కడప

ముదురుతున్న యురేనియం సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: జిల్లాలోని వేముల మండలం మబ్బుచింతలపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటైన యురేనియం శుద్ధికర్మాగారం వ్యర్థాల వల్ల వేముల మండలంలోని ఆరుగ్రామాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కెవి కొట్టాలు, కనంపల్లి, మబ్చుచింతలపల్లి, భూమయ్యగారిపల్లి గ్రామాల్లో పంటలకు, మనుషులకు తీవ్ర నష్టం కలిగే పరిణామాలు క్రమక్రమంగా అధికవౌతున్నాయి. యురేనియం వ్యర్థాలను నిలువచేసే టైల్‌పాండ్ నుండి విడుదలయ్యే విష వాయువు వల్ల అరటితోటలు దిగుబడులు పూర్తిగా క్షీణిస్తున్నట్లు రైతులు గుర్తించారు. ఇక్కడ వేసిన వేరుశెనగపంటకు వేర్లకు బుడ్డలు దిగకముందే వేర్లు కుళ్లిపోయి, చెట్లు చచ్చిపోతున్నాయి. విత్తనం మొలచి మొక్కలు ఎదుగుతాయి కానీ, తీరా బుడ్డలు ఏర్పడే సమయంలో వేర్లు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి వేసిన రైతుల బాధ మరోరకంగా ఉంది. 9నెలలకు అన్నిచెట్లు గెలలు వేయాల్సివుండగా, 11నెలలైనా ఒక్కచెట్టు కూడా గెల వేయలేదని వాపోతున్నారు. మనుషుల శరీరాలపై దురదలు అధికవౌతున్నాయని చెబుతున్నారు. పశువుల్లో అండం విడుదలకాకపోవడంతో పశువుల ఉత్పత్తి ఆగిపోయిందని చెబుతున్నారు. పిల్లల్లో ఎదుగుదల నిలచిపోయే పరిణామాలు గుర్తిస్తున్నట్లు అక్కడివారు అంటున్నారు. వీటిపై, ముఖ్యంగా అరటి, వేరుశెనగ పంటలు దెబ్బతినడంపై ఎంపీ అవినాష్‌రెడ్డి ఈగ్రామాలను పరిశీలించి ఫోటోలు, వీడియోల్లో చిత్రీకరించి పరిశ్రమల సీఎండీ సికె హసానికి పంపారు. నష్టనివారణ చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఆందోళన చేస్తామని తెలియజేశారు.
కాగా రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ ఈనెల 19వ తేది ఈగ్రామాలను సందర్శించి గ్రామప్రజలతో భేటీ అయ్యారు. వారి నుండి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 21వ తేదీ నగరంలోని పార్టీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించారు. 26న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.
ఈలోపు ఈనెల 21వ తేదీ పరిశ్రమల సీఎండీ సికె హసాని యురేనియం ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. కెవి కొట్టాలు, కనంపల్లి గ్రామాల్లో అరటి పంటలను, వ్యర్థాలను నిల్వచేసే టైల్‌పాండ్‌ను ఆయన పరిశీలించారు. మార్చి 9వ తేదీ లోపు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టైల్‌పాండ్‌లోని నీటిని బోరుబావుల్లోని నీటిని, మట్టిని శాస్తవ్రేత్తలతో పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఆయన పర్యటన అనంతరం తిరుపతి, కర్నూలు నుండి కాలుష్యనియంత్రణ మండలి అధికారుల బృందం శనివారం కెవి కొట్టాలు, కనంపల్లి గ్రామాల్లో పర్యటించి బోరుబావుల్లోని నీటిని, మట్టిని సేకరించారు. సీఎండీ కూడా తిరిగి రావాల్సివుండగా ఆయన రాలేదు. స్థానిక అధికారులను కాలుష్యనియంత్రణ మండలి అధికారులను హైదరాబాద్‌కే రమ్మని ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం వీరంతా భేటీ అయి, యురేనియం ప్రభావిత గ్రామాల సమస్యలపై పరిశోధనాత్మక చర్చలు జరిపి, పరిష్కారానికి నివేదిక తయారుచేయనున్నారు.
యురేనియం శుద్ధి కర్మాగారం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురౌతాయో చెబుతూ , ఇక్కడ శుద్ధి కర్మాగారం ఏర్పాటుచేసే సమయంలోనే వామపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. గుజరాత్ యురేనియం ప్లాంట్ గ్రామాల నుండి అక్కడి సామాజిక వేత్తలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యసమస్యల చిత్రాలు తీసుకొచ్చి ప్రచారం చేశారు. అటువంటి సమస్యలు ఏవీ ఉత్పన్నం కాకుండా యురేనియం ప్లాంట్ ఏర్పాటవుతుందని అప్పట్లో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటుచేసింది. అయితే పూర్తి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో యురేనియం శుద్ధికర్మాగారం ప్రభావం ప్రజలు, పంటలపై పడటం ప్రారంభమైంది.

కమీషన్ల కోసమే ప్రత్యేక ప్యాకేజీ
* మేయర్ కె.సురేష్‌బాబు
కడప,్ఫబ్రవరి 25: తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు కమీషన్ల కోసమే ప్రత్యేక హోదా పక్కనబెట్టి ప్రత్యేక ప్యాకేజి అడుగుతున్నారని నగర మేయర్ కె.సురేష్‌బాబు ఆరోపించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రత్యేక హోదా పక్కనబెట్టి ప్యాకేజి ఇస్తామని ప్రకటించిన నాడే ప్యాకేజిలో కమీషన్లు దండుకోవచ్చుననే ఆలోచనతోనే కేంద్రాన్ని నిలదీయడం లేదన్నారు. ఇప్పుడు దేశ విదేశాలు తిరుగుతూ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారని ఇందులో కూడా ఆయన కమీషన్ల వాటా కుదుర్చుకున్నాకనే ఒప్పందాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ప్రజలకోసం నీతి నిజాయితీగా పాలనచేస్తే చంద్రబాబు మాత్రం కమీషన్లకోసమే పాలనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు, మంత్రులు సైతం కమీషన్ల ఏజెంట్లుగా మారారని విమర్శించారు. విశాఖపట్టణాన్ని ఎరగా వేసి అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ,పరిశ్రమల ఏర్పాటు ఎలా ఉన్నా ఆయన అనుచరులు భారీగా దండుకునేందుకే ఇక్కడ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా చూపిస్తూ అనేక కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడిస్తున్న ప్రభుత్వం ఇక్కడ కోట్లాదిరూపాయల దోపిడీకి పాల్పడుతోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి మారిషస్‌లో అక్రమవ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించడం వెనుక చంద్రబాబు, ఆయన అనుచుల ప్రమేయం ఉందన్నారు. ప్రజలను దోచుకోవడానికే పలు పథకాలు చేపడుతోందని నాలుగేళ్లకాలంలో ఎన్ని పథకాలు ఎందరికి అందజేశారో స్పష్టం చేయలేని పరిస్థితి ఆపార్టీలో దాపురించిందన్నారు. అలాగే బిజెపితో వైసీపీ ఒప్పందాలు చేసుకుందని తప్పుడు ప్రచారాలుచేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు సునీల్, కిశోర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.