కడప

సీపీఐ సాహితీ సమాలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 24: ఏప్రిల్ 6వ తేది నుండి 9వ తేదీ వరకు నాలుగురోజులు జరగనున్న భారతీయ కమ్యూనిస్టుపార్టీ (సీపీఐ) రాష్ట్ర మహాసభల్లో తొలిరోజును పూర్తిగా సాహితీ సాంస్కృతిక వేడుకగా జరపాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో స్థానిక రచయితలు, సీపీఐ నేతలు ఇందుకోసం సాహితీ సమాలోచన నిర్వహించారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన, అరసం జిల్లా కార్యదర్శి పాలగిరి విశ్వప్రసాదరెడ్డి పర్యవేక్షణలో ఈ సాహితీ సమాలోచన జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తొలుత మాట్లాడుతూ గోరటి వెంకన్న , గద్దర్, సుద్దాల అశోక్‌తేజలను ఆహ్వానించామని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న కళాబృందాలతో సంప్రదించామని , అనేక మంది వస్తున్నారని తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 6వరకు ఈ కళాబృందాలు జిల్లాలోని గ్రామగ్రామాల్లో వీధి ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం వంటి అంశాలపై రూపొందించుకున్న వీధి నాటకాలను, పాటలను వీరు జనంలోకి వెళ్లి ప్రదర్శిస్తారని తెలిపారు. ఇక 6వ తేదీన పూర్తిగా సాహితీ సాంస్కృతిక వేడుకగా మహాసభలను నిర్వహించేందుకు నిర్ణయించామని, దీనిపై దిశ నిర్దేశం చేయాలని సమావేశాన్ని కోరారు. సీపీఐ రాష్టన్రేత ఓబులేసు, అరసం రాష్టన్రేతలు సంజీవమ్మ, మాచిరెడ్డి, సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రజనీ కాంత్‌రెడ్డి, జానమద్ది విజయభాస్కర్, వేంపల్లె గంగాధర్ తదితరులు తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. చివరగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, సాహిత్యం, సాంస్కృతిక ప్రదర్శనల సమ్మేళనంగా ఆరోజు నిర్వహించాలని తీర్మానించారు. సాహిత్యపరంగా ‘సమకాలీన సామాజిక సంక్షోభం - రచయితల ప్రతిస్పందన’ శీర్షికతో నాలుగు అంశాలపై ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలపై జరిగే ఉపన్యాసాల వేదికలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వర్గీయ రచయిత పేరును పెట్టాలని నిర్ణయించారు. సొదుం జయరాం వేదికపై ‘ఆర్థిక సంక్షోభం ’అనే అంశంపై రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, గోరటి వెంకన్న , సీపీఐ రాష్టన్రేత రామకృష్ణ ప్రసంగాలు ఉంటాయి. తర్వాత అంశమైన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ పై ఉపన్యాసాలు సొదుం రామ్మోహన్ వేదికపై జరుగుతాయి. సింగమనేని నారాయణ, ముత్యాల ప్రసాద్,వల్లూరి శివప్రసాద్‌లు ఈ అంశంపై ప్రసంగిస్తారు. వైసీవీ రెడ్డి వేదికపై ‘వర్దమాన సమాజం- వివక్ష’ అనే అంశంపై వేంపల్లె గంగాధర్, ఎన్.ఈశ్వరరెడ్డి, రాసానిలు ఉపన్యసిస్తారు. కమ్ము శ్యామల వేదికపై ‘సాంస్కృతిక సంక్షోభం ’అనే అంశంపై పి.సంజీవమ్మ, సత్యాగ్ని, తవ్వా ఓబులరెడ్డిలు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రధాన సమన్వయకర్తగా కేతు విశ్వనాధరెడ్డి వ్యవహరిస్తారు. కార్యక్రమాలను అరసం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.ఈశ్వరరెడ్డి, పాలగిరి విశ్వప్రసాదరెడ్డిలు పర్యవేక్షించాలని సాహితీ సమాలోచన సమావేశం తీర్మానం చేసింది.

యూటర్న్ అంకుల్ చంద్రబాబు..
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, మార్చి 24: ఊసరవెళ్ళి కన్నా త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగులు మారుస్తున్నారని, అందుకే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును యూటర్న్ అంకుల్ అని పిలుస్తారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలా బాగుంది అంటూ ఒక పక్క ప్రధాని నరేంద్రమోడీని అభినందించండి చంద్రబాబేనన్నారు. బీజేపీ మాకు ఎప్పుడూ అనుకూల పార్టీయేనని చెప్పింది, కాంగ్రెస్ విధనాలకు వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ అని చంద్రబాబు చెప్పారన్నారు. ఈ రోజు విధానాలు, విలువలను అన్ని పక్కనపెట్టి రాజకీయమే తనకు ముఖ్యం అన్నట్లుగా రాష్ట్ర శ్రేయస్సు అనవసరమన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాశ్రేయస్సు, రాష్ట్రం మేలుకోరే వ్యక్తే ఈ రాష్ట్రానికి అవసరమన్నారు. ఒక పక్కేమో రాజకీయంగా తన మంత్రులు రాజీనామాలు చేశారంటారు, మరో పక్క బీజేపీతో తెగతెంపులు అంటాడు మళ్లీ సుజనాచౌదరితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటాడన్నారు. అదే వ్యక్తి హోదా అవసరం లేదు ప్యాకేజీ ఇచ్చినా సర్దుకుంటామని మాట్లాడుతాడని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈయన మాటలు విధానాన్ని చూసి ప్రజలు కూడా యూటర్న్ అంకుల్ అని పేరు పెట్టుకున్నారన్నారు. 2008లో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింల సమక్షంలోనే తన జీవితంలో ఇంకెప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోము నాది లౌకిక పార్టీ అని మాట్లాడిన వ్యక్తి, ఆ పవిత్రమైన రోజున చెప్పిన మాటలను తుంగలో తొక్కి, 2014లో నరేంద్రమోడీ నాయకత్వాన బీజేపీతో కలిసి పోటీ చేసి మంత్రివర్గంలో కూడా పాలు పంచుకున్నారన్నారు. మరి ఈ రోజేమో ముస్లింలు నాకు మద్దతు ఇవ్వండి అంటున్నాడు, ఆ అర్హత చంద్రబాబుకు లేదు, ఎందుకంటే ఊసరవెళ్లి కన్నా త్వరగా రంగులు మార్చే చంద్రబాబును ఏ ఒక్కరూ నమ్మరన్నారు. ఒక పక్క కాపుల రిజర్వేషన్, బోయలను ఎస్టీలో చేరుస్తామన్నాడు. ఈ రోజు తన బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఏ ఒక్క చోట నిలకడగాలేని మనిషికి ప్రతిరూపం చంద్రబాబేనన్నారు. ముస్లింలకు దేశంలో మొట్టమొదటగా 4 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన ఘనత వై ఎస్ ఆర్‌దేనని తెలిపారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠాన్ని త్వరలోనే చెబుతారన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కొలిమి చాన్‌బాష, గంగిరెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ మాలే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.