కడప

అర్హులైన లబ్దిదారులకు భూముల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మార్చి 21: ఎస్సీ కార్పొరేషన్ క్రింద అర్హులైన లబ్దిదారులకు భూములను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి జెసి శివారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎల్‌పియస్ క్రింద కొనుగోలుకు గుర్తించిన భూములున్న ఆయా ప్రాంతాల్లో బుధవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి శివారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు ఎల్‌పియస్ పథకం కోసం సాగులో ఉన్న భూములను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో కొనుగోలు చేసిన భూములను ఆయా గ్రామాల్లోని అర్హులైన ఎస్సీలకు ఒక్కో కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పర్యటనలో భాగంగా ఎల్‌పియస్‌కు భూములు అమ్మకానికి ముందుకు వచ్చిన రైతులతో పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయా గ్రామాల్లోని ఎస్సీలతో భూ పంపిణీ విషయాలపై పలు విషయాలను వివరించారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని తొర్రివేముల గ్రామంలో 32.39 ఎకరములు, చిన్నకొమెర్ల గ్రామం పరిధిలో 7, తలమంచిపట్నం గ్రామంలో 25, బెస్తవేముల గ్రామంలో 7.90 ఎకరముల చొప్పున భూములను ఎల్‌పియస్ పథకం కోసం గుర్తించడం జరిగిందని మండల తహశీల్దార్ పి.యస్.మొహిద్దీన్ జెసి శివారెడ్డి, జిల్లా అధికారుల బృందానికి వివరించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై వైద్యమిత్రల హర్షం
రాయచోటి, మార్చి 21: డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ పథక వైద్యమిత్రలను యధావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యమిత్రలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైద్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి ప్రసాద్‌నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ న్యాయస్థాన తీర్పు వైద్యమిత్రల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. వైద్యసేవ పథకం విజయవంతం కోసం తాము మరింత పట్టుదల, చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. న్యాయస్థానంలో కేసు విజయవంతానికి సహకరించిన అందరికీ పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

ఘనంగా అంతర్జాతీయ కవితల దినోత్సవం
గోపవరం, మార్చి 21: అంతర్జాతీయ కవితా దినోత్సవం కవయిత్రి మొల్లా సాహితీ పీఠం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రముఖ సాహితీ వేత్త విద్వాన్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ పద్య తెలుగువారి సొత్తు. పద్యం మన భాషను సంస్కృతిని వెల్లడిస్తుంది. అట్టి తెలుగు పద్య సంస్కృతిని పరిరక్షించండి అని ఆయన పిలుపునిచ్చారు. మొల్ల రామాయణంలో పద్యపఠన పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు, ధృవీకరణ పత్రాలును అందజేశారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులకు కడప జిల్లాలోని అల్లసాని పెద్దన్న, రామరాజభూషణుడు, అయ్యలరాజురామభద్రుడు, కవయిత్రి మొల్ల, పద్యన కవి పోతన, మొదలగు ప్రాచీన కవుల గురించి వివరించారు. నేటి ఆధునిక కవులైన గడియారం వెంకటశేషాశాస్ర్తీ, ఆవాదానం చంద్రశేఖరశర్మ, కామరాజు, సీతారామ కవి, సుబ్రమణ్యశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, మొదలగు వారు మన పద్యాన్ని, తద్వారా మన భాషను సంస్కృతిని పెంచి పోషించి పెద్ద పీఠవేశారని గుర్తుచేశారు.