కడప

సమాజం కోసం.. విద్యార్థి సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఫిబ్రవరి 25:విద్యార్థి దశ నుండే సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండి సమాజంలో ప్రతిభావంతులైన పౌరులుగా ఎదిగేందుకు ప్రభుత్వం బీజం వేస్తోంది. ఈ క్రమంలోనే సమాజం కోసం విద్యార్థి సైన్యంను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనినే ఎస్పీసి (స్టూడెంట్స్ పోలీసు కేడర్) వ్యవస్థను తీసుకురానుంది.
పాఠశాల స్థాయిలో ప్రస్తుతం అమలులో ఉన్న స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సీసీ తరహాలో ఎస్పీసీ నడవనుంది. ఎస్పీసిల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో సమాజంపట్ల బాధ్యత, సేవాభావం పెంపొందించాలన్నది ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం దీన్ని చేపట్టింది. విద్యార్థి దశనుండి పోలీసు శాఖపట్ల సహృద్భావం పెంపొందించేందుకు నిర్ణయించడం జరిగింది. ఈ వ్యవస్థకు సంబంధించి జిల్లా స్థాయి నుండి కార్యాచరణ రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే అనువైన పాఠశాలలను ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. ఎస్పీసిలకు 12 అంశాలపై శిక్షణనిచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఎంపికచేసిన పాఠశాలలో ఉత్సాహవంతులైన విద్యార్థులను పోలీసు కేడెట్‌లుగా ఎంపిక చేస్తారు. ఎస్పీసిలుగా ఎంపికయిన విద్యార్థులకు రహదారి భద్రత, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడడం, ట్రాఫిక్‌పై అవగాహన, సానుభూతి, దయ, జాలి, కరుణలతో కూడిన సామాజిక అభివృద్ది, నేర నియంత్రణ, పచ్చదనం పరిశుభ్రత, టీం స్పిరిట్, బాలలు, మహిళలు రక్షణ, క్రమశిక్షణ, నీతి, విలువలు, అవినీతి వ్యతిరేక పోరాటాలు వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు సర్ట్ఫికేట్‌లను జారీ చేసి గుర్తింపునివ్వనున్నారు. రానున్న రెండేళ్లలో రాష్టవ్య్రాప్తంగా కనీసం 18వేల మంది విద్యార్థులను ఎస్పీసిలుగా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి.
విద్యార్థులకు మంచి భవిష్యత్
* కే.క్రిష్ణన్, డియస్పీ, జమ్మలమడుగు
ఎన్‌సీసీ, స్కౌట్ తరహాలో ప్రభుత్వం చేపట్టిన ఎస్పీసీ విధానం ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్ కలుగనుంది. విద్యార్థుల్లో పోటీతత్త్వ విధానంతో పాటు, సామాజిక బాధ్యత అంశాలు అవగతం కానున్నాయి. జమ్మలమడుగు సబ్‌డివిజన్ పరిధిలో మొదటగా పట్టణంలో పిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు పాఠశాలలను ఎంపిక చేయడం, కార్యక్రమం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించడం పూర్తిచేశాము. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాము.

ఘనంగా సీతారాముల గ్రామోత్సవం
కమలాపురం, ఫిబ్రవరి 25: మండలపరిధిలోని సీ గోపాలపురంలో నూతన విగ్రహాల ప్రతిష్టాకార్యక్రమ, కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారామ, లక్ష్మణ, హనుమత్ సమేత ప్రతిష్ఠావిగ్రహాల గ్రామోత్సవం ఘనంగా జరిగింది. అంతకుముందు నూతన ఆలయం వద్ద ప్రాతఃకాల పూజ, జపపారాయణాలు, ఆవాహిత దేవతా హోమాలు, గణపతి, రుద్ర, నవగ్రహ, చండి, సుదర్శన, మూలమంత్ర హోమాలు, సాయంత్రం ధాన్యాదివాసం, పుష్పశయ్యాదివాసం, అదివాస హోమాలు నిర్వహించారు. సోమవారం యంత్రస్థాపన, దీక్షా, ప్రతిష్టాహోమాలు, యంత్రప్రతిష్ట, విగ్రహ, శిఖర, ధ్వజస్తంభ, ప్రాణ ప్రతిష్టలు, బింబకళాన్యాసం, బలిప్రధానం, పూర్ణాహుతి, కుంభాభిషేకం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వేదపండితులు నాగరాజశర్మ, శివకుమార్‌శాస్ర్తీ తెలిపారు. కాగా సోమవారం రాతిదూలాన్ని ఎద్దులు లాగే పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.