కడప

హిందూమత పరిరక్షణ కోసం కరపత్రాలు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, ఫిబ్రవరి 20: హైందవ సంప్రదాయం ప్రకారం హిందూ ధర్మపరిరక్షణ కోసం సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ హిందూ ధర్మంపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతున్నదని సమరసత సేవా ఫౌండేషన్ రాయలసీమ ధర్మప్రచారక్ ఈశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కోదండ రామాలయంలో మండల ధర్మప్రచారక్ బెల్లాల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర పూజలు ఆచరించి హిందూ ధర్మ రక్షావేదిక కార్యక్రమంలో భాగంగా హిందూ మత ధర్మంపై సమగ్రంగా తెలియజేసి అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మతం సముద్రం లాంటిదని విశ్వమంతటి హిందూమతంలో జన్మించడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. అనంతరం వేదపండితులు నాగఫణికిశోర్‌శర్మ అందరి పేరున అర్చనలు చేసి కోదండరాముని ఆశీర్వచనాలు అందజేశారు. సహాయం నీ కోసం సభ్యులు మల్లిఖార్జున, బాలాజీలు పలువురికి సమదుస్తులను అందజేశారు.

వీరభద్రాలయంలో ఘనంగా సరస్వతియాగం పూజలు
రాయచోటి, ఫిబ్రవరి 20: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రాలయంలో ప్రతి యేటా ఫాల్గుణ శుద్ధ పంచమి రోజున దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఉత్తర్వుల మేరకు సామూహిక సర్వసతియాగ పూజలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఆలయ ముఖ్య అర్చకులు శంకరయ్య, వేద పండితులచే సరస్వతి పూజలు కన్నుల పండువగా నిర్వహించారు. బాల బాలికలకు సరస్వతి కటాక్షము కలిగి జరగబోవు పరీక్షల్లో మంచి పలితాలు రావాలని స్వాములు పిల్లలందరినీ ఆశీర్వదించి కంకణాలు, పెన్నులు, రైటింగ్ ప్యాడ్లు బహూకరించడం జరిగిందని ఈవో మంజుల తెలిపారు.

హైకోర్టు ఉద్యమంలో విద్యార్థుల సత్తా చూపిస్తాం
రాయచోటి, ఫిబ్రవరి 20: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సానుకూలంగా వ్యవహరించని పక్షంలో విద్యార్థుల సత్తా ఏమిటో చూపిస్తామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కోటేశ్వరరావ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైకోర్టు సాధన ఉద్యమంలో భాగంగా రాయచోటి ప్రజాసంఘాల జేఏసీ రిలే నిరాహారదీక్షలో 9వ రోజు ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అభివృద్ధిని అంతా ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వలనే రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. గత 28 రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజా సంఘాలు హైకోర్టు కోసం నిరాహారదీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సీమవాసులను కించపరుస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే రాయలసీమ విద్యార్థుల శక్తి ఏమిటో హైకోర్టు ఉద్యమంలో చూపిస్తామని హెచ్చరించారు. 9వ రోజు నిరాహారదీక్షలో ఏఐఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, విద్యార్థులు శివప్రకాష్, శివ, రాంప్రసాద్, ఆంజనేయులు, శ్రీహరి, పురుషోత్తం, హేమంత్‌కుమార్, అషఫ్‌అ్రలీలు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా మానవతా స్వచ్ఛంధ సంస్థ రాయచోటి కన్వీనర్ శివగంగిరెడ్డి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజులు, సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు ఎస్ ఎండీ బాష, ఖాదర్‌బాష, నాగముని, క్రిష్ణయ్య, రాజ్‌కుమార్, హుమయూన్‌బాష తదితరులు పాల్గొన్నారు.