కడప

జిల్లా అధికారులకు స్థానభ్రంశం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు స్థానభ్రంశం తప్పదని అధికారపార్టీ వర్గీయులు బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. కలెక్టర్ టి.బాబూరావునాయుడు విషయం సందేహాస్పదంగానే ఉన్నా, జాయింట్‌కలెక్టర్ శే్వతతెవతియకు బదిలీ తప్పకపోవచ్చునని ఉద్యోగవర్గాలు కూడా భావిస్తున్నాయి. ఈప్రచారానికి బలం చేకూర్చుతున్నట్లు, జాయింట్ కలెక్టర్ శే్వత మూడునెలలు తాత్కాలిక సెలవుపై వెళ్లిపోయారు. కలెక్టర్ బాబూరావునాయుడు రెండురోజులుగా విజయవాడలో రాష్ట్ర ఉన్నతాధికారులను కలుస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ ఉద్యోగరీత్యా పాలనలో భాగంగానా, లేక తన బదిలీపైనా అన్నది తెలియడం లేదు.
కాగా జిల్లాలో అధికారపార్టీనేతలకు, జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు నడుమ సఖ్యత కొరవడిందన్నది మాత్రం వాస్తవం. ఇండ్లస్థలాల మంజూరులోనూ, గృహాల మంజూరులోనూ, డీలర్ షిప్‌ల నియామకంలోనూ అధికారపార్టీ నేతలకు, జిల్లా అధికారులకు నడుమ వాదోపవాదాలు జరిగిన విషయం బహిరంగమే. అంతేగాకుండా, జాయింట్ కలెక్టర్ శే్వతతెవతియ ముక్కుసూటి వ్యవహారం క్రిందిస్థాయి అధికారులకు మింగుడుపడటంలేదు. కలెక్టర్ వ్యవహారశైలిపై కూడా కిందిస్థాయి అధికారులు, మండలస్థాయి అధికారులు తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. టెలికాన్ఫరెన్స్‌లలోనూ, జిల్లా కేంద్రంలో జరిగే అధికారుల సమీక్షా సమావేశాల్లోనూ, కలెక్టర్ బాబూరావునాయుడు కిందిస్థాయి అధికారులను నోటికి ఎంతమాట వస్తే అంతమాట మాట్లాడుతారని విమర్శలు ఉన్నాయి. ఇద్దరు జిల్లా మహిళా అధికారులను కలెక్టర్ దురుసుగా సంస్కారహీనంగా మాట్లాడారనే విమర్శలు ఉన్నాయి. ఒక దశలో కిందిస్థాయి అధికారులు కలెక్టర్ వ్యవహారశైలిపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకుని, ఇతర అధికారుల జోక్యంతో విరమించుకున్నారు. కలెక్టర్ వ్యవహారశైలి సెగ ఇప్పుడు అధికారపార్టీ నేతలకు కూడా తగలడంతో, వారు కలెక్టర్‌ను బదిలీ చేయాలనే వత్తిడి అధికం చేశారు. ఈ వత్తిడి పనిచేసిందా, లేక కలెక్టర్ పాలనలో భాగంగానే రాజధానిలో తిష్టవేశారా అన్నది స్పష్టంగా తెలియడంలేదు.
కాగా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ మాత్రం ఇక్కడి నుండి తానే స్వయంగా బదిలీ ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కొంతమంది ఉద్యోగ వర్గాల కథనం. ఆమె మూడునెలలు తాత్కాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. సెలవులోనే ఆమెకు బదిలీ ఉత్తర్వులు రావచ్చునని కొంతమంది అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదికావడంతో, అధికారపార్టీ కార్యకర్తలకు అనుకూలంగా పనులుచేసే అధికారులను తెచ్చుకోవాలని అధికారపార్టీ నేతలు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల బదిలీ త్వరలో ఉండవచ్చునని తెలుస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ బలోపేతానికే ‘‘అల’’
రామాపురం, ఫిబ్రవరి 23: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థను బలోపేతానికే ఆనందలహరి అభ్యసన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈవో రామకృష్ణుడు అన్నారు. మండలంలోని రెండు పాఠశాలలను ఏఎల్‌ఏ కింద ఎంపిక చేశారు. శుక్రవారం నీలకంఠ్రావుపేట తెలుగు ఎంపీపీ పాఠశాలలో ఆనందలహరి అభ్యసన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలల్లో అల ప్రోగ్రాం ఏర్పాటు చేశారని, మండలంలో బీదవాండ్లపల్లె, నీలకంఠ్రావుపేట తెలుగు పాఠశాలలో ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. పాఠశాలలో అల బోధన పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఆయా ఉపాధ్యాయులతో పాటు మాస్టర్ కోబెస్ శిక్షణ ఇవ్వడం జరిగింది. రాబోవు రోజుల్లో అన్ని పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారన్నారు. మొదటి విడతలో 1,2వ తరగతులకు ప్రారంభించి అనంతరం 3,4,5వ తరగతులు విస్తరిస్తారన్నారు. బోధనలో విద్యార్థులకు ట్యాప్‌లతో విద్యాబోధన చేయాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులకు అత్యుత్తమ విద్య అధునాతన సదుపాయాలు, ఉపకరాలు అందించడం చేస్తామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయనున్నట్లు ఆయన వివరించారు.