కడప

ఇంటర్ పరీక్షలకు పకడ్బంధీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,్ఫబ్రవరి 25: ఈనెల 28వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈపరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు, చూచిరాతలకు స్వస్తిపలికేందుకు సిట్టింగ్ స్వ్కాడ్ పర్యవేక్షణ ఉంటుందని ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవి తెలిపారు. జిల్లాకు ఇప్పటికే ఓఎమ్మార్‌షీట్స్, మెయిన్ ఆన్సర్‌షీట్లు చేరుకున్నాయి. ఇవి పోలీసుస్టేషన్ ద్వారా ఆయా కేంద్రాలకు చేరవేస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30గంటలకే చేరుకోవాలని, 9గంటల అనంతరం నిమిషం దాటినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు చూచిరాతలకు పాల్పడితే నాలుగేళ్లపాటు పరీక్షలు రాయకుండా అనర్హులుగా చేస్తున్నట్లు ఆశాఖ పేర్కొంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈపరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాలు ఎంపికచేసి ఈ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు శాఖాధికారులు కంకణం కట్టుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్ కేటగిరి కింద 21,622 మంది పరీక్ష రాస్తుండగా, ఒకేషనల్ కోర్సు కింద 1,383మంది పరీక్షలకు సిద్దపడ్డారు. మొత్తం 23,005 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు సిద్దపడ్డారు. అలాగే 2వ సంవత్సరం పరీక్షలు జనరల్ కేటగిరి కింద 20,026మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఒకేషనల్‌కోర్సులో చదివినవారు 1,048మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం ద్వితీయ సంవత్సరంలో 21,074మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీటి వసతి ఏర్పాటుచేశారు. అలాగే చూచిరాతలకు పాల్పడకుండా, ఒకరి పరీక్షలు మరొక విద్యార్థి రాయకుండా ఉండే విధంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిఘా పెంచారు. ఆదివారం, సోమవారం పరీక్ష కేంద్రాల్లోని సమీప పోలీసుస్టేషన్లకు ప్రశ్నాపత్రాలు చేరవేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. ఈపరీక్షలు ఈనెల 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరగనున్నాయి. కేవలం మూడురోజులు వ్యవధి ఉండటంతో విద్యార్థులు వత్తిడిని అధిగమించి ఆలోచన పరంగా ఇష్టంతో పరీక్షలు రాస్తే విజయం వరిస్తుంది.

