కడప

శోభాయమానంగా రాములోని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట,మార్చి 24: ప్రపంచంలోనే రామాలయాల్లో ఒక విశిష్టస్థానం సంపాదించిన ఏకశిలానగర కోదండరామస్వామి వార్షిక బ్రహ్సోత్సవాలు శనివారం శోభాయమానంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని అలంకరించిన వివిధ పూల అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముందుగా సీతారామ లక్ష్మణ మూలవిరాట్‌లకు పంచామృత సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని పట్టుపీతాంబరాలతో అలంకరించారు. సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం ఆరంభించారు. ముందుగా సంప్రదాయం ప్రకారం ఆలయ మద్యరంగంలో విశ్వక్షేన ఆరాధన పూజలు ప్రారంభించారు. సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆలయ మద్యరంగంలో ఏర్పాటు చేశారు. స్వస్తి పుణ్యావాచనం కార్యక్రమాలతో మొదటిరోజు ఉత్సవాలకు అంకురార్పణ చేపట్టారు. ముందుగా అర్చకులు టీటీడీ సిబ్బందితో మహాసంకల్పాన్ని చేయించారు. తర్వాత వివిధ రకాల ఏర్పాట్లు చేసిన పుష్పాలను, ఫలాలను, సుగంద ద్రవ్యాలకు సంప్రోక్షణ చేశారు. గణపతి పూజ, స్వస్తిపుణ్యవాచనం తదితర కార్యక్రమాలు కేరళ వాయిద్యాల మద్య, మరో పక్క వేదమంత్రోచ్చారణల మద్య అంకురార్పణ చేశారు. తర్వాత ఆలయంలోని పుట్టబంగారాన్ని శాస్త్రోక్తంగా తీశారు. యాగశాలలో ఏర్పాటుచేసిన కలశాల వద్ద పూజలు నిర్వహించారు. పుట్టబంగారాన్ని తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఒక పక్క వేదమంత్రోచ్చారణలు మిన్నంటగా మరో పక్క తల తలమెరిసే విద్యుత్ అలంకారాల మద్య కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మహాఘట్టం శోభాయమానంగా జరిగింది. వివిధ రకాల దేవతామూర్తుల ఆకారాలతో ఏర్పాటు చేసిన లైటింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. అలాగే మాడ వీధుల పక్కనే ఏర్పాటు చేసిన పార్కును అందంగా అలంకరించారు. మొత్తం మీద అంకురార్పణ మహోత్సవం అంబరాన్నంటిందని చెప్పవచ్చు.
ఏకశిలానగర కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం జరగనుంది. అలాగే శ్రీరామనవమి, సాయంత్రం పోతన జయంతి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. నవమి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం మహాకవి బమ్మెర పోతనమాత్యుడి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి కవిసమ్మేళనం నిర్వహించారు. అలాగే ఆదివారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమానికి జిల్లా మంత్రులు రానున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మరో మంత్రి ఆదినారాయణరెడ్డి, విప్ మేడా మల్లికార్జునరెడ్డితో పాటు జిల్లా అధికారులు హాజరౌతారు.

రాష్ట్రాన్ని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
కడప సిటీ,మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌ను పాడుచేయడమే లక్ష్యంగా పెట్టుకుని భారతీయ జనతాపార్టీ పనిచేస్తోందని శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మిన వారిని ముంచడమే మోదీ లక్ష్యంగా మారిందన్నారు. మిత్రపక్షంగా ఉన్న మీకు ఏపీ ఏమిద్రోహం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, పవన్ కల్యాణ్ లాంటివారిని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. ఒకవైపు అవిశ్వాసం అంటూనే ఏ-2 లాంటి నేరస్తులు ప్రధాని కార్యాలయంలో రాత్రి డిన్నర్ మీటింగ్‌లు పెట్టుకోవడం ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. స్థిరత్వం లేని వ్యక్తి ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియని పవన్‌కల్యాణ్ చంద్రబాబును విమర్శించడం దారుణంగా ఉందన్నారు. పవన్ అన్న చిరంజీవి పార్టీ పెట్టి అందరిని ముంచిననాడు టికెట్లు అమ్ముకుని అభ్యర్థులను దోచుకున్నరోజు ఈ ప్రశ్నలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఎన్‌డీఏలో ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని దాంతోకూడా తమపార్టీ తెగతెంపులు చేసుకుందన్నారు. 2019లో రానున్న ఎన్నికల్లో బీజేపీకి కూడా గతంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు సమర్ధించి బలపరుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధికోసం దరఖాస్తు చేసుకున్న 62మందికి రూ.36,77000 ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందిందని, దీనికి ఆయాపేర్లతో వచ్చిన చెక్కులను లబ్దిదారులకు ఆయన అందించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ కార్యకర్తలకు సహాయ నిధి నుండే కాకుండా బసవతారకం ఆసుపత్రి నుండి కూడా కావాల్సినంత సహకారం అందుతోందన్నారు. తెలుగుదేశంపార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్కెట్ యార్డు చైర్మన్ సహకారంతో బసవ తారకం ఆసుపత్రి నుంచి 12 మంది డాక్టర్లతో ఒక క్యాన్సర్ నిర్దారణ వాహనం జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు. 29వ తేది రాయచోటిలో ఈ క్యాన్సర్ క్యాంప్ జరుగుతుందన్నారు. కడప నగరం నుంచి రాయచోటికి శ్రీనివాసరెడ్డి సహకారంతో బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు నిర్థారణ పరీక్షలు అనంతరం అదే బస్సులో నగరానికి రావచ్చున్నారు.