కడప

ఆర్థిక సంఘం నిధులకు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఫిబ్రవరి 20: స్థానిక సంస్థల అభివృద్దికి, బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులకు మార్గదర్శకాలు జారీచేశారు. ఈ మేరకు పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పనితీరు ఆధారంగా పల్లె ప్రగతికి నిధులు ఇచ్చే అవకాశాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ప్రగతికై రేటింగ్‌లను, స్టార్‌లను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే నిధుల సద్వినియోగం, సార్థకతను చేకూర్చేదిశగా మార్గదర్శకాలను రూపొందించినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం 2015-16 నుండి 14వ ఆర్థిక సంఘం ప్రారంభమయింది. ఈ విభాగంలో నిధులు విడుదల చేసేందుకు 4 కేటగిరీల్లోని పనితీరులను బేరీజు వేసి నిధులు కేటాయించనున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు రూపొందించిన 14వ ఆర్థిక సంఘం గ్రామపంచాయతీలకు నిధులను ప్రతి ఏటా విడుదల చేస్తూ వస్తోంది. గతంలో ఆర్థిక సంఘం నిధులు ఆయా గ్రామ పంచాయతీల్లో జనాభా లెక్కల ప్రకారం నిధులను కేటాయించేది. ప్రస్తుతం దీన్ని బేసిక్ గ్రాంటు, పనితీరు ఆధారంగా నిధులు కేటాయించనున్నారు. నిధుల విడుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల పనితీరు మెరుగుపరచేందుకు చేపట్టే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో చాలా రాష్ట్రాల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు ఫిర్యాదులు కూడా వెల్లడంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో పనితీరు ఆధారంగా నిధులు విడుదలకు మార్గదర్శకాలు రూపొందించినట్లు చెబుతున్నారు.
స్థానిక సంస్థల పాలకవర్గం, అధికారగణం ఆర్థిక సంఘం నిధులు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ఆచరించాల్సి ఉంటుంది. పంచాయతీల ఆదాయ, వ్యయాలపై 2015-16 ఆడిట్ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ నిధులతో కాకుండా స్థానికంగా పంచాయతీలు సమకూర్చుకున్న వనరులేమిటో స్పష్టంగా నివేదించాల్సి ఉంటుంది. పన్నులు, పనే్నతర విభాగాల్లో వచ్చే ఆదాయాలను మెరుగుపరచేందుకు అవలంబిస్తున్న విధానాలను వెల్లడించాల్సి ఉంటుంది. ప్రతి పంచాయతీ విధిగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక సంఘ, సాధారణ నిధులతో గత మూడేళ్లలో ప్రజలకు కల్పించిన వౌళిక సదుపాయాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ డాష్‌బోర్డులో ఉంచాలి. ప్రధానంగా తీసుకున్న 4 కోణాల్లోని పంచాయతీల పనితీరు మదించి పాయింట్లు కేటాయించి వాటికి మాత్రమే పనితీరు ఆధార నిధులను అందించే చర్యలు చేపడతారు. ఈ విధానం వల్ల గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు, వాటితో చేపట్టిన అభివృద్ధి పనులు బహిర్గతపరచి పారదర్శక విధానంలో స్థానిక సంస్థల పాలన ఉంటుందని పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాలక వర్గాల నుండి భిన్నస్వరాలు వినబడుతున్నాయి.