కడప

అనుబంధాల పటిష్టతే పండుగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 18: మనుషుల మద్య బంధాలను పటిష్టం చేయడమే పండుగల ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ప్రభుత్వపరంగా విళంబినామ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు నాగాంజనేయ శర్మ పంచాంగ పఠనం చేశారు. 12 రాశుల వారికి శుభాశుభ ఫలితాలను వివరించారు. ఈ ఏడాది బాగానే ఉంటుందని తెలిపారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని పాల్గొన్న వారందరికీ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండుగలంటే కేవలం సంతోషమేగాకుండా, అంతర్లీనంగా అనేక విలువలు, సంస్కృతి ఇమిడివుంటాయన్నారు. మనవారసత్వ సంపదను నేటి యువతకు తెలియజేసేందుకు రాష్టమ్రుఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల సూర్యనమస్కారం, జలసిరికి హారతి వంటి మన సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మమీ, డాడీ, అంకుల్ వంటి సంస్కృతి నుండి బయటపడి, భారతీయ సంప్రదాయాలను వార సత్వంగా ఆచరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. ఉగాది పండుగకు ముందు జిల్లాలో వర్షాలు పడటం శుభసూచకమన్నారు. ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవించే మనదేశంలో ఏ పంట ఎలా పండుతుంది, ఏ పంటలో లాభనష్టాలు ఎలా ఉంటాయి అనే అంశాలను ప్రధానంగా తెలియజెప్పేందుకు పంచాంగ పఠనం, శ్రవణం ఆచారంగా వస్తోందన్నారు. షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి జీవితంలోని అన్ని రకాల అనుభవాలకు చిహ్నమన్నారు. ప్రసంగాల అనంతరం యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు మూలమల్లికార్జునరెడ్డి పర్యవేక్షణలో కవిసమ్మేళనం నిర్వహించారు. కవులందరికీ చిరు సత్కారం చేశారు. కవిసమ్మేళనం అనంతరం షిర్డిసాయి నృత్యకళానిలయం వారిచే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు ప్రదర్శించారు. నృత్యప్రదర్శన చేసిన వారికి చిరుసత్కారం, మెమెంటోలు అందజేశారు.