కడప

ఏప్రిల్ 30వరకు కందులు,శెనగలు కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,మార్చి 24: జిల్లాలోని రైతులు పండించిన కందులు, శెనగలు ఏప్రిల్‌నెల 30వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాల నుంచి కొంటామని జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కె.రమేష్ తెలిపారు. జిల్లాలో 7 పప్పుదినుసుల కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటివరకు 1426మంది రైతుల నుంచి 22339 క్వింటాళ్లు కందులు కొనుగోలు చేశామన్నారు. అలాగే 1274మంది రైతుల నుంచి 1574 మంది రైతుల నుంచి 30583 క్వింటాళ్లు శెనగలు కొనుగోలు చేశామన్నారు. 867మంది రైతులనుంచి 16434 క్వింటాళ్లు మినుములు కొనుగోలు చేశామన్నారు. మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాలమేరకు మినుములు 20వేల క్వింటాళ్లు, కందులు 30వేల క్వింటాళ్లు, శెనగలు 2లక్షల 50వేల క్వింటాళ్లను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆయా మండల వ్యవసాయాధికారుల ద్వారా టోకన్లు రైతులకు జారీ చేస్తామన్నారు. జేసీ ఆదేశాలమేరకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలవారికి రైతులు మాత్రమే సరుకుతోరావాలని దళారులను నమ్మి కొనుగోలు కేంద్రానికి రాకూడదని సూచించారు. రైతులు పండించిన పంట సాగు ధృవీకరణ పత్రం పొందిన రైతు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని సమీప కేంద్రానికి వస్తే రైతుల వద్ద నుంచి పప్పుదినుసులు కొనుగోలుచేస్తామన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను భౌతిక పరిశీలన చేయాలి
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా
కడప అర్బన్,మార్చి 24: జిల్లాలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భౌతికంగా పరిశీలన చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ఈవీఎంలను రెవెన్యూ అధికారి కేడర్‌కు తక్కువగాని అధికారితో భౌతిక పరిశీలన చేపట్టి, పనిచేయని వాటిని వెనక్కిపంపించాలని కలెక్టర్ బాబూరావునాయుడును కోరారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద శనివారం తుది ఎలక్ట్రోరల్ జాబితా విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు ,పార్టీ ప్రతినిధులకు ఈ జాబితా అందించి వారి నుంచి ఈనెల 29లోగా రశీదులు తీసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవిఎంలు పరిశీలించామని, మిగిలిన నాలుగు నియోజకవర్గాల ఈవిఎంలు త్వరలో భౌతికంగా పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఈవిఎంలను కలెక్టర్ క్యాంపస్‌లోని ప్రత్యేక గదిలో భద్రపరచినట్లు తెలిపారు. జిల్లాలో 12977 బ్యాలెట్లు యూనిట్లు, 6378 కంట్రోల్ యూనిట్లతోపాటు ఎస్‌ఇసి వారి 792 బ్యాలెట్ యూనిట్లు, 794 కంట్రోల్ యూనిట్లు ఉన్నాయన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు తమవద్ద పెండింగ్‌లో ఏవీ లేవని ఎన్నికల అధికారికి కలెక్టర్ వివరించారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.