కడప

కోర్టు ఉద్యోగాల్లో వికలాంగులకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప లీగల్,మార్చి 24: జిల్లా వ్యాప్తంగా 225 ఔట్‌సోర్సింగ్ పద్ధతి ద్వారా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నామని, అందులో వికలాంగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జిల్లా ప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ హామీ ఇచ్చారు. శనివారం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో వికలాంగుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎవరైనా వ్యక్తులు వికలాంగుల హక్కులను కాలరాస్తే అట్టివారిని చట్టంప్రకారం శిక్షించేందుకు వెనుకాడబోమని, మీరు చెప్పిన విధంగా ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ, కలెక్టర్ ఉత్తర్వులు ఖాతరు చేయకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే ఆ అధికారికి నోటీసులు పంపి చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. జిల్లాలోని ఫ్యాక్టరీల్లో, డిపార్ట్‌మెంట్లలో, ఆర్టీపీపీ తదితర వాటిల్లో 4శాతం వికలాంగుల కోటాను భర్తీ చేయమని ఉత్తర్వులు జారీ చేస్తామని, అలాగే ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్‌ను తప్పక పాటించాల్సిందిగా ఆర్‌ఎంకు ఆదేశాలు ఇస్తానని జడ్జి హామీ ఇచ్చారు. వికలాంగుల సంక్షేమశాఖ ఏడి వాణి మాట్లాడుతూ తమ దృష్టికి ఏవైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్నసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వికలాంగుల రాజప్రతాన్ని జిల్లా జడ్జి శ్రీనివాస్, న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి యు.యు.ప్రసాద్, ఏడి వాణిలు ఆవిష్కరించారు. అలాగే జిల్లా జడ్జి వికలాంగులను సత్కరించారు. సమావేశంలో జిల్లాలోని వికలాంగులందరూ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
కడప లీగల్,మార్చి 24: సీమ న్యాయవాదుల ఉద్యమాన్ని పక్కదారిన పట్టించేందుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం యొక్క ద్వంధవైఖరి బయటపడిందని సీమ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎస్.మస్తాన్‌వలీ పేర్కొన్నారు. శనివారం నాలుగు జిల్లాల సీమన్యాయవాదులు కడపలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమ న్యాయవాదుల డిమాండ్ హైకోర్టును ఏర్పాటు చేయాలని, కానీ సీఎం అసెంబ్లీలో హైకోర్టు బదులు బెంచ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉన్నదన్నారు. కానీ ఆయన ద్వంధ అర్థానికి నిదర్శనం ఇంతవరకూ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, గవర్నర్‌కు కానీ, సుప్రీంకోర్టు సిజేకి కానీ ప్రతిపాదనలు పంపలేదని ధ్వజమెత్తారు. హైకోర్టు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సికె శివారెడ్డి మాట్లాడుతూ దశ నిర్దేశం చేయగల శక్తి న్యాయవాదులకే ఉందని, గత 61రోజులుగా న్యాయవాదులు వివిధ పద్దతుల్లో ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, అలాగే గతంలో సీమన్యాయవాదులు హైకోర్టు బెంచ్‌కు ఎన్నో పోరాటాలు చేసినా ప్రభుత్వాలు స్పందించలేదని, ఈ ఉద్యమాన్ని ఆపకుండా కొనసాగించాలని లేనిపక్షంలో ప్రభుత్వాలు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాయన్నారు. కాగా సీమలో హైకోర్టునే స్థాపించాలి ,బెంచ్ వద్దని పలువురు న్యాయవాదులు నినాదాలు చేశారు. జేఏసీ సమావేశంలో ఈనెల 30వ తేదివరకు న్యాయవాదులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టాలని తీర్మానం చేశారు. ఈనెల 31న తిరుపతిలో మరోమారు నాలుగు జిల్లాల న్యాయవాదులు సమావేశం కావాలని నిర్ణయించారు.