కడప

వీరభద్రాలయంలో పంచాంగ శ్రవణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, మార్చి 18: స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానం నందు శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఆలయ వేదపండితులు పంచాంగ శ్రవణం గావించినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని స్వామి వారి, అమ్మవారి మూలవిరాట్ మూర్తులను వివిధ రకాల పుష్పాలతో ఆలయ అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలను గావించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు ఉగాది పచ్చడితో పాటు కంకణాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.

వీరభద్రుడి సన్నిధిలో మునిసిపల్ కమిషనర్
స్థానిక భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారిని రాయచోటి మునిసిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు దర్శించుకున్నట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదిన విశిష్టతను ఆలయ వేదపండితులు కమిషనర్‌కు వివరించారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు.

నిరుపేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిది
* విప్ మేడా మల్లికార్జునరెడ్డి
రాజంపేట టౌన్, మార్చి 18:రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహయ నిధి ఒకవరం లాంటిదని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 93 మందికి రూ. 53 లక్షల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మేడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు, ఖరీదైన వైద్యం చేయించుకునే స్ధోమత లేనివారికి సిఎం మెరుగైన వైద్యసేవలను కార్పోరేట్ తరహాలో కల్పిస్తున్నారన్నారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉగాది పండుగను పురస్కరించుకుని విప్ మేడాను ఘనంగా దుశ్శాలువతో సత్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.