కడప

ఆలయాల్లో పంచాంగశ్రవణ పఠనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)మార్చి 18: విళంబినామ ఉగాది పండుగ పురస్కరించుకుని ఆదివారం నగరంలోని అన్ని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆయా ఆలయాల్లో వేదపండితులు పంచాంగ శ్రవణ పఠనం చేశారు. ప్రధానంగా ఉగాది పండుగరోజు ముస్లింలు దేవునికడపలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అర్చకులకు పలు రకాల నిత్యవసర వస్తువులను అందించి వారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈనేపధ్యంలోనే పెద్ద సంఖ్యలో ముస్లింలు ఆలయానికి చేరుకుని స్వామివారికి కాయ, కర్పూరాలు సమర్పించి స్వామిని దర్శించుకున్న అనంతరం వారు తెచ్చిన నిత్యావసర వస్తువులు, సంభావనను అక్కడి అర్చకులకు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధానంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ముస్లింలకు బంధువుగా పెద్దలు చెప్పుకోవడంతో వంశపారంపర్యంగా ఈ ఆచారం వచ్చిందని భక్తులు చెబుతున్నారు. అలాగే నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, గడ్డిబాజరు వీధిలోని శ్రీసోమసుందరేశ్వరస్వామి ఆలయ, శ్రీలక్ష్మీసత్యనారాయణస్వామి ఆలయం, హౌసింగ్‌బోర్డులోని శ్రీకోదండరామాలయం, ఎన్‌జివో కాలనీలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం, మోచంపేట శివాలయం, నబీకోట శివాలయం, మున్సిపల్ మైదానంలో శ్రీదత్తసాయి మందిరం, శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంతో పాటు పలు దేవాలయాల్లో పంచాంగపఠనం చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయాల నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.