కడప

ప్రభుత్వ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,మార్చి 20: ప్రభుత్వ సొమ్మును ఎవరైనా తన స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తే చట్టం ప్రకారం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో ఒక్కరోజు డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు జిల్లా జడ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చిన్నచిన్న మొత్తాలను సద్వినియోగం చేసుకుని ఆ మొత్తాన్ని కంతుల రూపంలో చెల్లించినప్పుడే సద్వినియోగం అవుతుందని, అలాగే డ్వాక్రా మహిళల సొమ్మును ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సివుంటుందని హెచ్చరించారు. కాగా శంకరాపురానికి చెందిన డ్వాక్రా మహిళ గ్రూప్ రీసోర్స్‌పర్సన్ లక్ష్మీదేవి 30 మంది సభ్యుల యొక్క సొమ్మును బ్యాంకులో నెలనెలా డిపాజిట్ చేయకుండా రూ.8లక్షలు స్వాహా చేసింది. ఆమెను చట్టం ప్రకారం విచారణ చేసి సొమ్ము రికవరీ చేస్తామని అన్నారు. అలాగే ఆమె ఇప్పటికైనా తన తప్పును తెలుసుకుని బ్యాంకులో రూ.8లక్షలు డిపాజిట్ చేస్తే ఎలాంటి కేసులు పెట్టకుండా క్షమిస్తామన్నారు. లేనిపక్షంలో 30కేసులు ఆమెపై రిజిస్టర్‌చేసి కోర్టులో విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలకు సఖ్యతగా ప్రభుత్వ సొమ్మును అంటే ప్రజల సొమ్ము అని గుర్తించుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి యు.యు.ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే వారికి న్యాయసహాయం అందిస్తామన్నారు. పొదుపు సంఘం చట్టం ప్రకారం రూల్ -8, రూల్ -6, రూల్ -10కింద ప్రతి సభ్యుడు బాధ్యతగా తీసుకున్న సొమ్మును చెల్లించాలని, ఎవరైనా అతిక్రమిస్తే ఆస్తులు జప్తు చేస్తామని, సొమ్ముతో మహిళలు చిరు వ్యాపారాల ద్వారా అభివృద్ధి చెందాలని, ఎవరైనా 60సంవత్సరాలు పైబడి సభ్యులుగా ఉంటే అనర్హులని, అలాగే సభ్యుల్లో ఎవరైనా దివాలా కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తే డ్వాక్రా సభ్యులుగా అనర్హులు అన్నారు. ఈ సమావేశానికి మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులురెడ్డి, న్యాయవాది నాగరాజు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.