కడప

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని పథకాలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని, మైదుకూరు శాసన సభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గంగమ్మ గుడి వద్ద వైకాపా గ్రామ భూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శాశనసభ్యులు మాట్లాడుతూ 2014లో ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు అనేక వాగ్దానాలు చేశారని అందులో ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. అది ఇంతవరకూ సగం కూడా పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటికి ఒక ఉద్యోగం అని ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు చేశారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ విమానాలలో విదేశీ పర్యటనలు తిరుగడమే గాని ప్రజలకు మేలు చేద్దామనే ఉద్ధేశ్యమే లేదని ఆయన అన్నారు. అమరావతిలో రాజధాని కోసం శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంత వరకు ఒక్క భవణం కూడా నిర్మించలేదని ఆయన పేర్కొన్నారు. కావున మన పార్టీ కార్యకర్తలందరూ ఇంటింటికీ వెళ్ళి చంద్రబాబు పాలన అవినీతిపై ప్రజలకు తెలపాలని ఆయన వైకాపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే సంకేతాలు వున్నందున వైకాపా నాయకులు, కార్యకర్తలు ముందుండి పార్టీని బలోపేతం చేసి జరుగబోయే ఎన్నికలలో జిల్లాలో 10 స్థానాలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.