కడప

టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,మార్చి 13: బిసీలకు పెద్దపీటవేసిన పార్టీ తెలుగుదేశంపార్టీ అని రాష్డ్ర వడ్డెర్ల ఫెడరేషన్ చైర్మన్ దేవర్ల మురళి అన్నారు. మంగళవారం నగరంలోని బీసీ కార్పొరేషన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో విడిపోయినప్పటికీ నాల్గవ బడ్జెట్‌లో 18-19లో రూ.50కోట్లు వడ్డెర్ల అభివృద్ధికి కేటాయించిందన్నారు. వడ్డెర, రజక, ఉప్పర, నారుూ, మేదర, కృష్ణబలిజ లాంటి పలు వెనుకబడిన తరగతులకు పేదరికం లేకుండా చేయాలని ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ.10వేలు సంపాదించుకునేలా చూడాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు జీవో 18ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఫెడరేషన్ చైర్మన్లు అన్ని జిల్లాలకు వెళ్లి బీసీ కార్పొరేషన్ల ద్వారా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వపథకాలు మనవారు పొందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా రెండుసంవత్సరాలకు రూ.132కోట్ల సబ్సిడీని 13 జిల్లాలకు ఇచ్చిందన్నారు. బీసీల పెళ్లికి రూ.30వేలు చెక్కును పెళ్లి పందిరిలోనే చంద్రన్న పెళ్లికానుకగా ఇస్తున్నారన్నారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.10లక్షలు ఇస్తోందని, 125 కులాలకు 6210 మంది లబ్దిదారులు ఉన్నారన్నారు. వడ్డెరలకు రూ.167కోట్లు బిసి సంక్షేమశాఖ ద్వారా రూ.170కోట్లు ఫెడరేషన్ ద్వారా రూ.178కోట్లు ఆదరణ పథకం కింద మొత్తం రూ.515కోట్లు రుణాలు లభ్యవౌతాయన్నారు. బీసీ కార్పొరేషన్ ఇడి శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా రూ.లక్ష సబ్సిడీతో మరో లక్ష రుణంగా లభిస్తుందని, గ్రూపుల ద్వారా అయితే రూ.15లక్షలు సబ్సిడీ, రూ.15లక్షలు రుణం లభిస్తుందన్నారు.

ప్రతి చెట్టుకూ నీరందిస్తాం
* 2019లో పులివెందుల టీడీపీదే.. * మండలి మాజీ ఉపాధ్యక్షులు సతీష్‌కుమార్‌రెడ్డి
పులివెందుల, మార్చి 13: పులివెందుల నియోజక వర్గ పరిధిలో చిన్న చిన్న చెట్టును కూడా ఎండనీయ్యమని శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మెన్ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్రావతి, పైడిపాళెం రిజర్వాయర్ నుంచి పీబీసీ కాల్వ ద్వారా ఏప్రిల్ 2వ వారం నుంచి నీటి విడుదల చేస్తామన్నారు. దీని ద్వారా రైతులుకు భూగర్భ జలాలు పెరగడటంతో పాటు చీనీ చెట్లుకు నీళ్ళు వేసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. 2019 ఎన్నికలలో పులివెందులలో తెలుగు దేశం పార్టీ గెలువడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.