జిల్లాలో 18వేల ఇళ్ల మహాశంకుస్థాపన పక్షోత్సవాలు
కడప అర్బన్,్ఫబ్రవరి 25: జిల్లాలో ఇళ్లులేని పేదింటివాళ్ల కల నెరవేరబోతోంది. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద 18వేల ఇళ్లు శంకుస్థాపనలకు పక్షోత్సవాలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం చర్యలకు శ్రీకారం చుట్టింది. సామాన్యుడి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు రాష్టవ్య్రాప్తంగా 10లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వ ఆ దిశగా ముందడుగు వేసింది. ఇప్పటికే చాలామంది ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద దరఖాస్తు చేసుకుని నిరుత్సాహంతో ఉన్న లబ్ధిదారులకు సోమవారం నుంచి తీపి కబురు అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 2016-17 సంవత్సరం వరకు 47,283 గృహాలు కేటాయించింది. ఈ గృహాలన్నీ వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నాణ్యతతో కూడిన గృహాలు నిర్మించే దిశగా గృహనిర్మాణశాఖ నిరంతరం తన పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ఆశాఖ మేనేజర్‌తోపాటు డివిజన్ స్థాయి ఇంజనీర్లు, మండలస్థాయి వర్క్ ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 2018-19కి గాను 37,977 పక్కా గృహాలు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 10,100గృహాలు పూర్తి గృహప్రవేశాలకు సిద్దంగా ఉన్నాయి. 15,284 గృహాలు వివిధ స్థాయిలో నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి ఇప్పటికే రూ.125.99కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు నాసిరకం నిర్మాణాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా నిర్మాణాలు చేపట్టకుండా అధికారుల పర్యవేక్షణ పకడ్బంధీగా ఇళ్లనిర్మాణాలపై కొనసాగుతుంది. ఎన్‌టిఆర్ గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద లబ్దిదారులకు లక్షా 50వేలు గ్రామీణ ప్రాంతాల వారికి, పట్టణ ప్రాంతావారికి రూ.2లక్షలు ఇస్తారు. లబ్ధిదారుల అవసరాన్ని బట్టి ఇంటి గదులు ఇరుకుగా లేకుండా 750 చదరపు అడుగుల వరకు నిర్మించుకునేందుకు ప్రభుత్వం లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించింది. దీంతో విశాలమైన గదులతోపాటు స్వచ్చమైన గాలి, వెంటిలేటర్ సౌకర్యాలు లబ్ధిదారులకు ఒనగూరనున్నాయి. ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన గృహాల శంకుస్థాపనకు లబ్ధిదారులందరూ అధికారుల సాయంతో శంకుస్థాపన పక్షోత్సవాలు జరుపుకునేందుకు అధికారులు చేయూత అందించనున్నారు. అధికారుల సహాయంతో గృహనిర్మాణాలకు కావాల్సిన మార్కింగ్ తీసుకుని పునాదులు ప్రారంభించే దిశగా సోమవారం నుండి ముందడుగు వేయనున్నారు. ఆధార్, రేషన్, కుటుంబ సభ్యుల ఉపాధిహామీ పథకం కార్డు, స్థల ఆధీన ధృవీకరణ పత్రం ఆధార్‌కు అనుసంధానం చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్, మూడు ఫోటోలు, జిల్లా గృహనిర్మాణశాఖ లబ్ధిదారుల నుంచి సేకరించనుంది. కేటాయించిన గృహాలను మరొకరికి మార్పుచెందకుండా ఉండే విధంగా ఆధార్‌తో ఆన్‌లైన్ అనుసంధానం చేసేందుకు ఆ దిశగా జిల్లాయంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుని లబ్దిదారులకు మేలుచేకూర్చేందుకు పారదర్శకతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన లబ్దిదారులకు అనుమానాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1100కు ఫోన్‌చేసి తమ ఫిర్యాదులు , అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గృహనిర్మాణశాఖ మేనేజర్ కార్యాలయానికి , కలెక్టర్ దృష్టికి లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ టి.బాబూరావునాయుడు భరోసా ఇచ్చారు.
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి: మేడా
వీరబల్లి, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో ఆయా గ్రామ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి ఆదివారం మండల పరిధిలోని తాటిగుంటపల్లె గ్రామ పంచాయతీలోని మట్లి గ్రామ పంచాయతీలో ముగిసిన చిన్నగంగమ్మ జాతర ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. తాటిగుంటపల్లె గ్రామ టీడీపీ నాయకులు తిమ్మారెడ్డి ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుపొందేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు. మండల పరిధిలోని టీడీపీ నాయకులందరూ కలిసిమెలసి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యలపై ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాను ఎల్లవేళలా ఫోన్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామ కార్యకర్త వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.

ధ్వజస్తంభం ఏర్పాటు
* వెంకన్న విగ్రహం ఊరేగింపు
సుండుపల్లె, ఫిబ్రవరి 25: మండలంలోని ముడుంపాడు గ్రామ పంచాయతీ ఆరోగ్య పురం నందు నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహఙంచారు. కలశం పూజ, వినాయకుడి పూజలతో పాటు వేంకన్న, శ్రీదేవి, భూదేవి, గరుడ దేవుడు, అంజన్న విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గ్రామంలోని పురవీధుల్లో ప్రతిమలను ఊరేగింపు నిర్వహించారు. హాజరైన భక్తాదులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సోమవారం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.

