కడప

భారతీయులను ఐక్యపరిచేది హిందీయే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్, మార్చి 22: భారతీయులందర్నీ ఐక్యంగా కలిపివుంచేది హిందీ బాషేనని నవభారత్ టైమ్స్ ఎడిటోరియల్ సంపాదక్ చంద్రభూషణ్ అన్నారు. నగరంలోని శ్రీనివాసరెసిడెన్షి ఫంక్షన్ హాల్‌లో హిందీ భవన్ ఆధ్వర్యంలో మూడురోజుల హిందీ భాష జాతీయ సెమినార్ ప్రారంభమైంది. ఈసెమినార్‌ను తమిళనాడు హిందీ అకాడమి అధ్యక్షులు కృష్ణచంద్ చౌరాణియా ప్రారంభించారు. సెమినార్‌కు ముఖ్యఅతిధిగా విచ్చేసిన చంద్రభూషణ్ మాట్లాడుతూ హిందీ బాషను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు నేర్చుకోవాలని అన్నారు. మరో అతిథి కన్నన్ మాట్లాడుతూ హిందీకాని క్షేత్రంలో ఇంత గొప్పగా హిందీ మాట్లాడేవారు ఉండటం చాలా సంతోషకరమన్నారు. భాషల మద్య సమన్వయం ముఖ్యమని, అందుకోసం హిందీ భవన్ వ్యవస్థాపకులు కె.ఎస్.పర్హతుల్లా చేస్తున్న కృషి కొనియాడ దగ్గదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 40మంది హిందీబాషా విద్వాంసులు, పాత్రికేయులు కడపకు విచ్చేయడం ముదావహమని, తాను తన పిల్లలకు హిందీ నేర్పిస్తున్నానని అన్నారు. వారు హిందీలోనే సంభాషిస్తుంటారన్నారు. కెఎస్ హిందీ భవన్‌కు ప్రభుత్వపరంగా కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. తొలిరోజు సెమినార్‌లో అస్సాం, బెంగాలి, ఒడిస్సా బాషల విధ్వాంసుల మద్య చర్చ జరిగింది.