కడప

అభివృద్ధి వికేంద్రీకరణకు హైకోర్టు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,్ఫబ్రవరి 20: రాష్ట్రంలో అభివృద్ధివికేంద్రీకరణ చేయడంలో భాగంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్న సమయంలో హైకోర్టుతోపాటు అన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలు అక్కడే ఏర్పాటుకావడం వల్ల జరిగిన నష్టాన్ని చూస్తూ కూడా, ఇప్పుడు రాజధానిలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామనడం మంచి పద్ధతి కాదన్నారు. కడప జిల్లాకోర్టు వద్ద దీక్షలు చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని రఘువీరారెడ్డి మంగళవారం సాయంత్రం సందర్శించారు. హైకోర్టుకోసం దీక్షలు చేస్తున్న వారికి మద్దతు ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్టవ్రాదం ఏర్పడి ఉద్యమంగా మారే అవకాశం ఉందన్నారు.
విజయవాడ, విశాఖపట్టణంలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటుచేసి హైకోర్టు ప్రధాన కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయడం వల్ల ప్రాంతీయ విబేధాలుకూడా ఉండవని రఘువీరారెడ్డి సూచించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు శాసనసభ తీర్మానం చేస్తామని అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు మరో ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం కూడా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సివుందన్నారు. శ్రీకృష్ణకమిటీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నివేదిక ఇచ్చిందన్నారు. ఇప్పుడు అమరావతి కడుతున్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టకూడదని కూడా చెప్పిందన్నారు. పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనపెట్టి హైకోర్టును రాయలసీమకు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల దీక్షల వల్ల కక్షిదారులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, భవిష్యత్‌లో కక్షిదారులకు జరిగే ప్రయోజనం కోసం న్యాయవాదుల దీక్షలకు వారు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రఘువీరాకు న్యాయవాదుల వినతిపత్రం
హైకోర్టుకోసం 29రోజులుగా దీక్షలు చేస్తున్న న్యాయవాదులు తమ డిమాండ్‌ను తెలియజేస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు వినతిపత్రం ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ మస్తాన్‌వల్లీ, ఉపాధ్యక్షులు రాజగోపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, మహిళ కార్యదర్శి కె.అరుణకుమారి, జేఏసీ నాయకులు నిరంజన్‌కుమార్, నాగేశ్వరరాజు, గుర్రప్ప తదితరులు రఘువీరారెడ్డికి వినతిపత్రం ఇచ్చి, టి.నాగరాజు, పివి రమణారెడ్డిలు ఆమరణ నిరాహార దీక్ష పూనిన విషయాన్ని, పోలీసులు భగ్నంచేసి ఆసుపత్రికి తరలించిన విషయాన్ని వివరించారు. రఘవీరారెడ్డి వారిద్దరీని అభినందించారు.