కడప

వావిలికొలను కన్నా ముందే భక్తుడు భవనాసి ఓబులదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 21: వివిధ రకాల భక్తులను మనం నేటికి చూస్తూనే ఉన్నాం. అందులో సాక్షాత్తు భగవంతుని దర్శనం పొందిన అపర భక్తులు ఈ భూమిపై కొందరంటే కొందరే ఉంటారు. అలాంటి వారిలో భవనాసి ఓబులదాసు (మాల ఓబన్న) అనే భక్తుడు ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ఈయన ఒంటిమిట్టకు క్రోసుడు దూరంలోని మలకాటిపల్లె హరిజన కుటుంబంలో జన్మించారు. ఆనాదిగా అనగా పూర్వమే సాక్షాత్తు రాముని దర్శనం పొందిన అపర భక్తుడుగా పేరుగాంచారు. అయితే నేటికి ఈయన వంశస్తులు మలకాటిపల్లెలో నివాసం ఉంటున్నారు. కాని ఆ వంశం వారిని ఎవరిని పట్టించుకున్న పాపాన నాటి నుండి నేటి వరకు లేదు. కోదండ రాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈయన గురించి నేటి సమాజంలోని వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టగోచి పెట్టుకుని టెంకాయ చిప్పతో కోట్లాది రూపాయలు సంపాదించిన వావిలికొలను సుబ్బారావు కన్నా భవనాసి ఓబులదాసు ముందువాడుగా నేటి చరిత్రలో నిలిచారు. ప్రతి నిత్యం పాటలు పాడుకొంటూ ఈయన రాముని కైంకర్యంలో జీవించాడు. అయితే ఈయన ఫొటో కాని, తల్లిదండ్రులు, వయస్సు గాని వారి వంశస్థులకు పూర్తిగా తెలియకపోవడం బాధాకరమని ఆ వంశస్థుడు భవనాసి రామదాసు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలంలో అంటరానితనం అధికంగా ఉండేది. ఆ రోజుల్లోనే ఈయనను ఆలయంలోకి రానివ్వకుండా తాపలకే పరిమితం చేసేవారు. అయినా ఆయన బాధపడకుండా రాముని కీర్తించడమే పరమావధిగా పెట్టుకుని తన గానంతో తిరిగే వాడు. పెత్తందారులు ఆయనను పాటలు పాడనివ్వకుండా ఒంటిమిట్ట చెరువులోకి తోయగా, తూర్పు భాగంలోని సీతారామలక్ష్ముణులు పడమర వైపునకు తిరిగి ఉండటం జరిగిందట. అప్పటి అర్చకులు ఉదయానే్నలేచి ఆలయ తలుపులు తెరవగా పడమర వైపు ఉన్న విగ్రహాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారంట. దీంతో ఓబులదాసు ఆలయం పశ్చిమ వైపున తన గానామృతంతో పాటలు పాడుతున్నాడంట. ఇది గమనించిన పెద్దలు, పెత్తందారులు ఓబులదాసును మేళతాళాలు, మంత్రోచ్ఛరణలతో ఆలయంలోనికి స్వాగతం పలికారంట. అప్పటి నుండి అంటరానితనం విడనాడి ఓబులదాసును సత్కరించి తమ తప్పిదం క్షమించమని కోరారట. ఏమి కావాలని పెద్దలు కోరగా తమకు ఏమి అక్కరలేదని, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ నాడు బియ్యం, పసుపు, కుంకుమ వంటి పూజాసామాగ్రి తమ వంశం వారి నుండి స్వీకరించాలని కోరడం జరిగింది. దీంతో ఆ రోజుల్లోనే కల్యాణం మరుసటి రోజు స్వామివారికి నివేదన చేసేవారట. అప్పట్లోనే ఎంతో భక్తిపరునిగా కీర్తిగాంచిన ఓబులదాసు మరణం అనంతరం ఆలయ అభిముఖంగా మాలఓబన్న స్థూపం ఏర్పాటుచేశారు. నేడు ఆ స్థూపం మనకందరికి కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయన వంశీకుడు రామదాసు మాట్లాడుతూ గతంలోని దేవాదాయశాఖ, ఇప్పటి టీటీడీ వారు కాని తమ వంశీకులను ఏనాడు గౌరవించలేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీటీడీ చర్యలు తీసుకుని గరుడ సేవరోజు తమ సంప్రదాయం ప్రకారం పూజాసామాగ్రి తమ వంశస్థుల ద్వారా స్వీకరించి పెత్తందారులు, గ్రామస్తులు ఏర్పాటుచేసిన అగ్ర తాంబూలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. అలాచేస్తే ఓబులదాసు కీర్తికి గుర్తింపు లభించినట్లు అవుతుందన్నారు. అలా చేయకుంటే తాళ్లపాక అన్నమయ్య వంశస్థులకు ఏ విధంగా గౌరవ, మర్యాదలు దక్కుతున్నాయో, భవనాసి ఓబులదాసు వంశస్థులకు కూడా గౌరవ మర్యాదలు ఇవ్వాలన్నారు. ఇపుడైనా తెరవెనుక ఉన్న ఓబులదాసు చరిత్ర బయటకు వచ్చేలా సుబ్బారావు చరిత్ర తరహాలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.