కడప

చంద్రబాబు మాటల్లో తప్ప చేతల్లో కానరాని రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాటల్లో తప్ప చేతల్లో కానరాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన వేంపల్లెలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని స్థాయిలలో అవినీతి భారీగా పెరగడంతో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోవడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. 2014 నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు పెరగడంతో పాటు రాష్ట్ర అప్పులు కూడా భారీగా పెరిగాయే తప్ప అభివృద్ధి మాత్రం కేవలం సీఎం చంద్రబాబు మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఏపీలో అభివృద్ధికి చంద్రబాబు అవినీతి పాలన ప్రతిబంధంగా మారిందని పవన్‌కల్యాణ్ వాఖ్యానించడం గమనార్హమని తెలిపారు. అభివృద్ధి పనుల పేరుతో నిధులను అధికార పార్టీ నాయకులకు భారీగా స్వాహా చేస్తున్నారన్నారు. ముఖ్యంగా అద్భుత రాజధాని ముసుగులో భారీ భూకుంభకోణం చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు హయాంలో ప్రజలను మభ్యపెట్టే ప్రచార ప్రగతే తప్ప అభివృద్ధి మచ్చుకైనా కానరాకపోవడం దురదృష్టకరమన్నారు. గత నాలుగేళ్లుగా నిరంతరం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేయడం మినహా రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. తన పార్టీ క్యాడర్ ఆర్థికంగా బలోపేతం అవడానికి చూపిస్తున్న శ్రద్ధ రాష్ట్భ్రావృద్ధిపై చూపడం లేదన్నారు. చంద్రబాబు తన అవినీతిని ప్రత్యేకించి వైఫల్యాలను కప్పి పుచ్చడానికే బీజేపీపై నిందలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తమ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను బీజేపీపై నెట్టడానికే టీడీపీ అవిశ్వాసం పేరుతో ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రధానంగా మంత్రి లోకేష్‌బాబు అవినీతిపై విచారణ జరిపించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేసిన నేపథ్యంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. చంద్రబాబు పాలనను పవన్‌కల్యాణ్ రెండున్నర మార్కులు వేయడాన్ని బట్టి ఏపీలో పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందన్నారు. లోక్‌సభలో సంపూర్ణ బలమున్న బీజేపీ అవిశ్వాసానికి భయపడుతోందనే వాదనలలో వాస్తవం లేదన్నారు. బీజేపీని ప్రత్యేకించి మోదీని బలహీనపరిచినప్పటికీ చంద్రబాబు చేస్తున్న కుట్రలను బీజేపీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. బీజేపీని తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు శశిభూషణరెడ్డి, డాక్టర్ డివి సుబ్బారెడ్డి, కె.రామచంద్రారెడ్డి, హరిప్రసాద్, సుష్మ తదితరులు పాల్గొన్నారు.

జగన్ పోరాటం చంద్రబాబుపైనే..
రాయచోటి, మార్చి 20: జగన్ పోరాటం కేంద్రంపైన కాదు, చంద్రబాబుపై అని జిల్లా అధికార ప్రతినిధి, మార్కెట్‌యార్డు ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాష పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 18 హామీలు, హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ చిందలు వేస్తూ మోదీతో లోపాయి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగడుగునా పోరాడుతున్నది చంద్రబాబే అని తెలిపారు. నేడు బహిరంగ పోరాటం చేస్తున్నది తెలుగుదేశమే అని తెలిపారు. కేంద్రానికి కానీ, ప్రధాని మోదీకి గాని ప్రశ్నించకుండా పదే పదే చంద్రబాబునే నిషేధించడం, దూషించడం జగన్ వైజాన్ని దుష్టబుద్ధిని తెలియజేస్తున్నదని తెలిపారు. వైకాపా అవిశ్వాసం ఒక జగన్నాటకం మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 29 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా, పారిశ్రామిక ప్రోత్సాహాలు గురించి డిమాండ్ చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబేనన్నారు. ఈ సమావేశంలో 3వ వార్డు టీడీపీ అధ్యక్షులు అలీమ్, టీఎన్‌టీయూసీ జిల్లా సభ్యుడు జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

విధుల నుండి ఇద్దరు ఇన్విజిలేటర్లు తొలగింపు
రాయచోటి, మార్చి 20: రాయచోటి పట్టణంలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మంగళవారం ఇద్దరు ఇన్విజిలేటర్లను వారి విధుల నుంచి తొలగించినట్లు స్క్వాడ్ మానిటర్ చంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయనర మాట్లాడుతూ బస్టాండు రహదారిలో ఉన్న డైట్ స్కూల్ పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డి, బోస్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస స్కూల్ పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహిస్తున్న నసీర్‌ఖాన్‌లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా వారిని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిపేందుకు అందరూ కృషి చేయాలని ఆయన తెలిపారు.