క్రైమ్/లీగల్

బిటెక్ విద్యార్థి హత్యాకేసులో 9 మంది నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట/రాజంపేట రూరల్, మార్చి 3:గత నెల 19వ తేది రాత్రి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న పాలేటి సోముసాయి (21)ని అదే కళాశాలకు చెందిన సిరిగరాజు వంశీకృష్ణ అలియాస్ వంశీ హత్యచేసిన విషయం విదితమే. వివరాలిలావున్నాయి. శనివారం రాజంపేట అర్భన్ పోలీస్‌స్టేషన్‌లో సోముసాయి హత్యాకేసులో నిందితులను అరెస్టుచేశారు. అందులో భాగంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, మొదటి సంవత్సరం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని, ఈ ఘర్షణ చిలికిచిలికి గాలివానలామారి బయటివ్యక్తులు చీనేపల్లె హరీష్‌కుమార్, కొంతమంది గ్యాంగ్‌తో సంబంధాలు ఏర్పరుచుకుని సోముసాయిని హతమార్చేందుకు పథకం పన్నారని చెప్పారు. అందులో భాగంగా గతంలో కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న భరత్, సూర్యతేజల మధ్య గొడవజరిగింది. ఈ గొడవతో వంశీకృష్ణ సూర్యతేజ పక్షాన అతనికి దగ్గరి బంధువైన హరీష్ గ్యాంగ్‌తో కలిశారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన ఫంక్షన్‌లో సూర్యతేజ, సోముసాయిల మధ్య మళ్లీగొడవ జరిగింది. దీంతో సోముసాయి తన స్నేహితులతో కలసి కళాశాల క్యాంటిన్ వద్ద వంశీని కొట్టడం జరిగింది. అదే రోజు మధ్యాహ్నం హరీష్ గ్యాంగ్ సోముసాయిని కొట్టడం జరిగింది. అనంతరం సోముసాయి అతని స్నేహితులు వంశీని, సూర్యతేజను కళాశాలలో అందరి ముందు ఇష్టమెచ్చినట్లు కొట్టారు. ఈ అవమానం భరించలేక వంశీ హరీష్ గ్యాంగ్‌తో సోముసాయిని హత మార్చేందుకు పథకం రచించారు. ఫిబ్రవరి 19న సోముసాయి, వంశీకృష్ణలతో పరిచయం ఉన్న సిరిశెట్టి సాయికుమార్ సహయంతో వీరి మధ్య గొడవలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఇంటివద్ద ఉన్న సోముసాయిని రైల్వేస్టేషన్ సమీపంలోని డిగ్రీ కళాశాల రోడ్డు సబ్‌స్టేషన్ వద్దకు పిలుచుకొచ్చాడు. ముందుగానే పథకం వేసుకున్న వంశీ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన కత్తితో విచ్చక్షణా రహితంగా దాడిచేశారు. దీంతో సోముసాయి ఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ హత్యకు సహకరించిన వంశీ స్నేహితులైన హరీష్ గ్యాంగ్‌ను 9 మందిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. వీరిలో వంశీకృష్ణ, సిరిశెట్టి సాయికుమార్, చీనేపల్లె హరీష్‌కుమార్, కొండిశెట్టి సూర్యతేజలు హత్యకు ప్రధాన సూత్రధారులని వారికి సహకరించిన రాజనాల రఘనాథ్, షేక్ అజ్మత్ అలీ, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, పిడుగు శ్రీకాంత్, దుగ్గిశెట్టి వెంకటసురేష్‌లు ఉన్నారన్నారు.
విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి : డీఎస్పీ
తమ పిల్లల నడవడిక, స్నేహితుల తదితర అంశాలపై తల్లిదండ్రులు తప్పకుండా దృష్టిసారించాలని రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతతోపాటు పిల్లల చదువుతోపాటు ప్రవర్తన, ఇతరత్రా అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లలు కళాశాలకు వెళ్తున్నారా, స్నేహితులతో పెడదారి పడుతున్నారా గమనించాలన్నారు. ముందుగానే గమనిస్తే ఇలాంటి దుష్పపరిణామాలు చేటు చేసుకోవన్నారు. దీనివలన సభ్య సమాజానికి హనికరంగామారే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ ఇళ్లలో పిల్లలకు మంచి నడవడికతో కుటుంబ సంబంధాలు, ప్రేమ, సామాజిక దృక్పధం వంటి విషయాలు బోధించాలన్నారు. అలాంటపుడే పిల్లలు సామాజానికి ఉత్తమ పౌరులుగా తీర్చబడతారన్నారు.