనులలో నాణ్యత పాటించాలన్నారు.