కడప

టెన్త్ పరీక్షల్లో వాట్సాప్‌ల ద్వారా ప్రశ్నాపత్రం లీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు, మార్చి 22: స్థానిక రెండుపరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో గురువారం గణితం-2పరీక్షలో పరీక్ష ప్రారంభమైన 10గంటలకే వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ కావడంతో బయట నుంచి విద్యార్థులకు కాపీలు అందించేందుకు పలువురు ఎగబడ్డారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాల, బాలికల ఉన్నతపాఠశాలలో టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 15నుంచి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.పరీక్ష మొదలైనప్పటి నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఈ విషయం అధికారులకు దృష్టికి వెళ్లడంతో తమ పరిధిలో నుంచి లీక్ కాలేదని, రెండుపరీక్షా కేంద్రాల అధికారులు చెబుతున్నారు. అయితే ఈపరీక్ష కేంద్రాల్లో ముందు నుంచి పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జనాలు గుడిగూడటం, పాఠశాల చుట్టూ తిరగడం , విద్యార్థులకు కాపీలు అందించడం జరుగుతోంది. పాఠశాలల వద్ద పోలీసుల మోటార్ సైకిళ్లు ఉంచగా, గాలి తీసిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ పోలీసులు వౌనంగా ఉండిపోయారు. ఈపరీక్షా కేంద్రాలకు అతి సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిర్మోహమాటంగా వారి పిల్లలకోసం సహకరిస్తున్నట్లు తెలిసింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి జిరాక్స్ సెంటర్లు పనిచేస్తుంటాయి. జిరాక్స్‌సెంటర్ల వద్ద రద్దీగా ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో జిల్లా అధికారులు చెన్నూరు కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.