కడప

జీవన జ్యోతి బీమాయోజనలో చేనేత కార్మికులకు అన్యాయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 20: ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం జిల్లాలోని చేనేత కార్మికులకు అందని వరంగా మారింది. ఈనెలాఖరుకు ఈ పథకం కింద బీమా చేయాల్సిన అధికారులు సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయడంలో వెనుకడుగువేశారు. దీంతో జిల్లాలో సుమారు 7600 మంది కార్మికులు ఈపథకం కింద లబ్దిపొందలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ గుణకర్ బీమా యోజన పథకం కింద ప్రతి కార్మికుడికి బీమా అందే విధంగా ఈపథకం అమలు చేశారు. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం ఈపథకం పేరుమార్చి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంగా మార్చేసింది. ఈ పథకం ఈ ఏడాది మే నుండి జూన్ నాటికి పూర్తికావాల్సివుంది. అయితే ఈపథకం అమలులో అనేక అవరోధాలు తలెత్తుతున్నాయి. కార్మికుడి కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సమగ్రంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సివుంది. దీనికి చేనేత జౌళి శాఖ బాధ్యతగా పనిచేయాల్సివుంది. జిల్లాలో చేనేత రంగంలో 60వేల కుటుంబాలు జీవిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. 195 చేనేత సొసైటీలు, 180 సొసైటీలు ఉన్నాయి. వీటిలో సుమారు 19100 మంది సభ్యులు పనిచేస్తున్నారు. గతంలో గుణకర్ బీమా యోజన కింద 4800 మందికి జీవిత బీమా సదుపాయం ఏర్పాటు చేశారు. ఇద్దరు పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం ఒక్కొక్కరికి రూ.1200లు స్టయిఫండ్ రూపంలో ఏడాది పొడవునా ఇచ్చేవారు. అయితే కేంద్రప్రభుత్వం ఈపథకం పేరును మార్చడమేగాకుండా విదివిధానాలు కూడా మార్చేసింది. ప్రధాని జీవన జ్యోతి బీమా యోజన చేపట్టి గతంలో ఉన్న పథకంలో ఉన్న సభ్యుల శాతాన్ని 50శాతానికి కుదించి వేసింది. దీంతో కార్మికులకు తీరని అన్యాయం చేసుకుంది. చేనేత కార్మికుడు ఏడాదికి రూ.80లు చేనేతలకు చెల్లించాల్సివుంది. ఇందువల్ల గతంలో 4800 మంది చేనేత కార్మికులకు ఈ పథకం అమలయ్యేది. 2018 జూన్ నుండి మే వరకు ఈపథకం అమలుకానుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తులు అర్హులు. కాకపోతే కేవలం 2400 మందికి మాత్రమే ఈపథకం వర్తించే విధంగా కేంద్రం నిబంధనలు విధించడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 7600 మంది సభ్యులు పథకానికి దూరమయ్యారు. జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ,కమలాపురం, రాజంపేట ప్రాంతాల్లో భారీ ఎత్తున చేనేత కార్మికులు చేనేతనే వృత్తిగా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ వృత్తే ప్రధాన ఆధారంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మంది కార్మికులు కంటి వ్యాధులు, చర్మవ్యాదులు, టీబీ వంటి వ్యాధులతో సతమతవౌతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీల్లో అనేక మంది నేతలకు పెద్ద ఎత్తున సొసైటీలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పథకాల కింద వీరిని ఆదుకునేందుకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నా ఇవన్నీ ఆయా సొసైటీలను గుప్పెట్లో పెట్టుకున్న నేతలే వీటిని దక్కించుకుంటున్నారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన రుణమాఫీలో కూడా నేతలే బోక్తలయ్యారు. జిల్లా వ్యాప్తంగా చేనేత మీద బతుకుతున్న కార్మికుల జీవితం దుర్భరంగా ఉంది. వారి జీవితాలపై ప్రభుత్వాలు, పాలకుల ప్రసంగాలు, ప్రకటనలు హామీలు గుప్పిస్తున్నారే తప్ప వారిని ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టడం లేదన్నది నగ్నసత్యం.

గడువులోగా మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి చేయాలి
రామాపురం, మార్చి 20: గడువులోగా మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని జడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని చిట్లూరు పంచాయతీ హరిజనవాడలో మంగళవారం ఆయన మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందకు ప్రభుత్వం ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మించుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో 73 మరుగుదొడ్లు నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయన్నారు. త్వరలో మరుగుదొడ్లు పూర్తి చేయించాలని తహశీల్దార్ దేవలానాయక్, ఎంపీడీవో అబ్దుల్హ్రీంలకు సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నిలిపివేస్తామన్నారు. గ్రామానికి ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పైపులై జాతీయ రహదారి పనులు చేస్తున్న దిలీప్ కంపెనీ వారు తాగునీటి పైపులైన్ పగులకొట్టాలని, గ్రామంలో గత ఐదు నెలలుగా తాగునీరు లేక ఇక్కట్లు పడుతున్నామని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తాగడానికి నీళ్లు లేవు, మరుగుదొడ్లు నిర్మాణ పనులు ఎలా చేయాలని గ్రామ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని మరుగుదొడ్లు నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని కింద స్థాయి అధికారులకు ఆయన సూచించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాకు 1,23 లక్షల మరుగుదొడ్లు మంజూరు కాగా త్వరగా మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. జిల్లాను త్వరగా ఓడీఎఫ్ చేస్తామన్నారు.