కడప

శరవేగంగా సీతారాముల కల్యాణ వేదిక ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 18: ప్రపంచంలోనే రామాలయాల్లో ఒకటిగా గుర్తింపుబడ్డ ఏకశిలానగరం కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల కోసం శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాములోరి కల్యాణ వేదికకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 30న జరిగే రాములోరి కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ దక్షణభాగంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న పార్కుపనులు శరవేగంగా సాగిస్తున్నారు. అదేవిధంగా పురవీధులలో, మాడ వీధులలో విద్యుత్ అలంకరణ వంటి కార్యక్రమాలను శరవేగంగా జరుపుతున్నారు. ఈ మారు సీతారాముల కల్యాణానికి సిఎం మూడో మారు విచ్చేస్తున్నందున కల్యాణ వేదిక, ఆలయ ప్రాంగణాన్ని చూపరులు ఆకర్షించేలా డిప్యూటి ఇఓ లక్ష్మీనాయక్, ఇంజనీరింగ్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, డిఇ రాఘవయ్య నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్గానరు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది వీక్షించేలా భారీ స్థాయి షెల్టర్లు, వేదిక తయారు చేస్తున్నారు. తాత్కాలిక పనులు అలా ఉంచి కల్యాణం రోజు గత పొరబాట్లు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకొంటుంది. ఏదీ ఏమైనా రాములోరి బ్రహ్మోత్సవాలు మరో ఐదు రోజుల్లో ప్రారంభించేందుకు ఏకశిలనగరమంతా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి.