కడప

ఐదు కోట్లప్రజల ఆకాంక్ష ప్రత్యేకహోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, మార్చి 22: ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని అఖిలపక్షం నాయకులు గురువారం అన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అఖిలపక్షం సహకారంతో కడప నగర శివారులోని రాజంపేట రింగ్‌రోడ్డులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంవద్ద హైవే బంద్ నిర్వహించారు. తొలుత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వైసీపీ వర్గాలు రోడ్డుపై బైటాయించాయి. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తానన్న బీజేపీ మాటతప్పిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూ అన్నింటా బీజేపీకి కొమ్ముకాస్తూ రాష్ట్రప్రయోజనాలు ఫణంగా పెట్టారన్నారు. ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి బీజేపీతో కుమ్మక్కై వారి హామీలు నమ్మి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి తల ఊపి తలకెత్తుకున్నాడన్నారు. జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆది నుండి ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు శ్రీరామ రక్ష అని చెబుతున్నా వినకుండా అదేమన్నా సంజీవినా అంటూ తోసిపుచ్చాడన్నారు. నాలుగు సంవత్సరాల పాటు ప్రత్యేక ప్యాకేజీతో తన కడుపునింపుకుని కళ్లబొళ్లి మాటలతో ప్రజల కడుపుకొట్టారన్నారు. నాలుగు సంవత్సరాలు గడిచినా ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. కేవలం బీజేపీ భజనే సరిపోయిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా అంటే తాను ప్రత్యేక హోదా, ఆయన రాజీనామాలు అంటే తానూ రాజీనామా, ఆయన అవిశ్వాసమంటే ఈయన అవిశ్వాసం అంటూ జగన్మోహన్‌రెడ్డికి అడ్డుగా నిలవడమే ధ్యేయంగా చేసుకున్నాడన్నారు. బీజేపీ ఇదే అవకాశంగా పలు ఎత్తుగడలతో అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో చర్చకు రాకుండా చేస్తోందన్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రజలను వంచించినందుకు టీడీపీ మూల్యం చెల్లించే రోజు వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో పులిసునీల్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు బండి జక్కరయ్యలు మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీకి తల ఊపి ఆ డబ్బుతో తెలుగుదేశంపార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్‌పార్టీ నాడు, నేడు ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కట్టుబడి వుందని, ప్లీనరీలో సైతం రాహుల్ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌పైనే ఉంటుందని తెలిపారన్నారు. జనసేన నాయకుడు చలపతి... మాట్లాడుతూ అఖిలపక్షంతోపాటు తమ పార్టీ కూడా హోదాకోసం రోడ్డుపైకి వచ్చిందన్నారు. ప్రత్యేకహోదాకోసం అవసరమైతే తమ అధినేత పవన్‌కళ్యాణ్ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారని, కార్యకర్తలుగా మేము సైతం ఆయన వెంటే ఉంటామన్నారు. అలాగే సీపీఐ, సీపీఎంలు విభజన సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని సీపీఎం జిల్లా నాయకులు ఆంజనేయులు ఆరోపించారు. ప్రధాని మోదీ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధాని కాదని, దేశాన్నంతా సమదృష్టితో చూడాలన్నారు. సీపీఐ జిల్లా నాయకులు వెంకటశివ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ప్రత్యేకహోదా పేరుతో ఆంధ్రప్రదేశ్‌ను మోసగించారని ఇప్పటికైనా హోదాను ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.