కడప

నందలూరును ఎడారిగా మారుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, మార్చి 24: ఒంటిమిట్ట మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు చెయ్యేటిలో వాటర్‌స్కీం ఏర్పాటు చేసి నందలూరును ఎడారిగా మారుస్తారా అంటూ స్థానిక ప్రజలు ఆందోళన జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు రామచంద్రశేఖర్, మస్తానయ్య, విశ్వనాధ్, సుధీర్, భవన మేస్ర్తి సంఘం అధ్యక్షులు వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ గతంలో రామాపురం గ్రామానికి తాగునీరు అందించేందుకు వాటర్‌స్కీం ఏర్పాటు చేసి రాజంపేట మండలానికి నీటిని తరలించడంతో నేడు వంద అడుగులకు కూడా నీళ్లు పడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 3 మీటర్ల కంటే ఎక్కువ లోతు బోరు వేస్తే ఫ్లోరైడ్ నీళ్లు వస్తుందని అటు అధికారులు శాస్తవ్రేత్తలు చెప్పడం జరిగిందని, ఒంటిమిట్ట మండలంలోని మూడు పంచాయతీల్లోని 26 గ్రామాల కోసం వాటర్‌స్కీంను నాగిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని చెయ్యేరులో వేయడానికి ప్రయత్నం చేయడం తగదన్నారు. దాదాపు ఈ పంచాయతీలో 30 వేలకు జనాభా ఉన్నారని మాకే తాగేందుకు నీళ్లు లేకుంటే ఇతర ప్రాంతాలకు తరలించి నందలూరును ఎడారిగా మారుస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నుండి కుడి, ఎడమ కాలువలను ఏర్పాటు చేసి ఇటువంటి వాటర్‌స్కీంలను ఏర్పాటు చేయాలన్నారు. నందలూరు మండలంలో ఆల్విన్, రైల్వే పరిశ్రమలు మూతపడ్డా మంచినీటికి కొదవ లేదని ఇతర ప్రాంతాల వారు కూడా స్థిరపడ్డారన్నారు. ప్రస్తుతం వేసవికాలంలో నాగిరెడ్డిపల్లెలో తాగునీరు అందించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మళ్లీ ఇతర ప్రాంతాలకు తరలిస్తే స్థానిక ప్రజల పరిస్థితి ఏంటని ఇక్కడున్న వారందరూ వేరే ప్రాంతాలకు తరులుతున్నారన్నారు. దీనికితోడు చెయ్యేరులోని ఇసుకను ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిపై శ్రద్ధ చూపి నందలూరు మండలాన్ని అభివృద్ధిపరిచేది పోయి ఎడారిగా మారుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఒంటిమిట్ట వాటర్‌స్కీం పనులను నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందలూరు బార్ అసోసియేషన్ సెక్రటరీ సుబ్బరామయ్య, ప్రముఖ న్యాయవాది హబీబుల్లాఖాన్, స్థానిక నాయకులు సయ్యద్ అమీర్, గౌస్‌బేగ్, షాజహాన్, మొయినుద్దీన్, ఖాజాపీర్, హిమగిరినాధ్, వెంకటయ్య, మహబూబ్‌బాష తదితరులు పాల్గొన్నారు.

క్షయ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలి
* కలెక్టర్ బాబూరావునాయుడు
కడప అర్బన్,మార్చి 24: ప్రజలకు వచ్చే జబ్బులలో క్షయవ్యాధి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, అయితే ఇందుకు సంబంధించిన మందులు సక్రమంగా వైద్యుల సలహామేరకు వాడితే వ్యాధి పూర్తిగా నయవౌతుందని కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతిరోజు దగ్గురావడం, సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు 10రోజులకు మించి వుంటే తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధికి, హెచ్‌ఐవి వ్యాధికి దగ్గర సంబంధం ఉందని, ప్రజలు పై లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఒక వ్యక్తి నుంచి 20మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్నారు. 1982లో జాతీయ క్షయ నిరోధక కార్యక్రమాలు అమలుపెట్టినా దశల వారీగా సరిదిద్ది పూర్తిస్థాయిలో అమలు జరుగుతుందన్నారు. కార్యక్రమం కడప జిల్లాలో 2003 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. క్షయ రోగి దగ్గినప్పుడు ఆ క్రిములు గాలిలోకి వ్యాపించి ఇతరులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ఏపిలో ప్రతి ఏడాది 4500 మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని, ప్రభుత్వాసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తుడికి ఆరునెలల నుంచి 8నెలల వరకు ఉచితంగా మందులు అందజేస్తున్నారని, జబ్బు ఉన్నవారికి నెలకు రూ.500లు పౌష్టికాహారం కోసం పెన్షన్ ఇస్తామన్నారు. జిల్లాలో 17348మంది టీబీ పేషెంట్లు మందులు వాడుతున్నారన్నారు. అలాగే 15925 మంది క్షయ వ్యాధి నుండి పూర్తిగా మందులు వాడి విముక్తి పొందారన్నారు.