కడప

యువతి హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,మార్చి 13: కడప నగరంలో ఓ యువతి ముగ్గురితో కలిసి మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతోంది. కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో త్రిబుల్ డ్రైవింగ్ నడిపే యువతిని ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేష్, కానిస్టేబుళ్లు ఆపారు. నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవింగ్ చేయరాదని అలా చేస్తే ఇతర వాహనచోదకులకు ఇబ్బందులు కలగడమేగాకుండా నడిపేవారికి కూడా ఇబ్బందులు కలుగుతాయని ఆ ఎస్‌ఐ మంచిమాటలు యువతికి చెప్పారు. చిర్రుబుర్రుమన్న ఆ యువతి కనీస మర్యాదపాటించకుండా నన్ను ఆపడం నీకు ఏమి హక్కు ఉందని మహిళ అంటే గౌరవం లేదా అని కస్సుబుస్సుమని కనీస మర్యాద ఇవ్వకుండా ఎస్‌ఐతో ఏకవచనంతో బైక్‌మీద కూర్చుని మాట్లాడుతూ హల్‌చల్ సృష్టించింది. బైక్‌పై త్రిబుల్ ప్రయాణం చేయడం చట్టరీత్యానేరమని ఆ యువతికి ఫైన్‌వేసి ఎస్‌ఐ చలానా స్లిప్ ఇచ్చాడు. వెంటనే ఆ యువతి ఆక్రోశానికి గురై పౌరుషంగా స్లిప్‌ను ఒక్కసారిగా ఎస్‌ఐ కళ్లముందే అప్పటికప్పుడే చించిపడేసింది. ఆగ్రహానికి గురైన యువతి తన ఫోన్ తీసుకుని రోడ్‌పై హల్‌చల్ సృష్టించింది. దీంతో ఒక్కసారిగా రోడ్డుమీద వెళ్తున్న వాహనచోదకులంతా వింతగా చూశారు. తీరా చూస్తే ఆ అమ్మాయి ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించడం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, ట్రాఫిక్ సిబ్బంది వచ్చి సర్దిచెప్పినా యువతి విన్పించుకోకుండా పోలీసులపై కస్సుబుస్సులాడింది. వాహనచోదకులు ఆ అమ్మాయి హల్‌చల్ చూసి చీదరించుకున్నారు. చదువుకున్న అమ్మాయిలు బైక్ ప్రయాణంలో జాగ్రత్తలు పాటించి, నిబంధనలు పాటించి ప్రజలకు, యువతులకు ఆదర్శంగా నిలవాల్సినవారే ఇలా పోలీసులను నిందించడం వారిపై కస్సుబుస్సులాడటం సమంజసంగా లేదని యువతిపట్ల అసహనం వ్యక్తంచేశారు. పెద్ద ఎత్తున చిందులు వేసి హల్‌చల్ సృష్టించిన యువతి బడానాయకుడి కూతురైనా ఉండాలి, పోలీసు సిబ్బంది కూతురైనా ఉండాలి, రెండింటిలో ఏదీ కాకపోతే సంస్కారంలేని యువతిగానైనా ఉండాలని అక్కడ గుమికూడిన ప్రజలంతా అనుకున్నారు. ఏది ఏమైనా ట్రాఫిక్ ఎస్‌ఐ శంకర్ ఆ యువతి వద్ద వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పొల్యూషన్ సర్ట్ఫికెట్, ఇన్సురెన్స్ సర్ట్ఫికెట్, హెల్మెట్ లేకపోవడంతోపాటు ముగ్గురుగా ప్రయాణం చేయడం ట్రాఫిక్ నియమ నిబంధనలకు చట్టవిరుద్దం కావడంతో రూ.3వేలు జరిమానా చలానా రాశారు.