కడప

ఉద్ధృతం కానున్న ‘హైకోర్టు’ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఆందోళన రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నట్లు కన్పిస్తోంది. తొలుత కడపలో ప్రారంభమైన అడ్వకేట్ల ఆందోళన ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ ప్రారంభమై, అనంతపురంలో తీవ్రరూపం దాల్చింది. దీనికితోడు అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈ డిమాండ్‌కు మద్దతు లభిస్తోంది. దాదాపు అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులు, నేతలు వీరి డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు. ఒక్క అధికార తెలుగుదేశంపార్టీ రాష్టస్థ్రాయిలో దీనిపై ఏమీ మాట్లాడకపోయినా, స్థానికంగా రాయలసీమలో ఉన్న నేతలు మాత్రం అడ్వకేట్ల దీక్షల శిబిరాలను సందర్శించి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. గురువారం అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రిని నిలదీయాలని ప్రయత్నించిన బార్ అసోసియేషన్ నేతల ముందస్తు అరెస్టు, వీరిలో మరింత పట్టుదలను పెంచుతోంది. శుక్రవారం కర్నూలులో రాయలసీమ బీజేపీ నేతలు సమావేశమై రాయలసీమ సమస్యలపై ఒక డిక్లరేషన్ విడుదల చేశారు. బీజేపీలోని ఒక వర్గం నేతలు కర్నూలు సమావేశంలో, హైకోర్టును ఖచ్చితంగా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటుచేయాలని కూడా మరో డిమాండ్‌ను రాష్ట్రప్రభుత్వం ముందుంచారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఇటీవల, హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడివుందని ప్రకటించారు. ఈ నేపధ్యంలో అడ్వకేట్లు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతస్థాయిలో జరపాలని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఆందోళనలు ఆషామాషీగా కాకుండా రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చేవిధంగా ఉండాలని వ్యూహరచన చేస్తున్నారు. మార్చి 9వ తేదీ వరకు కోర్టులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న విషయం పాఠకులకు విధితమే. ఈనెల 26న నాలుగు జిల్లాల కలెక్టరేట్లు, తహశీల్దార్ కార్యాలయాలు ముట్టడించి దిగ్భంధించాలని నిర్ణయించుకున్నారు. మార్చి 1వ తేదీన అన్ని పార్టీల ముఖ్యనేతలను, ఎన్‌జీవో విద్యార్థిసంఘాల నేతలను సమన్వయపరచి, రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 2న జాతీయ రహదారులన్నింటినీ దిగ్బంధనం చేయాలని, మార్చి 3న అన్ని కేంద్రసంస్థల కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మార్చి 6న చలో అమరావతి కార్యక్రమం ఏర్పాటుచేసి వందలాది మంది లాయర్లు, రాయలసీమ సానుభూతిపరులను, ముఖ్యమంత్రిని నేరుగా కలవాలని తీర్మానం చేసుకున్నారు. ఆరోజు ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానాన్ని బట్టి, తదుపరి కార్యాచరణ ఏర్పాటు చేసుకునేందుకు మార్చి 10వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సమావేశం అవ్వాలని తీర్మానించుకున్నారు. జేఏసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయవాదులెవరైనా కోర్టుకు హాజరైతే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా జేఏసీ తీర్మానించింది. కక్షిదారుల ఇబ్బందులను తాము సానుభూతితో అర్థంచేసుకుంటామని, అలాగే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కక్షిదారులు కూడా సహకరించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. గురువారం అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో జేఏసీ నేతలకు ఎదురైన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆందోళనలు తీవ్రతరం చేయాలనే పట్టుదల న్యాయవాదుల జేఏసీలో పెరిగిందన్నది మాత్రం వాస్తవం.

లీకుల వీరుడు చంద్రబాబు..
* రాష్ట్రాన్ని కేంద్రం ముందు మోకరింపజేశారు * వైసీపీ ఎమ్మెల్యేలు, మేయర్
కడప,్ఫబ్రవరి 23: రాష్ట్రంలో ఏ వ్యవహరమైన లీకుల పరం చేసి పబ్బం గడుపుకుంటూ, నాలుగేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ ముందు మోకరింపజేశారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. శుక్రవారం కడపలోని వైసీపీ కార్యాలయంలో నగర మేయర్ కె.సురేష్‌బాబు, రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషాలు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసిందన్న విషయాన్ని పెద్ద దుమారమే రేగుతోందని ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారని, దీన్ని కప్పిపుచ్చుకుని జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. మారిషన్ ప్రభుత్వం జగన్‌పై కేసుకు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిందన్న వైనం జాతీయ పత్రికల్లో ఎక్కడా రాలేదని దీనిపై కేంద్రం కూడా ఎలాంటి స్పందన లేదని కాని, ఆయన్ను నమ్ముకున్న కొన్ని రాష్టప్రత్రికలు దీన్ని రాద్దాంతం చేస్తున్నాయని జగన్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు కుటిలప్రయత్నాలు సాగిస్తున్నాయని వారు ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు ఏమాత్రం కేంద్రంపై నోరుమెదపక పోవడం, బడ్జెట్‌లో జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్కరికీ తెలపకుండా గుట్టుగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలు, ప్రతిపక్షాలు కనె్నర్రచేయడంతో ఇప్పుడు ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రిపాలనలో అనేక ప్రాజెక్టులు పూర్తికావచ్చాయని ఆయన అకాలమరణంతో ఈప్రాజెక్టుల పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. పోలవరం చేపట్టాలని ఆనాడే వైఎస్ పట్టుదలతో కృషిచేశారని చంద్రబాబు వచ్చాక ఈప్రాజెక్టులపై కమీషన్లకోసం కక్కుర్తిపడి పూర్తిచేసేందుకు దృష్టి సారించలేకపోయారని ఆరోపించారు. 2019కి ప్రాజెక్టు పూర్తవుతుందని చెబుతున్నా ఇంతవరకు 40శాతం కూడా పూర్తికాలేదని ఏడాదిలో ఎప్పుడు పూర్తిచేస్తారని వారు ప్రశ్నించారు. ఇది పూర్తికాకపోవడం వల్ల రాయలసీమలోని అనేక ప్రాజెక్టులకు నీరు దక్కే పరిస్థితి కూడా లేదన్నారు. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల పరిస్థితి అయోమయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై నెపం నెట్టి తిరిగి అధికారం దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి పరాభవం తప్పదని హెచ్చరించారు.