ముస్లింల ఐక్యత కోసం పోరాడదాం
* ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి
* ముస్లింల ఐక్య వేదిక సభలో జడ్పీ మాజీ ఛైర్మన్ చమన్
రాయచోటి, ఫిబ్రవరి 25: ముస్లింల ఐక్యత కోసం పోరాడాలని అనంతపురం జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ చమన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రాజధాని కల్యాణ మండపంలో ముస్లింల ఐక్య వేదిక సమావేశం మునిసిపల్ కో ఆప్షన్ మెంబర్ సలావుద్దీన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడప జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నాయకులు, ముస్లింలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జడ్పీ మాజీ ఛైర్మన్ చమన్ మాట్లాడుతూ ముస్లింల హక్కుల కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. ముస్లింల్లో తెగలు, నూర్‌బాషలు అనే తారతమ్యం లేకుండా ముస్లింలంతా ఒక్కటి అందరూ కలిసికట్టుగా ఐక్యతగా పోరాడదామని సూచించారు. అదే విధంగా ప్రభుత్వం, రాజకీయ నాయకులు ముస్లింలను అణగదొక్కుతున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ముస్లింలకు అందనివ్వకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ముస్లింలు ఉంటే ముస్లింల అభివృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు 30 ఎమ్మెల్యే టికెట్లు, ఆరు ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కో ఆప్షన్ మెంబర్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో 1972లో ఎమ్మెల్యేగా హబీబుల్లా ముస్లింల అభివృద్ధికి పాటుపడ్డారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ముస్లింలకు టికెట్లు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఇప్పటికైనా ముస్లింలు మేల్కొని వచ్చే ఎన్నికలలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా గల్లీ నుండి ఢిల్లీ వరకు తమ బాణిని వినిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలను ఒకే వేదికపై తెచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముస్లింలకు ప్రయోజనాలు చేకూర్చేందుకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. హిందూపురం మాజీ ఎంపీ నిజాముద్దీన్ మాట్లాడుతూ ముస్లింల ఐక్యత కోసం ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలో ముస్లింలు అధిక శాతం ఉన్నారని ఈ ప్రాంతంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ముస్లింల అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ దిశగా ప్రతి ఒక్క ముస్లిం కృషి చేయాలని ఆయన సూచించారు.

ఏప్రిల్ 6న హోదా కోసం రాజీనామా: ఎంపీ మిథున్‌రెడ్డి
గాలివీడు, ఫిబ్రవరి 25: రాష్ట్ర విభజన హక్కుల్లో భాగంగా ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన వైఎస్ ఆర్‌సీపీకి చెందిన ఎంపీలందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పారిశ్రామికవేత్త తంగాల వేణుగోపాల్ రైస్‌మిల్లులో ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా అమలు కోసం ఎంపీలము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత నాలుగేళ్లుగా ప్రజాసమస్యలపై ప్రజల పక్షాన పోరాటాలు సాగిస్తున్నామని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై దోబూచులాట ఆడి ప్రజలను మోసగించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను అమలు చేయడంపై కాలయాపన చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా న్యాయవాదులు, ఇతర ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తుంటే మంత్రి ఆనందబాబు, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్‌లు ప్రాంతీయ విద్వేషాలు రగిలేవిధంగా మాట్లాడటంపై వారు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా వారు సూచించారు. కులు తంగాల వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ మెంబర్ మాబూసాబ్ తదితరులు పాల్గొన్నారు.

దైవచింతనతోనే భక్త్భివం
గాలివీడు, ఫిబ్రవరి 25: గ్రామాల్లో దేవాలయాల ఏర్పాటుతో ప్రజల్లో దైవారాధన దైవచింతనతో పాటు భక్త్భివం పెంపొందుతుందని సమరతసత సేవా ఫౌండేషన్ డివిజన్ మహిళా ధర్మప్రచారక్ లక్ష్మికళ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కోదండ రామాలయంలో మహిళా సభ్యులతో హిందుత్వంపై అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందుత్వాన్ని పెంపొందించేందుకు సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల్లో హిందూ మతం పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో అన్యమత ప్రచారం జరుగుతోందని హిందువులందరూ అన్యమత ప్రచారాన్ని ఆపేందుకు సహాయ సహకారాలు చేపట్టాలన్నారు. మతమార్పిడిల కోసం అనేక మంది అనేక రకాలుగా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని, అన్యమతస్థులు కుట్రలు, కుతంత్రాలను ఛేదించి మతమార్పిడిలను అరికట్టేందుకు మనందరం సమైక్యం ఎదుర్కోవాల్సిందిగా ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ధర్మప్రచారక్ బెల్లాల రవీంద్రారెడ్డి, మహిళా కన్వీనర్ సుజాత, కో కన్వీనర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు.