కడప

కుడికాలువకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలివీడు, ఫిబ్రవరి 23: జనవరి నెలలో జరిగిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామసభల్లో రైతులు కుడికాలువకు నీటిని విడుదల చేయాలనే విజ్ఞప్తి మేరకు ఈ నెల 19వ తేదీన కుడికాలువకు నీటిని విడుదల చేశామని ఏఈ శివానాయక్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ప్రాజెక్టు వద్ద మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ వంద క్యూసెక్కుల మేర 20 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో రైతులు మండల ప్రత్యేకాధికారి ద్వారా కలెక్టర్‌కు నీటి విడుదలపై వినతిపత్రం సమర్పించడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేశామని శివానాయక్ తెలియజేశారు. కుడికాలువలో నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాంతంలో సాగు చేసిన వందలాది ఎకరాల రబీ వేరుశెనగ, వరి పైరుకు నీటి కష్టాలు తప్పినట్లు అయింది. నీటి విడుదలతో ఈ ప్రాంత రైతుల ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులకు కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నారు. కుడికాలువ నీటితో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపొంది రానున్న వేసవి కాలంలో తాగునీటి కష్టాలు కూడా తొలగనున్నాయి.

వరి పంటకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
రామాపురం, ఫిబ్రవరి 23: మండలంలో ప్రస్తుతం వరిపంట చిరు పొట్టదశలో ఉందని పంటకు కాండం తొలచే పురుగు ఉధృతంగా ఉందని వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని లక్కిరెడ్డిపల్లె వ్యవసాయ శాఖ ఏడీ దినకర్ అన్నారు. మండలంలోని సుద్దమళ్ల పంచాయతీలోని బయారెడ్డిగారిపల్లె, తువ్వపల్లె వరిపంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ వరి పంటకు కాండం తొలచే పురుగు ఎక్కువ ఉందని దీని నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దీని నివారణకు కార్బాఫ్‌హైక్లోరైడ్ 4 గుళికలు ఎకరానికి 8 కిలోలు వేసుకోవాలన్నారు. రైతులు ఈ ప్రాంతంలో అధికంగా శ్రీరాంగోల్డ్ ఆర్ ఎన్ ఆర్ 15048 రకాలు ఎక్కువ సాగు చేశారన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటపుడు నాణ్యత గల విత్తనాలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుకాణంలో రశీదు తప్పక పొందాల్సి ఉంటుందన్నారు.

అరెస్టులతో హైకోర్టు ఉద్యమాన్ని ఆపలేరు
* నల్లజెండాలతో నిరసన దీక్షతో ప్రజాసంఘాల నేతలు
రాయచోటి, ఫిబ్రవరి 23: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి న్యాయవాదులను, ప్రజా సంఘాల నేతలను అక్రమంగా అరెస్టులు చేయడానికి నిరసనగా రాయచోటి ప్రజా సంఘాల జేఏసీ న్యాయవాదులు నల్లజెండాలు ధరించి శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హైకోర్టు ఏర్పాటు విషయంపై విన్నవించడానికి అనంతపురం ప్రయాణమైన న్యాయవదులను, ప్రజా సంఘాల వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోనికి తీసుకొని పోలీస్‌స్టేషన్లలోను, గృహనిర్బంధంలోను ఉంచడం అప్రజాస్వామికమని రాయచోటి ప్రజాసంఘాల జేఏసీ నాయకులు ఈశ్వర్, తాతయ్య, కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమం గురించి చెప్పుకొనే హక్కు కూడా లేదా అని వారు ప్రశ్నించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన వారిలో ఓపీడీఆర్ న్యాయవాది రామకుమార్, సీఎల్‌సీ న్యాయవాది హరినాధరెడ్డిలతో పాటు ప్రజా సంఘాల నేతలను అనంతపురంలో గురువారం రాత్రి అరెస్టు చేశారన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షులు కరుణాకర్, 11 మందిని బార్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులను గురువారం ఉదయానే్న పోలీసులు అరెస్టు చేశారన్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లా ఓపీడీఆర్ జిల్లా కన్వీనర్, న్యాయవాది అయిన సోమశేఖర్‌తో పాటు మదనపల్లె బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతపురం వెళ్తుండగా అంగళ్లు వద్ద అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అరెస్టుల ద్వారా హైకోర్టు ఉద్యమాన్ని ఆపాలని చూడటం ప్రభుత్వం అమాయకత్వానికి నిదర్శనమన్నారు.