కడప

అభివృద్ధికోసం కాదు లాభాలకోసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 23: ప్రత్యేకహోదా సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయంగా పెట్టుకున్నారని, రాయలసీమ కంతా ఇచ్చినా 2 వేల కోట్లురావని, అపద్దాలు చెప్పడంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి దిట్టాఅని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఎద్దేవాచేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రధానికి ప్రత్యేకహోదా లేకపోయినా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అన్నాడని చెప్పారన్నారు. వేరే రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోరితే ఇబ్బందులు ఎదురవుతాయని, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబితేనే ప్యాకేజీకి కూడా ఒప్పుకున్నామన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానిని, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. కాగా బడ్జెట్‌లో ఏపీకి నిధులేమీ కేటాయించకపోవడంతో పార్లమెంట్‌ను ఎంపీలతో స్పందింపచేశారన్నారు. ప్యాకేజీలో చెప్పిన విధంగా అన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ లోపల, బయట తిరుగుతూ ఏపీ అభివృద్ధిపై ఎటువంటి ప్రస్తావన తేలేదన్నారు. అవిశ్వాసం పెట్టమంటున్నారని, చట్టసభల్లో అవిశ్వాసం పెడితే చర్చ జరిగేందుకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. మళ్ళీ ఆరు నెలల వరకు అవవాశం ఉండదన్నారు. బీజేపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉంది కాబట్టే ప్రధాని ధీమాగా ఉన్నారన్నారు. ప్రతిపక్షనేత వైయస్ జగన్ రాష్టప్రతి, ఉపరాష్టప్రతి ఎన్నికల్లో వారు అడగకుండానే మద్దతు ప్రకటించారని, అప్పుడు గుర్తుకు రాలేదా ప్రత్యేక హోదా అని ప్రశ్నించారు. ఎన్నికలు రావనే ఎంపీలతో రాజీనామా చేయిస్తున్నాడని చెబుతున్నారన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రధానికి దాసోహమంటున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై అభిమానం, శ్రద్ధవుంటే జగన్ ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. ఇంటర్నేషనల్ కోర్టు ద్వారా ప్రధానికి నోటీసులు ఇప్పించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. ప్రపంచంలో ఏ ప్రధానికి ఇటువంటి సంఘటన ఎరిగి ఉండదన్నారు. దేశమంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 2 వేల కోట్లు తెప్పిస్తానన్న ఎమ్మెల్యే రాచమల్లు రాయలసీమకంతటికీ కలిసినా అంత నిధులు రావని ఎద్దేవా చేశారు.

తాళ్లప్రొద్దుటూరులో ఉద్రిక్తత
* ప్రత్యేక పోలీసుల బలగాలు మోహరింపు * బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టుకు సన్నాహాలు
కొండాపురం, ఫిబ్రవరి 23:మండలంలోని తాళ్లప్రొద్దుటూరులో ప్రత్యేక పోలీసు బలగాల మోహరింపుతో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల మేరకు అందిన సమాచారంతో తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ క్రిష్ణయ్య కె.కోడూరు గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. బెల్టుషాపు నిర్వాహకుడు చిన్నపెద్దయ్యను స్టేషన్‌కు తీసుకువస్తూండగా నియోజకవర్గ అధికారపార్టీ కీలకనేత అనుచరుడు పవన్‌కుమార్ రెడ్డి ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగి నిందితుడు చిన్నపెద్దయ్యను తీసుకెళ్లాడు. జరిగిన విషయంను ఎస్‌ఐ క్రిష్ణయ్య ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో జిల్లా కేంద్రం నుండి తాళ్లప్రొద్దుటూరుకు ప్రత్యేక పోలీసు బలగాలను పంపారు. బెల్టుషాపు నిర్వహిస్తున్న నిందితుడు చిన్నపెద్దయ్యను, ఎస్‌ఐ విధులకు ఆటంకం కలిగించిన పవన్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంసిద్దం చేస్తున్నారు. దీంతో తాళ్లప్రొద్దుటూరు స్టేషన్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.