కడప

అగ్నికి ఆహుతైన ఎస్‌డబ్ల్యుపీసీ డంపింగ్‌యార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం, ఫిబ్రవరి 25: మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ పక్కనే ఉన్న ఎస్‌డబ్ల్యుపీసీ డంపింగ్‌యార్డును గుర్తు తెలియని వ్యక్తులు అగ్గిపెట్టడంతో కాలిబూడిదైంది. వివరాలలోకి వెళ్లితే.. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో డంపింగ్‌యార్డు కాలుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు లక్కిరెడ్డిపల్లెలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం వచ్చి చేరుకొని కొద్దిమేర మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే పూర్తిగా కాలి బూడిదపాలైంది. విషయం తెలుసుకున్న చెత్తసేకరణ సంపద కేంద్రం ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో నిర్మింపచేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలి బూడిదైంది. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ఎంపీడీవో అబ్దుల్హ్రీం, ఏపీవో పెంచలయ్యలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని ఎస్‌డబ్ల్యుపీసీ యార్డు కాల్చేశారని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్‌స్టేషన్‌కు చేరిన ఇంటర్ ప్రశ్నాపత్రాలు
సంబేపల్లె, ఫిబ్రవరి 25: ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఆదివారం ఉదయం సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌కు చేరాయి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ నాగరాజ, డిపార్టుమెంటల్ అధికారి రఘురామయ్యలు స్టేషన్‌కు చేరిన ప్రశ్నాపత్రాలను పరిశీలించి ట్రంకుపెట్టెలో వాటిని ఉంచి సీల్ చేశారు. ఈ పరీక్షలు మండల పరిధిలోని యర్రగుంట్ల సమీపంలోని బాలయోగి గురుకులంలో మూడు కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.

మంగంపేట డేంజర్ జోన్‌లో సమస్యలు పరిష్కరిస్తాం
ఓబులవారిపల్లె, ఫిబ్రవరి 25: ఓబులవారిపల్లె మండలం మంగంపేటలోని డేంజర్‌జోన్‌లోని సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తహసీల్దార్ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తహశిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటరెడ్డిని మంగంపేట గ్రామస్తులు, కాకుపల్లె హరిజనవాడ, అరుంధతివాడ గ్రామస్తులు కలిసి మంగంపేట బ్లాస్టింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా గ్రామాలకు ప్రభుత్వం తరపున అందిస్తున్న అభివృద్ధి పథకాలు అందలేదని, గ్రామంలో దాదాపు 300 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఫించన్లకు నోచుకోలేదన్నారు. మా గ్రామాలల్లో ఉన్న దాదాపు 250 మంది రైతులకు సంబంధించిన భూములను ఎపిఎండిసి అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమ భూములను కొనుగోలు చేశారని, కాగా తమ నివాసమున్న ఇళ్లను ఎపిఎండిసి బ్లాస్టింగ్ జరుగుతున్న మధ్యలోనే ఉంచారని, ఈ బ్లాస్టింగ్‌తో గ్రామాల్లో అష్టకష్టాలు పడుతూ ఉన్నామన్నారు. వింత రోగాలతో ప్రజలు, కార్పోరేట్ ఆసుపత్రులకు వెళుతూ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారన్నారు. మా మూడు గ్రామాలను డేంజర్‌జోన్ కింద ప్రకటించి సహాయ సహకారాలు అందించాల్సిన ఎపిఎండిసి అధికారులు మొండివైఖరి అవలంభిస్తూ నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల తమ కుటుంబాలు చాలా దీన పరిస్థితికి చేరుకున్నాయన్నారు. ఎన్నో దపాలు ఎపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరి గ్రామాల్లో పర్యటించి తమ సమస్యలను కళ్లారా చూసినా కరుణించలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సంబంధిత ఎపిఎండిసి, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి డేంజర్‌జోన్‌గా ప్రకటించి ప్రభుత్వం తరపున, ఎపిఎండిసి తరపున జరుగుతున్న ప్రతి అభివృద్ధి పథకాన్ని అందించాలని వారు కోరారు.