కడప

బీజేపీ హయాంలో రాష్ట్రం అధోగతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 20: రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత బిజెపిదే అయితే ఇందుకు తెలుగుదేశంపార్టీ వత్తాసు పలికిందని ఇందుకు ప్రజలు గమనించడంతోనే తెలుగుదేశంపార్టీ నేతలు ప్లేట్ ఫిరాయించారని కాంగ్రెస్‌పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు సి.రామచంద్రయ్య, డా.ఎన్.తులసిరెడ్డిలు ధ్వజమెత్తారు. మంగళవారం ఆంధ్రుల ఆత్మగౌరవం దీక్షను కడపలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంపై ఈ రాష్ట్రం అన్ని విధాల నష్టపోతుందన్న భావనతోనే అప్పటి ఆర్థికవేత్త ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ 14రకాల చట్టాలను రూపొందించారన్నారు. ప్రత్యేక హోదా కింద రూ.5లక్షల కోట్లు, వెనుకబడిన 7జిల్లాలకు రూ.24,300కోట్లు ప్రకటించారని ఇది కాకుండా రాజధానికి, పోలవరానికి ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారన్నారు. సాక్ష్యాత్తు పార్లమెంట్, ప్రధానమంత్రి చేసిన చట్టాన్ని ప్రస్తుత ప్రధాని మోదీ అవహేళన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. కరవుప్రాంతాలైన 7 జిల్లాలకు రూ.24,300కోట్లు ఇవ్వాల్సివుండగా కేవలం రూ.1050కోట్లు మాత్రమే ఇచ్చారని, ఒక్కో జిల్లాకు రూ.50కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. రాష్టప్రరిస్థితి దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌పార్టీ పకడ్బంధీగా వ్యవహరిస్తే ఇప్పుడున్న టీడీపీ కానీ, ఇతర పార్టీలు ఏమాత్రం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు. పార్లమెంట్‌కు వచ్చి తమ సమాధానం ఇవ్వాలని చంద్రబాబుకు పదే పదేచెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు కూడా ఇష్టానుసారంగా జల్సాగా ఖర్చు చేస్తున్నారని మంత్రుల విడిది గృహాలకు ఒక్కరోజుకు రూ.18వేలు ఖర్చు పెడుతున్నారని, కోట్లు ఖర్చుపెట్టి ముఖ్యమంత్రి విదేశ ప్రయాణాలు చేసి సాధించింది కేవలం రూ.9వేల కోట్లు అని స్పష్టం చేశారు. ఇప్పటికీ తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ నేతలు ఎవరికివారు సఖ్యత కుదుర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పొట్టేళ్ల కొట్లాటలకు సిద్దమయ్యారని, చంద్రబాబునాయుడు నక్కజిత్తుల నాయకుడిగా మారారని ఎద్దేవా చేశారు. ఎంతసేపు చంద్రబాబుకు, బీజేపీకి విభేధాలు సృష్టించి గొడవలు ఎక్కువచేసి ఏదో విధంగా బీజేపీతో కలిసిపోవాలనే ప్రయత్నాలతో జగన్మోహన్‌రెడ్డి అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నారని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు లేకుండా కాపాడుకునేందుకు ఈరకంగా పావులు కదుపుతున్నారని వెల్లడించారు. రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం జరుగుతున్నా చంద్రబాబునాయుడు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.