కడప

పురావస్తు ప్రదర్శన శాలలకు.. పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 18:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురావస్తు ప్రదర్శన శాలలకు పూర్వవైభవం తెచ్చేదిశగా ఆశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మ్యూజియంలను అభివృద్ధిచేసి ఆయా ప్రాంతాల్లో పర్యాటకరంగ అభివృద్ధికి నిధులు కేటాయింపులు చేసింది. దీంతో మ్యూజియంలను అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)లు సంబంధిత శాఖకు పంపేందుకు పురావస్తుశాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సంబంధితశాఖ అధికారులు మ్యూజియంల అభివృద్దికి, నూతన నిర్మాణాలకు అవసరమైన నిధులకోసం డీపీఆర్‌లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో దాదాపు రూ.5కోట్లతో మ్యూజియం అభివృద్దికి నిధులు కేటాయించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధానంలోనే కడప జిల్లాలోని మైలవరం మ్యూజియం నూతన నిర్మాణానికి, సాంకేతికంగా అభివృద్దికి రూ.4కోట్లతో, జిల్లా కేంద్రంలోని మహవీర్ పురావస్తు ప్రదర్శనశాలకు రూ.6కోట్లతో, కాకినాడలో ఉన్న మ్యూజియం అభివృద్దికి డిపిఆర్‌లు సిద్దం చేస్తున్నారు. పెన్నానదిపై మైలవరం జలాశయం నిర్మాణం సమయంలో మైలవరంలో అతిథి గృహం ప్రాంగణంలో 1976లో మ్యూజియంను నిర్మాణం చేశారు. కాలక్రమేణా మైలవరం జలాశయంతో పాటు, మ్యూజియం కూడా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో మైలవరం మ్యూజియం అభివృద్దికి 2004 నుండి ప్రణాళికలు రూపొందించడంలో కాలం గడిచిపోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మైలవరం మ్యూజియం నూతన నిర్మాణానికి డిపి ఆర్‌లు కోరడంతో సుమారు రూ.4కోట్లతో సదరు శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో త్వరలో మైలవరం మ్యూజియంకు మహర్దశ రాబోతోంది.
డిపిఆర్‌లు నివేదించగానే పనులకు ఆస్కారం
* పట్ట్భా రెడ్డి, ఎడి, పురావస్తుశాఖ, తిరుపతి
మ్యూజియంల అభివృద్దికి గతంలో నిధులు నామమాత్రంగా ఉండడంతో పనులు సకాలంలో చేపట్టలేని పరస్థితి ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మ్యూజియల అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేసింది. దీంతో రాష్టవ్య్రాప్తంగా ఉన్న పలు మ్యూజియంల అభివృద్దికి సంబంధించి చేపట్టాల్సిన పనులపై డీపీఆర్‌లు సిద్ధం చేయాల్సిందింగా సూచించడంతో ద్రోణ కన్సల్టెన్సీ ద్వారా వాటిని సిద్దం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికలు నివేదించగానే ఆమోదం పొంది పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంది. దీని ద్వారా కడప జిల్లాలోని జిల్లా కేంద్రంలోని మహవీర్ మ్యూజియం, మైలవరం మ్యూజియంల అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుంది.

ధర్మంపట్ల అవగాహన కల్పించడమే పీఠాధిపతుల లక్ష్యం

బి.మఠం, ఫిబ్రవరి 18: ప్రజల్లో సామాజిక ధర్మంపట్ల అవగాహన కల్పించి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దటమే పీఠాధిపతులు నిర్వహించాల్పిన కార్యక్రమమని దీనికి మించి భాద్యతలు ఉండవని తమ పదవీకాలంలో నెరవేర్చాల్సిన ఆవశ్యకతను పీఠాధిపతులు గుర్తించాలని తమ పదవులు శాశ్వతం కాదని అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమం పీఠాధిపతులు శివానందలహరి స్వామి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. వీరికి మఠం మేనేజర్ ఈశ్వరాచారి ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ భారతదేశ చరిత్ర, సంస్కృతి, హిందూమత మహోన్నత గొప్పవన్నారు. దురదృష్టవశాత్తు మతంలోని కులాలమధ్య ఐక్యతలేక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కారణంగానే ఆలయాలకు కూడా రక్షణ అవశరమైనదన్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రజలను దూరంగా వుంచడం కూడా మరోకారణమన్నారు. అందరూ ఐక్యంగా ప్రేమత్వాన్ని పెంచుకున్నప్పుడు జాతిపురోగోమిస్తుందన్నారు. గోపూజ, గోసంరక్షణ అతి ముఖ్యమన్నారు. గోవులకు ఆధార్‌కార్డు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గోవుకు ఆధార్ కొరకు రూ.10 రూపాయలు మాత్రమే చెల్లించాలన్నారు. అలాగే గోసంరక్షణ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు బడ్జెట్ కేటాయించిందన్నారు. ఈయన వెంట ఆయన శిష్యులు పాల్గొన్నారు.