కడప

యార్లపాడు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,మార్చి 13: మండల పరిధిలోని యార్లపాడు గ్రామాన్ని కలెక్టర్ బాబూరావునాయుడు మంగళవారం సందర్శించారు. ఆ గ్రామంలోని మంచినీటిని గ్రామప్రజలు తాగడం వల్ల ఫ్లోరైడ్ వ్యాధులు, నొప్పులు సంభవించడంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారన్న సమాచారం అందడంతో కలెక్టర్ సందర్శించి గ్రామప్రజలతో మాట్లాడారు. అనంతరం గ్రామప్రజలు కలెక్టర్‌తో మా గ్రామానికి వైవీయూ నుంచి పైపులైన్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని లేని పక్షంలో మినరల్‌వాటర్ ప్లాంట్స్‌ను నిర్మించాలని విన్నవించుకున్నారు. కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే మీగ్రామాన్ని యూనివర్సిటీ నుంచి పైపులైన్ ద్వారా మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేస్తామని ,గ్రామంలో ఉన్న నీటి ట్యాంక్ శుభ్రపరచి ట్యాంక్‌కు సఫ్లైచేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరావు, డీఎంహెచ్‌వో సులోచనాదేవి, మండల స్పెషలాఫీసర్ నరసింహారెడ్డి, తహశీల్దార్ ఆంజనేయులు , ఎంపిడివో మల్‌రెడ్డితోపాటు కొంతమంది ప్రజాప్రతినిధులు,ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.